Salman Khan: ఆయుధం లేకుండానే.. ‘టైగర్’ వారి అంతు చూస్తాడు

ABN , First Publish Date - 2023-10-14T10:30:28+05:30 IST

‘టైగర్ 3’ చిత్రం రా అండ్ రియలిస్టిక్‌గా ఉంటుంది. టైగర్ ఫ్రాంచైజీ విషయానికి వస్తే అందులో హీరోని లార్జర్ దేన్ లైఫ్‌లా ఆవిష్కరిస్తారు. హీరో అందులో ఆయుధం లేకుండానే శత్రువుల అంతం చూస్తాడు. అక్టోబర్ 16న విడుదలవుతున్న ‘టైగర్ 3’ ట్రైలర్ ఆడియెన్స్‌కి నచ్చుతుందని భావిస్తున్నానని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చారు.

Salman Khan: ఆయుధం లేకుండానే.. ‘టైగర్’ వారి అంతు చూస్తాడు
Salman Khan

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ చిత్రం ‘టైగర్ 3’ (Tiger 3). అక్టోబర్ 16 మధ్యాహ్నం 12 గంటలకు ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేయటానికి నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films) సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి మేకర్స్ సల్మాన్ ఖాన్ అలియాస్ టైగర్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో సల్మాన్ ఇనుప గొలుసు పట్టుకుని శత్రువుల భరతం పట్టటానికి సిద్ధంగా ఉన్నట్లుగా కనపడుతున్నారు. ఈ పోస్టర్ ద్వారా ‘టైగర్ 3’ చిత్రం రా అండ్ రియలిస్టిక్‌గా ఉంటుందనే విషయం తెలుస్తోంది. ఇక ట్రైలర్ ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటీ అందరిలోనూ పెరుగుతుంది. ఈ టైగర్ తిరుగులేని శక్తితో.. తన శత్రువులను వేటాడటానికి సిద్ధంగా ఉందని.. దీనిపై ట్రైలర్‌తో మరింత క్లారిటీ వస్తుందని మేకర్స్ చెబుతున్నారు. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా ‘టైగర్ 3’ రానుంది. ఈ ఏడాది దీపావళి (Diwali)కి ఈ చిత్రం రిలీజ్ కానుంది.

ఈ సినిమా గురించి సల్మాన్ ఖాన్ (Salman Khan) మాట్లాడుతూ.. ‘టైగర్ 3’ చిత్రం రా అండ్ రియలిస్టిక్‌గా ఉంటుంది. టైగర్ ఫ్రాంచైజీ విషయానికి వస్తే అందులో హీరోని లార్జర్ దేన్ లైఫ్‌లా ఆవిష్కరిస్తారు. హీరో అందులో ఆయుధం లేకుండానే శత్రువుల అంతం చూస్తాడు. తన శత్రువుల్లో చివరివాడు అంతమయ్యే వరకు టైగర్ అలాగే నిలబడి ఉంటాడు. తను సవాళ్లను స్వీకరిస్తాడు. దాన్ని పూర్తి చేయటంలో వెనకడుగు వేయడు. నిజ జీవితంలోనూ టైగర్ తన వేటను పూర్తి చేసే వరకు వెనకడుగే వేయదు. ఇందులో నా పాత్ర టైగర్‌లా ఉంటుంది. హీరో పాత్ర పోరాటంలో వెనక్కి తగ్గకుండా ఉంటుంది. తను అస్సలు వెనక్కి తగ్గడు. దేశం కోసం చివరి వరకు నిలబడే వ్యక్తి తనే అవుతాడు. అలాంటి టైగర్ పాత్రను సిల్వర్ స్క్రిన్‌పై వైఆర్ఎఫ్ (YRF) సంస్థ ఎలా ఆవిష్కరించనుందో చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ప్రేక్షకుల్లోనూ అదే ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఆడియెన్స్ టైగర్ యాక్షన్‌ని చూడటానికి ఇష్టపడతారు. అక్టోబర్ 16న విడుదలవుతున్న ట్రైలర్ ఆడియెన్స్‌కి నచ్చుతుందని భావిస్తున్నాను. ఇందులో ప్రేక్షకులు ఇప్పటి వరకు వెండితెరపై చూడనటువంటి అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలున్నాయని చెప్పుకొచ్చారు.


Salman.jpg

సాధారణ ప్రేక్షకులతో పాటు నెటిజన్స్ సైతం టైగర్ 3 ట్రైలర్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌ (YRF Spy Universe)లో తదుపరి ఆధ్యాయంగా ఆదిత్య చోప్రా దేన్ని చూపించబోతున్నారోననే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇప్పటి వరకు వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ బ్యానర్ నుంచి వచ్చిన స్పై థ్రిల్లర్స్ అన్నీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. ఈ యూనివర్స్ నుంచి ఇప్పటి వరకు ‘ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్’ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ‘టైగర్ 3’ రిలీజ్‌కి సిద్ధమవుతోంది.


ఇవి కూడా చదవండి:

============================

*Taapsee Pannu: ఇప్పటి వరకు కమర్షియల్ హీరోతో చేసే అవకాశం రాలేదంటూ సంచలన వ్యాఖ్యలు

*************************************

*KCR: ‘కేసీఆర్’ పేరుతో సినిమా.. హీరో ఎవరంటే..

************************************

*UnstoppableWithNBK3 Promo: ఒకడు నాశనం చేస్తాడు.. మళ్లీ సెట్ చేయడానికి హీరోలు జైలు నుంచి రావాల్సిందే..

********************************

*University: ‘యూనివర్సిటీ’కి వస్తోన్న స్పందనతో పీపుల్ స్టార్ ఏమన్నారంటే..

*********************************

*Shruti Haasan: శృతిహాసన్‌కు ఆ సినిమా ఎంతో స్పెషలట.. అస్సలు వదలడం లేదు

***********************************

Updated Date - 2023-10-14T10:30:28+05:30 IST