సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Manchu Lakshmi: ‘ఛమ్కీల అంగీలేసి’ పాటకి మంచు లక్ష్మీ స్టెప్స్.. అరిపించేసింది

ABN, First Publish Date - 2023-03-29T20:38:11+05:30

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani), కీర్తి సురేష్ (Keerthi Suresh) హీరోహీరోయిన్లుగా నటించిన ‘దసరా’ (Dasara) మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ (Chamkeela Angeelesi) సాంగ్‌పై ఏ స్థాయిలో రీల్స్ నడుస్తున్నాయో తెలియంది కాదు. ఈ పాట

Manchu Lakshmi Dance to Chamkeela Angeelesi Song
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani), కీర్తి సురేష్ (Keerthi Suresh) హీరోహీరోయిన్లుగా నటించిన ‘దసరా’ (Dasara) మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ (Chamkeela Angeelesi) సాంగ్‌పై ఏ స్థాయిలో రీల్స్ నడుస్తున్నాయో తెలియంది కాదు. ఈ పాట శ్రోతల్ని బాగా ఆకర్షిస్తోంది. ‘దసరా’ మూవీకి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన పాటలేవీ తీసుకురాలేని క్రేజ్‌ని.. సినిమాపై ఈ పాట తీసుకొస్తుండటం విశేషం. అందుకు కారణం ఈ పాటలోని ఫిమేల్ వాయిస్. ఈ పాటని రామ్ మిరియాల (Ram Miriyala)తో కలిసి దీక్షిత అలియాస్ ధీ (Dhee) పాడింది. ముఖ్యంగా ఈ పాటలోని ధీ వాయిస్‌కి శ్రోతలు ఫిదా అవుతున్నారు. ఇప్పుడీ పాటకు మంచు లక్ష్మీ ప్రసన్న (Manchu Lakshmi Prasanna) డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘దసరా’ మూవీ విడుదల సందర్భంగా ఈ మూవీ టీమ్‌కు బోలెడంత ప్రేమ, అదృష్టం, విజయం దక్కాలని కోరుకుంటున్నానని తెలుపుతూ.. మంచు లక్ష్మీ (Manchu Lakshmi) ‘ఛమ్కీల అంగీలేసి’ పాటకి (Chamkeela Angeelesi Song) డ్యాన్స్ చేస్తున్న వీడియోని షేర్ చేసింది. ఈ వీడియోలో మంచు లక్ష్మీతో పాటు ఆమె కుమార్తె కూడా కాలు కదిపింది. కీర్తి సురేష్‌లా చీరకట్టులో మంచు లక్ష్మీ ఈ పాటకి డ్యాన్స్ చేసింది. ఆమె స్టెప్స్ గురించి ఓ రేంజ్‌లో కామెంట్స్ పడుతున్నాయి. సినిమాలో వెన్నెల (Vennela)గా మీరు చేయాల్సింది అక్కా.. అని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. ‘థ్యాంక్స్ అక్కా’, ‘థ్యాంక్స్ మేడమ్’ అంటూ నాని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. నెటిజన్లు చెబుతున్నట్లుగా నిజంగానే మంచు లక్ష్మీ ఈ పాటకి వేసిన స్టెప్స్, ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ వావ్ అనేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. (Manchu Lakshmi Greetings to Dasara Team)

దసరా విషయానికి వస్తే.. నాని మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా ఇది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీది సినిమాపై మంచి అంచనాలను పెంచాయి. నాని, కీర్తి సురేష్ డీ-గ్లామర్ పాత్రలలో నటించారు. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్ కూడా సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర మోత మోగిస్తుందనేలా ఉంది. బిజినెస్ కూడా అదే రేంజ్‌లో జరగడంతో.. నాని అభిమానులే కాకుండా.. తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రియులంతా.. ‘దసరా’ రిజల్ట్ కోసం వేచి చూస్తున్నారు. కాగా, ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ (Santosh Narayanan) సంగీతం అందించగా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మించారు. (Manchu Lakshmi Dance to Chamkeela Angeelesi Song)


ఇవి కూడా చదవండి:

*********************************

*Rocking Rakesh: జోర్దార్ సుజాత టార్చర్ పెట్టిందా? ఏడుస్తూ.. అసలు విషయం చెప్పేసిన రాకేష్!

*Tollywood: శోభితతో చైతూ.. సుప్రియతో శేష్.. ఇలా దొరికేశారేంటి?

*Sana: అందుకే అలీ రెజాతో రొమాంటిక్ సీన్ చేశా.. అలాంటివి ఇంకా చేయాలని ఉంది

*Upasana: ఉపాసన బేబీ బంప్ ఫొటో వైరల్.. ఇక డౌట్స్ వద్దమ్మా..!

*SSMB28: మళ్లీ అప్పటి వరకు అప్‌డేట్స్ అడగవద్దు.. ఫ్యాన్స్‌కి నిర్మాత హెచ్చరిక

*Bhanushree Mehra: మరో బాంబ్ పేల్చిన అల్లు అర్జున్ ‘వరుడు’ హీరోయిన్

*Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?

Updated Date - 2023-03-29T20:42:19+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!