Actress: అరుదైన వ్యాధి బారిన మరో నటి.. బాబోయ్ పగవారికి కూడా ఈ వ్యాధి రాకూడదు

ABN , First Publish Date - 2023-03-01T22:49:37+05:30 IST

నటీనటులు కొందరు ఈ మధ్య అరుదైన వ్యాధులకు గురవుతున్న విషయం తెలిసిందే. క్యాన్సర్ వ్యాధి బారిన పడి.. చాలా మంది సెలబ్రిటీలు కోలుకున్నారు. ఇప్పుడు వింత వింత వ్యాధులు వారిని భయపెడుతున్నాయి. స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడిప్పుడే

Actress: అరుదైన వ్యాధి బారిన మరో నటి.. బాబోయ్ పగవారికి కూడా ఈ వ్యాధి రాకూడదు
Debina Bonnerjee

నటీనటులు కొందరు ఈ మధ్య అరుదైన వ్యాధులకు గురవుతున్న విషయం తెలిసిందే. క్యాన్సర్ వ్యాధి బారిన పడి.. చాలా మంది సెలబ్రిటీలు కోలుకున్నారు. ఇప్పుడు వింత వింత వ్యాధులు వారిని భయపెడుతున్నాయి. స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడిప్పుడే కాస్త మయోసైటీస్ అనే వ్యాధి నుంచి కోలుకుంటోంది. సమంత అనే కాకుండా ఈ మధ్య చాలా మంది హీరోయిన్ల పేర్లు.. అరుదైన వ్యాధుల బారిన పడుతున్న వారి లిస్ట్‌లో వినిపిస్తున్నాయి. తాజాగా మరో నటి అరుదైన వైరస్ బారిన పడినట్లుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఇంతకీ ఆ నటి ఎవరో కాదు.. తెలుగులో ‘అమ్మాయిలు అబ్బాయిలు’, ‘సిక్స్’ అనే సినిమాలలో హీరోయిన్‌గా నటించిన దెబీనా బోనర్జి (Debina Bonnerjee). ఈ సినిమా తర్వాత ఆమె ‘రామాయణం’ అనే హిందీ సీరియల్‌లో సీతగా నటించింది. తర్వాత ఆ సీరియల్‌లో రాముడిగా నటించిన గురుమీత్ చౌదరినే ఆమె పెళ్లాడింది. వీరికి ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం దెబీనా బోనర్జికి ‘ఇన్ఫ్లుఎంజా బి’ (influenza B) అనే అరుదైన వైరస్ (Virus) సోకింది.

ఈ విషయం స్వయంగా ఆమెనే ప్రకటించింది. ఈ వ్యాధి బారిన పడిన వారు కుటుంబానికి ముఖ్యంగా చిన్నపిల్లలకు దూరంగా ఉండాలట. రీసెంట్‌గా వెకేషన్ నిమిత్తం శ్రీలంక వెళ్లిన దెబీనా.. అక్కడ నుంచి వచ్చిన తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురవడంతో.. వెంటనే డాక్టర్‌ని సంప్రదించిందట. కానీ ఎంత మాత్రం ఆమెకున్న ప్రాబ్లమ్ తగ్గకపోవడంతో.. డాక్టర్స్ కొన్ని మెడికల్ టెస్ట్‌లు సూచించారట. ఈ టెస్ట్‌లలో ‘ఇన్ఫ్లుఎంజా బి’ అనే అరుదైన వ్యాధి ఆమెకు సోకిందని డాక్టర్స్ నిర్ధారించారట. అయితే ఈ వ్యాధి సోకిన వారు చిన్న పిల్లలకు కొన్ని రోజుల పాటు దూరంగా ఉండాలని డాక్టర్స్ సూచించడంతో.. వ్యాధికంటే ఎక్కువగా ఆమె ఈ మాటకి బాధపడుతుందట. ఎందుకంటే పిల్లలిద్దరూ చిన్నవారే కావటంతో పాటు.. వారిని వదిలి అస్సలు ఉండలేని పరిస్థితి తనదని తెలుస్తోంది.

అయితే ప్రాణానికి ప్రాణమైన పిల్లలని వదిలి.. వారికి దూరంగా ఉండటం కొంచెం కష్టమే. కానీ వారి ఆరోగ్యం దృష్ట్యా తప్పదని ఆమె భావిస్తోంది. దెబీనా బోనర్జి చేసిన ఈ పోస్ట్‌లకు నెటిజన్లు కూడా సానుభూతిని ప్రకటిస్తున్నారు. ఇటువంటిది పగవారికి కూడా రాకూడదు అంటూ వారు చేస్తున్న కామెంట్స్‌తో దెబీనా బోనర్జి పేరు, అలాగే ఆమెకు సోకిన వైరస్ పేరు ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.


ఇవి కూడా చదవండి:

*********************************

* Poorna: ఏడో నెల గర్భిణీ.. ‘కానూర్’ తంతు వీడియో వైరల్

* Mega Power Star Ram Charan: నా జీవితంలో అద్భుత‌మైన క్ష‌ణాలివి

* KTR: ‘బలగం’.. కేటీఆర్ కంటి సైగతో యాంకర్ ఏం చేసిందో చూశారా..

* Taraka Ratna : తారకరత్నతో దిగిన చివరి ఫొటో పోస్ట్ చేసిన అలేఖ్యారెడ్డి.. కంటతడి పెడుతున్న ఫ్యాన్స్..

* Laya: పవన్ కల్యాణ్ మాట నిలబెట్టుకున్నారు.. ఆసక్తికర విషయం చెప్పిన లయ

* Krishnam Raju’s Wife: ఆస్కార్‌ దగ్గరలోనే ఉందనిపిస్తోంది

* Chiranjeevi: రాజశేఖర్ చేసిన పనికి.. చిరు సెల్యూట్ చేశారు

* Veera Simha Reddy: ఒక్క నిమిషంలోనే.. ఓటీటీలో ఊచకోత!

* Nara Lokesh: మెగాస్టార్ చిరంజీవి అభిమానిని.. ‘వాల్తేరు వీరయ్య’ చూశా..

* Rashmi Gautam: యాసిడ్ పోస్తారట.. కేసు పెట్టాలా? వద్దా?

Updated Date - 2023-03-01T22:49:41+05:30 IST