Pawan Kalyan: జనసేనకు స్టంట్ మేన్ బద్రి విరాళం

ABN , First Publish Date - 2023-09-27T20:23:35+05:30 IST

బుధవారం సాయంత్రం స్టంట్ మేన్ బద్రి హైదరాబాద్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. ‘భోళాశంకర్’ చిత్రంలో చేసిన స్టంట్స్‌కిగాను తాను అందుకున్న పారితోషికం రూ. 50 వేలు జనసేన పార్టీకి విరాళంగా అందచేశారు.

Pawan Kalyan: జనసేనకు స్టంట్ మేన్ బద్రి విరాళం
Stunt Man Badri and Pawan Kalyan

సినిమాల్లో కార్లను పల్టీలు కొట్టిస్తూ చేసే డేర్ డెవిల్ స్టంట్స్ ఎంతో కష్ట సాధ్యమైనవని, సాహసంతో కూడుకున్నవనీ, తెలుగు చిత్ర పరిశ్రమలో అలాంటి స్టంట్స్ చేయడం స్టంట్ మేన్ బద్రి (Stunt Man Badri)కి మాత్రమే సాధ్యమని జనసేన పార్టీ (Janasena Party) అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. విశాఖలో నటనలో శిక్షణ తీసుకున్నప్పటి నుంచి బద్రితో పరిచయం ఉందన్నారు. ‘భోళాశంకర్’ (Bholaa Shankar) చిత్రంలో చేసిన స్టంట్స్‌కి ఆయన్ని అభినందించారు. బుధవారం సాయంత్రం స్టంట్ మేన్ బద్రి హైదరాబాద్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. ‘భోళాశంకర్’ చిత్రంలో చేసిన స్టంట్స్‌కిగాను తాను అందుకున్న పారితోషికం రూ. 50 వేలు జనసేన పార్టీకి విరాళంగా (Donation) అందచేశారు. ఈ సందర్భంగా బద్రికి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.


Power-Star.jpg

ఈ సందర్భంగా స్టంట్ మేన్ బద్రి (Stunt Man Badri) మాట్లాడుతూ.. “28 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్‌గారు చేసిన సాయమే నన్ను నిలబెట్టింది. సార్ చేసే సాయం నాతో ఆగిపోకూడదు. ఎందరికో ఆయన సాయం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌గారు ముఖ్యమంత్రి (CM) అయితే నాలాంటి ఎంతో మందికి అండగా నిలుస్తారు. ఆ ఆకాంక్షతోనే భోళాశంకర్ చిత్రానికి వచ్చిన పారితోషికాన్ని (Bholaa Shankar Remuneration) జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చాను” అని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

============================

*Bhagavanth Kesari: బాలయ్య ‘భగవంత్ కేసరి’ నుంచి స్పెషల్ సర్‌ప్రైజ్.. ఎప్పుడంటే?

**********************************

*Vishal: అదోరకం సనాతన ధర్మం.. విశాల్‌ వ్యాఖ్యలకు నిర్మాత కౌంటర్‌

**********************************

*Tiger Nageswara Rao: టైగర్ కా హుకుమ్.. ట్రైలర్ రిలీజ్‌కు డేట్ ఫిక్సయింది

***********************************

*Skanda: అడుగడుగునా బోయపాటి మార్క్.. చూసుకుందాం.. బరాబర్ చూసుకుందాం

***************************************

Updated Date - 2023-09-27T20:23:35+05:30 IST