Upasana Baby Shower Party: వీడియోతో సర్‌ప్రైజ్ చేసిన ఉపాసన.. చరణ్ లుక్ అదుర్స్!

ABN , First Publish Date - 2023-04-05T17:18:42+05:30 IST

తాజాగా తన బేబీ షవర్ పార్టీకి (Baby Shower Party) సంబంధించిన వీడియోని ఉపాసన ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేసింది. దీంతో మెగాభిమానులు ఈ వీడియోని

Upasana Baby Shower Party: వీడియోతో సర్‌ప్రైజ్ చేసిన ఉపాసన.. చరణ్ లుక్ అదుర్స్!
Upasana Baby Shower Party at Dubai

దుబాయ్‌లో బెస్ట్ ఫ్రెండ్స్ సమక్షంలో ఉపాసన సీమంతం (Upasana Baby Shower Party) జరిగిన విషయం తెలిసిందే. ఆ ఫంక్షన్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఈ విషయం బయటకి వచ్చింది. తాజాగా తన బేబీ షవర్ పార్టీకి (Baby Shower Party) సంబంధించిన వీడియోని ఉపాసన ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేసింది. దీంతో మెగాభిమానులు ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు. ఇంత ఘనంగా సీమంతం చేసినందుకు.. అలాగే మీరు నాపై చూపించిన అమూల్యమైన ప్రేమకు కృతజ్ఞతలు.. అంటూ తన సిస్టర్స్‌కు ఈ వీడియో ద్వారా ఉపాసన (Upasana Reaction on Baby Shower Party) ధన్యవాదాలు తెలిపింది. తను ఇన్‌స్టాలో చేసిన ఈ పోస్ట్‌లకు సెలబ్రిటీలు సైతం స్పందిస్తూ.. ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal), కియారా (Kiara) వంటి స్టార్ హీరోయిన్స్ కూడా ఈ లిస్ట్‌లో ఉన్నారు.

Upsi-1.jpg

అతి కొద్ది మంది సమక్షంలో దుబాయ్‌లోని (Dubai) నమ్మోస్ బీచ్ క్లబ్‌లోని స్వాంకీలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan), ఉపాసన (Upasana)లను చూసిన మెగాభిమానుల (Mega Fans) ఆనందానికి అయితే అవధులే లేవని చెప్పుకోవాలి. ఇద్దరూ వైట్ డ్రస్సులలో (White Dress) దర్శనమిచ్చి అందరినీ ఆకర్షించారు. అంతేకాదు, ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉందో కూడా ఈ వీడియో చూస్తుంటే తెలుస్తుంది. దుబాయ్‌లో (Dubai) కూడా సాంప్రదాయ బద్దంగానే ఈ వేడుకను నిర్వహించినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే ఉపాసన పోస్ట్ చేసిన కొన్ని నిమిషాలలోనే ఈ వీడియోకు లైక్స్, కామెంట్స్ బీభత్సంగా వస్తుండటం విశేషం.


Upsi-2.jpg

ఇక అసలు సిసలైన బేబీ షవర్ పార్టీని ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో ఘనంగా, కనీవినీ ఎరుగని విధంగా నిర్వహించేందుకు మెగా మరియు కామినేని ఫ్యామిలీలు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వినవస్తున్నాయి. మెగా ఫ్యాన్స్ కూడా ఈ సంబరం కోసం ఎంతగానో వేచి చూస్తున్నారు. ఇక ఉపాసన షేర్ చేసిన ఈ వీడియోతో మరోసారి రామ్ చరణ్, ఉపాసన దంపతులకు (Ram Charan and Upasana Couple) సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్తువెత్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

*********************************

*Niharika: పచ్చి మామిడికాయ తింటూ నిహారిక పోస్ట్.. అంతా షాక్!

*Where is Pushpa?: ‘పుష్పరాజ్’ ఎక్కడ?.. సమాధానం తెలిసేది ఎప్పుడంటే?

*Jr NTR: అఫీషియల్.. మరో యుద్ధానికి సిద్ధం

*Rashmika Mandanna: నేషనల్ క్రష్‌ ఎలా అయిందో తెలుసా?

Updated Date - 2023-04-05T17:18:44+05:30 IST