Eagle: ఎవరెవరు వస్తున్నారో అనవసరం.. సంక్రాంతికి మాస్ రాజా డేట్ ఫిక్స్ చేశాడోచ్..

ABN , First Publish Date - 2023-09-27T23:05:31+05:30 IST

‘ధమాకా’ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత మరోసారి పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో రవితేజ చేస్తున్న చిత్రం ‘ఈగల్’. సినిమాటోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా మారిన కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో యూనిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాని 2024 సంక్రాంతి, జనవరి 13న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Eagle: ఎవరెవరు వస్తున్నారో అనవసరం.. సంక్రాంతికి మాస్ రాజా డేట్ ఫిక్స్ చేశాడోచ్..
Eagle Movie Poster

రాబోయే సంక్రాంతికి విడుదల కాబోయే సినిమాల విషయంలో పెద్ద లిస్టే వినిపిస్తోంది. ముఖ్యంగా మహేష్ ‘గుంటూరు కారం’ (Mahesh Guntur Kaaram), నాగార్జున ‘నా సామిరంగా’ (Nagarjuna Naa Saamiranga), విజయ్ దేవరకొండ 13వ చిత్రం (VD13), తేజ సజ్జా ‘హను-మాన్’ (Teja Sajja Hanu-Man).. ఇలా ఓ అరడజనుకు పైగా సినిమాలు సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నాయి. మరి ఆ టైమ్‌కి ఏ సినిమా సిద్ధంగా ఉంటుందో తెలియదు కానీ.. మాస్ మహారాజా రవితేజ మాత్రం సంక్రాంతికి వస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించడమే కాదు.. డేట్ కూడా రివీల్ చేసేశారు. ‘ధమాకా’ (Dhamaka) బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత మరోసారి పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో రవితేజ చేస్తున్న చిత్రం ‘ఈగల్’ (Eagle). సినిమాటోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా మారిన కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో యూనిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే రవితేజ పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన టైటిల్‌ గ్లింప్స్‌.. ట్రెమండస్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకోగా.. తాజాగా మేకర్స్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు.

‘ఈగల్’ మూవీ విడుదల తేదీని తెలియజేస్తూ.. బుధవారం ఇంటెన్స్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా 2024 సంక్రాంతికి జనవరి 13న విడుదల కానుంది. పోస్టర్‌లో రవితేజ చేతిలో తుపాకీ ఉండగా.. నిప్పుఅంటుకున్న అడవిలో స్టైలిష్‌గా నిలబడి ఉన్నారు. అయితే, పోస్టర్‌లో రవితేజ ముఖం కనిపించడం లేదు.. అక్కడ రెస్క్యూ టీం విమానం మాత్రం కనిపిస్తోంది. ఈ సినిమాలో రవితేజ మల్టీ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు. అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameshwaran), కావ్య థాపర్ (Kavya Thapar) హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో నవదీప్, మధుబాల ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే సంక్రాంతికి వస్తున్న మొనగాడు సిద్ధమయ్యాడంటూ రవితేజ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ సినిమా పేరును ట్రెండ్ చేస్తున్నారు. (Ravi Teja Starring Eagle Movie Release Date Out)


Eagle.jpg

కార్తీక్ ఘట్టమనేని రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మణిబాబు కరణంతో పాటు కార్తిక్ స్వయంగా స్క్రీన్‌ప్లే రాశారు. టీజీ విశ్వ ప్రసాద్ (T.G Vishwa Prasad) ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ హైబడ్జెట్ ఎంటర్‌టైనర్ కోసం టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. మణిబాబు కరణం డైలాగ్స్ అందించిన ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని (Karthik Gattamneni) ఎడిటర్, సినిమాటోగ్రాఫర్ కూడా. దవ్‌జాంద్ సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలోనే మేకర్స్ మరిన్ని వివరాలను తెలియజేయనున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Agent: ‘ఏజెంట్’ని వదలని కష్టాలు.. ఓటీటీ‌లో విడుదల డౌటే.. ఎందుకంటే?

***************************************

*Pawan Kalyan: జనసేనకు స్టంట్ మేన్ బద్రి విరాళం

*************************************

*Bhagavanth Kesari: బాలయ్య ‘భగవంత్ కేసరి’ నుంచి స్పెషల్ సర్‌ప్రైజ్.. ఎప్పుడంటే?

**********************************

*Vishal: అదోరకం సనాతన ధర్మం.. విశాల్‌ వ్యాఖ్యలకు నిర్మాత కౌంటర్‌

**********************************

*Tiger Nageswara Rao: టైగర్ కా హుకుమ్.. ట్రైలర్ రిలీజ్‌కు డేట్ ఫిక్సయింది

***********************************

Updated Date - 2023-09-27T23:05:31+05:30 IST