Ustaad Bhagat Singh: ఫ్రంట్ ఏంటి? బ్యాక్ ఏంటి?.. కంటెంట్ ఉన్నోడి కటౌట్ చాలదా..

ABN , First Publish Date - 2023-04-06T11:30:40+05:30 IST

బుధవారం విడుదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌పై కొందరు యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుంటే.. వారికి మెగా ఫ్యాన్స్ ధీటుగా సమాధానం ఇస్తున్నారు.. ఎలా అంటే?

Ustaad Bhagat Singh: ఫ్రంట్ ఏంటి? బ్యాక్ ఏంటి?.. కంటెంట్ ఉన్నోడి కటౌట్ చాలదా..
Ustaad Bhagat Singh First Look

‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తరువాత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) ద్వయం మరోసారి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) కోసం చేతులు కలిపారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కి జోడీగా మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela) నటిస్తోంది. ఈ చిత్రం గత డిసెంబర్‌లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన విషయం తెలిసిందే. బుధవారం చిత్ర రెగ్యులర్ షూటింగ్‌ని మేకర్స్ స్టార్ట్ చేశారు. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి (Anand Sai) రూపొందించిన పోలీస్ స్టేషన్ సెట్‌లో మొదటి షెడ్యూల్ ప్రారంభమైంది. కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్న ఈ షెడ్యూల్‌లో పవన్ కళ్యాణ్‌తో పాటు ఇతర ముఖ్య తారాగణం పాల్గొననున్నారు.

Read Also-Hanuman Jayanti Special: ‘ఆదిపురుష్’ నుంచి హనుమాన్ పోస్టర్.. ఎలా ఉందంటే?

ఇదిలా ఉంటే.. ఈ మధ్య సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అప్‌డేట్స్ అంటూ ఎలా హంగామా చేస్తున్నారో తెలిసిందే. ఒక్కోసారి శృతిమించి మరీ ప్రవర్తిస్తూ.. నిర్మాణ సంస్థలని బూతులు తిడుతుంటారు. ‘రాధే శ్యామ్’ (Radhe Shyam) విషయంలో ఇది జరిగింది కూడా. ఆ తర్వాత కూడా స్టార్ హీరోల సినిమాల అప్‌డేట్ కోసం వారి అభిమానులు సోషల్ మీడియాలో యుద్ధవాతావరణాన్నే సృష్టిస్తూ వస్తున్నారు. వారి బాధను తట్టుకోలేక.. ఫ్యాన్స్ అడగకుండానే నిర్మాణ సంస్థలు ఏదో ఒక అప్‌డేట్ ఇస్తున్నారు. రీసెంట్‌గా మహేష్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్‌ (Trivikram)ల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న SSMB28 చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ని.. మేకర్స్ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా విడుదల చేసి.. ఫ్యాన్స్‌‌కు సర్‌ప్రైజ్ ట్రీట్ ఇచ్చారు. మళ్లీ పలానా మంత్ వరకు అప్‌డేట్ అడగవద్దంటూ ముందు జాగ్రత్తగా ఫ్యాన్స్‌కి ఓ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. సేమ్ టు సేమ్ ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh Movie) చిత్ర విషయంలో కూడా మేకర్స్ అదే చేశారు. ఉదయం పవన్ కళ్యాణ్ షూటింగ్‌లో జాయిన్ అయ్యాడనే న్యూస్‌తో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ బద్దలు కొడుతుంటే.. వారికి మరింత ఉత్సాహం ఇచ్చేలా.. సాయంత్రం ఫస్ట్ లుక్‌ని కూడా రిలీజ్ చేశారు. అంతే.. ఇక ఫ్యాన్స్ తమ తడాఖా చూపించారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్యాగ్‌తో ట్రెండ్ దద్దరిల్లింది.

Power-Star.jpg

అయితే ఈ ఫస్ట్ లుక్ గురించి కొందరు యాంటీ ఫ్యాన్స్ తలతిక్కలుగా కామెంట్స్ చేస్తుండటంతో వారికి కూడా మెగా ఫ్యాన్స్ (Mega Fans) గట్టిగానే కౌంటర్స్ ఇచ్చారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో పవన్ కళ్యాణ్ ఓ చెక్క కుర్చీలో కూర్చుని ఉన్నారు. ఫేస్ కనిపించడం లేదు.. బ్యాక్‌ నుంచి చూపించారు. ఇదే విషయాన్ని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. ‘ఫ్రంట్ ఏంటి? బ్యాక్ ఏంటి?.. కంటెంట్ ఉన్నోడి కటౌట్ చాలు’ అంటూ గబ్బర్‌సింగ్ డైలాగ్‌‌తో కొడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, అత్యుత్తమ సాంకేతిక బృందం పని చేస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

*********************************

*Upasana Baby Shower Party: వీడియోతో సర్‌ప్రైజ్ చేసిన ఉపాసన.. చరణ్ లుక్ అదుర్స్!

*Niharika: పచ్చి మామిడికాయ తింటూ నిహారిక పోస్ట్.. అంతా షాక్!

*Where is Pushpa?: ‘పుష్పరాజ్’ ఎక్కడ?.. సమాధానం తెలిసేది ఎప్పుడంటే?

*Jr NTR: అఫీషియల్.. మరో యుద్ధానికి సిద్ధం

*Rashmika Mandanna: నేషనల్ క్రష్‌ ఎలా అయిందో తెలుసా?

Updated Date - 2023-04-06T11:30:41+05:30 IST