Ravanasura Twitter Review: రవితేజ ‘రావణాసుర’ ట్విట్టర్ టాక్ ఏంటంటే..

ABN , First Publish Date - 2023-04-07T09:43:51+05:30 IST

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రావణాసుర’ శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. సుధీర్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే..

Ravanasura Twitter Review: రవితేజ ‘రావణాసుర’ ట్విట్టర్ టాక్ ఏంటంటే..
Ravanasura Movie Still

మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) మోస్ట్ ఎవైటెడ్ క్రైమ్ యాక్షన్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ ‘రావణాసుర’ (Ravanasura). సుధీర్ వర్మ (Sudheer Varma) దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీది ట్రెమండస్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకోవడమే కాకుండా.. సినిమాపై పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేశాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో రవితేజ ఏదో ప్రయోగం చేశాడనేలా అనిపించాయి. ఇక వరుస విజయాల మీద ఉన్న రవితేజ ఈ చిత్రంతో హ్యాట్రిక్ కూడా కొట్టబోతున్నాడనేలా కూడా టాక్ బయటికి వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇతర ప్రమోషన్స్ అన్నీ కలిపి.. బాక్సాఫీస్‌కు మరో కాసుల వర్షం కురిపించే సినిమా రాబోతున్నట్లుగా సంకేతాలు అయితే ఏర్పరచాయి. మరి ఆ సంకేతాలను ఈ సినిమా నిజంగా చేసిందా? అనేది కాసేపట్లో వచ్చే రివ్యూ చెప్పేస్తుంది. ఈ లోపు ట్విట్టర్‌లో ఈ సినిమాపై టాక్ ఎలా నడుస్తుందో చూద్దాం.. (Ravanasura Twitter Report)

ట్విట్టర్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈ చిత్రానికి ప్రస్తుతం మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. రవితేజ వీరాభిమానులకు మాత్రమే అని కొందరు పోస్ట్ చేస్తుంటే.. మరి కొందరు మాత్రం రవితేజ నటనకు షాక్ అవుతారని అంటున్నారు. ముఖ్యంగా నెగిటివ్ షేడ్స్‌లో రవితేజ యాక్టింగ్ అరిపించేశాడనేలా కొందరు ట్వీట్స్ చేస్తున్నారు. ‘రావణాసుర’కి ముందు, తర్వాత అనేలా రవితేజ నటన గురించి మాట్లాడుకుంటారని, అంత అద్భుతంగా రవితేజ ఈ సినిమాతో ప్రేక్షకులని అలరిస్తాడనేలా కూడా టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే కొన్ని చోట్ల రివ్యూలు కూడా పడ్డాయి. సినిమా చూసిన చాలా మంది.. వారి అభిప్రాయాలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. (Ravi Teja Ravanasura Twitter Review)


సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు విజిల్స్ ఆగవ్.. రవితేజ కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్. క్లైమాక్స్ రాంప్. నెగిటివ్ రివ్యూలను, రూమర్స్‌ను నమ్మవద్దు. అది టైమ్ వేస్ట్. నా మాటలు మార్క్ చేసి పెట్టుకోండి అంటూ ఓ నెటిజన్ ఈ సినిమాకు 3.75 రేటింగ్ ఇచ్చారు. (Ravanasura Twitter Talk)


రావణాసుర పైసావసూల్ సినిమా. రవితేజ పాత్ర అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా నెగిటివ్ రోల్‌లో రవితేజ అరిపించేశాడు. కథ చెప్పిన విధానం అందరినీ మెప్పిస్తుంది. అలాగే ట్విస్ట్‌లు, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అన్ని బాగున్నాయి. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా.. అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.


సినిమా స్టోరీ లైన్ బాగుంది. రవితేజ యాక్టింగ్ ఇరగదీశాడు. ఫస్టాఫ్ డీసెంట్‌గా ఉంది. ఇంటర్వెల్ సీన్ మైండ్ బ్లాంక్. ట్విస్ట్‌లతో సెకండాప్ మెప్పిస్తుంది. ఓవరాల్‌గా రవితేజకు మరో హిట్ పడినట్లే. ఇలా ఎక్కువ శాతం ‘రావణాసుర’కు పాజిటివ్ టాకే వినిపిస్తుంది. అయితే కొంతమంది ఈ సినిమాలో రవితేజ యాక్టింగ్ తప్పితే.. విషయం ఏమీ లేదు అనేలా కూడా పోస్ట్ చేశారు.


రవి అన్న.. ప్లీజ్ ఇలాంటి సినిమాలు మళ్లీ చేయవద్దు. నిప్పు, ఖిలాడీ ఫీల్ అయ్యాను. ఖిలాడి బేటర్ అన్నా. నీకు ఫెయిల్యూర్ రావాలి అని ఎవరూ అనుకో. నువ్వు మాత్రం డిజాస్టర్స్ తీస్తావు.. అని ఓ నెటిజన్ ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఓవరాల్‌గా అయితే రవితేజకు మరో ధమాకా హిట్ అనేలానే టాక్ నడుస్తుంది. మరి ఏ విషయం కాసేపట్లో వచ్చే సమీక్షలో తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి:

*********************************

*Rashmika Mandanna: త్వరలోనే గుడ్ న్యూస్.. రౌడీ హీరోతో ఒకే ఇంట్లో, ఒకే గదిలో..!?

*NBK SRH: పాపం మన SRH క్రికెటర్లు.. బాలయ్య డైలాగ్స్ చెప్పలేక ఎన్ని తిప్పలు పడ్డారో..!

*Dasara Nani: అందరికీ చెప్పేది ఒకటే.. చాలా మంది చాలా చెప్తారు.. ఎవ్వరి మాటలు వినకండి

*Ustaad Bhagat Singh: ఫ్రంట్ ఏంటి? బ్యాక్ ఏంటి?.. కంటెంట్ ఉన్నోడి కటౌట్ చాలదా..

*Hanuman Jayanti Special: ‘ఆదిపురుష్’ నుంచి హనుమాన్ పోస్టర్.. ఎలా ఉందంటే?

*Upasana Baby Shower Party: వీడియోతో సర్‌ప్రైజ్ చేసిన ఉపాసన.. చరణ్ లుక్ అదుర్స్!

Updated Date - 2023-04-07T10:01:26+05:30 IST