Dasara Nani: అందరికీ చెప్పేది ఒకటే.. చాలా మంది చాలా చెప్తారు.. ఎవ్వరి మాటలు వినకండి

ABN , First Publish Date - 2023-04-06T12:28:52+05:30 IST

చిన్నప్పటి నుంచి ఏదైనా ఒక విషయంలో పది మందిలో ఎనిమిది మంది ఎంకరేజ్ చేస్తే ఒక ఇద్దరు డిస్కరేజ్ చేసేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఏంటో కానీ..

Dasara Nani: అందరికీ చెప్పేది ఒకటే.. చాలా మంది చాలా చెప్తారు.. ఎవ్వరి మాటలు వినకండి
Natural Star Nani

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) మాసియస్ట్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ ‘దసరా’ (Dasara). మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కీర్తి సురేష్ కథానాయికగా, నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని వర్గాల ప్రేక్షకులని నుంచి మంచి స్పందనను రాబట్టుకుంటూ.. బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తూ.. సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్ననేపథ్యంలో.. చిత్రయూనిట్ కరీంనగర్‌లో ‘దసరా బ్లాక్‌బస్టర్ దావత్’ (Dasara Blockbuster Daawath) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించిన దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)కు బిఎండబ్ల్యు కారు (BMW Car)ని బహుకరించారు నిర్మాత సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri). అలాగే దసరా యూనిట్ సభ్యులందరికీ పది గ్రాముల గోల్డ్ కాయిన్స్‌ని కానుకగా ఇచ్చారు. అనంతరం హీరో నాని మాట్లాడుతూ..

Read Also- Desamuduru: చొక్కాలు విప్పి మరీ అభిమానం చాటుకుంటున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్

‘‘దసరా సినిమాని ఇంత పెద్ద బ్లాక్‌బస్టర్ చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా కో డైరెక్టర్ సినిమా షూట్ అయ్యే ముందే నాకు చెప్పాడు. శ్రీకాంత్ చెప్పాడట నాని అన్నలాంటి యాక్టర్‌కి 100 కోట్ల పోస్టర్ చూడాలని కోరిక ఉందట.. అది ఇక్కడ, ఈ స్టేజ్ మీద తీరింది. అదీ కరీంనగర్‌లో జరగటం మా అందరికి మెమరబుల్ ఇది. సినిమా గురించి ఏం చెప్పను.. అందరూ ఈ సినిమాని ఎంత సెలెబ్రేట్ చేసుకుంటున్నారో థియేటర్‌లో మేము చూశాం.. చూసి కడుపు నిండిపోయింది. అయితే పర్సనల్‌గా ఒకటి చెప్పాలనుకుంటే... నేనేదో నాకు తోచింది, నా మనసుకి నచ్చింది చేసుకుంటూ వచ్చాను. అలా చేసేటప్పుడు, ఆ ప్రాసెస్‌లో చాలామంది చాలాసార్లు ఏంటిది.. ఇది కరెక్టా అని క్వశ్చన్ చేసినవాళ్లు, డిస్కరైజ్ చేసినవాళ్లు ఉన్నారు. కానీ, బలంగా.. మనస్ఫూర్తిగా నమ్మిందే కరెక్టుగా దిగిపోయేవాన్ని. అలా అయిన ప్రతిసారి ప్రేక్షకులు ఇచ్చిన సపోర్ట్.. నా నమ్మకాన్ని పదింతలు చేసింది. (Nani Speech at Dasara Blockbuster Daawath)

Nani-2.jpg

దసరా 2 లేదు. దసరా 1 మాత్రమే. ఒక్కటే పీస్ అది. ఎవ్వరైనా మిస్ అయ్యి ఉంటే చూసేయండి. అందరికీ చెప్పేది ఒకటే.. మీ అందరికి నాలాగే కూడా చాలా డ్రీమ్స్ ఉండే ఉంటాయ్. ఎవ్వరినీ కిందికి లాగనివ్వకండి. చాలా మంది చాలా చెప్తారు. ఎవ్వరి మాటలు వినకండి. మన చిన్నప్పటి నుంచి ఏదైనా ఒక విషయంలో పది మందిలో ఎనిమిది మంది ఎంకరేజ్ చేస్తే ఒక ఇద్దరు డిస్కరేజ్ చేసేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఏంటో కానీ ఎనిమిది మంది డిస్కరేజ్ చేస్తే.. ఇద్దరు ఎంకరేజ్ చేస్తున్నారు. మీరవేవి పట్టించుకోకండి, అస్సలు ఆగకండి.. మీకూ కలలు ఉన్నాయి కదా.. మీరు కానీ నమ్మితే బలంగా దిగండి, వందశాతం ఎఫర్ట్ పెట్టండి.. ప్రాణం పెట్టి పని చేయండి. ఖచ్చితంగా జరుగుతాయి. చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు నమ్మకండి. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా సోషల్ మీడియాలో చూస్తున్నా.. ఒక కొత్త సినిమా రిలీజ్ అవుతుంటే ఇది ఆడితే బాగుండు అనుకునే వాళ్ళు తక్కువ.. ఇది ఆడదు చూసుకో అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్లందరిది తప్పు అని ప్రూవ్ చేయాలి. ఈ నెగిటివిటీ అనే చెడు మీద, మంచి గెలిచింది. మన దసరా అనే మంచి గెలిచింది. దసరా పండగ అంటేనే చెడు మీద మంచి గెలవడం.. ఆ సెలెబ్రేషన్ ఈ రోజు ఈ కరీంనగర్‌లో చేసుకుంటున్నాం. ఈ గెలుపు శ్రీకాంత్ ఓదెలది.. సుధాకర్ చెరుకూరిది, ఈ గెలుపు సంతోష్ నారాయణ్‌ది, ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరిది. ఈ గెలుపుకు కారణమైన ప్రేక్షకులందరికీ మరొక్కసారి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను..’’ (Nani Dasara Movie) అని నాని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

*********************************

*Ustaad Bhagat Singh: ఫ్రంట్ ఏంటి? బ్యాక్ ఏంటి?.. కంటెంట్ ఉన్నోడి కటౌట్ చాలదా..

*Hanuman Jayanti Special: ‘ఆదిపురుష్’ నుంచి హనుమాన్ పోస్టర్.. ఎలా ఉందంటే?

*Upasana Baby Shower Party: వీడియోతో సర్‌ప్రైజ్ చేసిన ఉపాసన.. చరణ్ లుక్ అదుర్స్!

*Niharika: పచ్చి మామిడికాయ తింటూ నిహారిక పోస్ట్.. అంతా షాక్!

*Where is Pushpa?: ‘పుష్పరాజ్’ ఎక్కడ?.. సమాధానం తెలిసేది ఎప్పుడంటే?

*Jr NTR: అఫీషియల్.. మరో యుద్ధానికి సిద్ధం

Updated Date - 2023-04-06T12:28:55+05:30 IST