Adipurush: ‘రామ్ సీతా రామ్’ పాట ఓకే కానీ.. చూస్తుంటే ఏదో తేడా కొడుతోంది

ABN , First Publish Date - 2023-05-29T15:31:15+05:30 IST

ప్రభాస్, కృతిసనన్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ‘ఆదిపురుష్’ చిత్రం నుంచి తాజాగా ‘రామ్ సీతా రామ్’ అనే వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. అయితే ఇంతకు ముందు విడుదల చేసిన పాటలో, అలాగే ఇప్పుడొచ్చిన ఈ పాటలో కూడా ట్రైలర్‌లో చూపించిన సన్నివేశాలను తప్పితే.. కొత్తగా ఏమీ చూపించకపోవడంతో అంతా నిరాశకు లోనవుతున్నారు.

Adipurush: ‘రామ్ సీతా రామ్’ పాట ఓకే కానీ.. చూస్తుంటే ఏదో తేడా కొడుతోంది
Adipurush Movie Poster

ఇండియాస్ మోస్ట్ అవెటెడ్ మూవీ ఆదిపురుష్ (Adipurush) నుంచి మరో పాటని మేకర్స్ తాజాగా విడుదల చేశారు. సీతారాములుగా ప్రభాస్ (Prabhas), కృతిసనన్‌ (Kriti Sanon) నటించిన ఈ చిత్రంపై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో.. మేకర్స్ కూడా ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచారు. సినిమాకు సంబంధించి టీజర్, ట్రైలర్, పాటలు విడుదల చేస్తూ.. క్రేజ్ పెంచే పనిలో ఉన్నారు. అయితే తాజాగా విడుదలైన పాట ‘రామ్ సీతా రామ్’ (Ram Sita Ram).. వినడానికి బాగానే ఉంది కానీ.. విజువల్ పరంగా మాత్రం కొత్తదనం ఏమీ కనిపించలేదు. ఈ పాటకానీ, ఇంతకు ముందు విడుదలైన జై శ్రీరామ్ పాటకానీ.. ఈ రెండింటిలో కూడా ట్రైలర్‌లో చూపించిన విజువల్స్ తప్పితే.. కొత్తగా ఏమీ చూపించలేదు. దీంతో చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ మధ్య విడుదలవుతోన్న పాటలలో.. ఆఖరికి లిరికల్ సాంగ్ విడుదల చేసినా కూడా.. మధ్యలో ఏదో ఒక కొత్త సన్నివేశాన్ని పరిచయం చేస్తున్నారు. కానీ ‘ఆదిపురుష్’ (Adipurush) విషయానికి వస్తే.. ట్రైలర్‌లో చూపించిన సన్నివేశాలు తప్పితే.. కొత్తగా ఒక్కటంటే ఒక్క సీన్ కూడా పరిచయం చేయడం లేదు. సాంగ్స్ బాగున్నా కూడా చూసిన సన్నివేశాలే మళ్లీ మళ్లీ చూడాల్సి రావడంతో.. నెటిజన్లు కూడా నిరాశకు లోనవుతున్నారు. ఆఖరికి ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఇదే విషయం చెబుతుండటం విశేషం. అంతకు ముందు టీజర్ విడుదల చేసిన సమయంలో.. దర్శకుడు ఓం రౌత్‌ (Om Raut)పై ఎటువంటి విమర్శలు వెల్లువెత్తాయో తెలియంది కాదు. అయితే ట్రైలర్‌తో మాత్రం ఓం రౌత్ మెప్పించాడు. అలా అనీ.. ఆ ట్రైలర్‌లోని షాట్స్‌నే పదే పదే చూపిస్తుంటే.. కేవలం ట్రైలర్ వరకే మార్పులు చేశారా? మొదట విడుదల చేసిన టీజర్‌లానే సినిమా ఉండబోతుందా? అనేలా ఇప్పుడు డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి. చూస్తుంటే.. ఈ ‘ఆదిపురుష్’ పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చేలానే కనిపిస్తోంది. (Again Doubts on Adipurush)

Adipurush-1.jpg

ఇక తాజాగా విడుదలైన సాంగ్ విషయానికి వస్తే.. రాఘవ్, జానకిల ప్రేమలోని గాఢతను తెలియజేసేలా ఉన్న ఈ పాటని సచేత్-పరంపర (Sachet-Parampara) స్వరపరచగా.. రామజోగయ్య శాస్త్రి (Rama Jogaiah Sastry) అందించిన సాహిత్యం చాలా అర్థవంతంగా, హృదయాలను హత్తుకునేలా ఉంది. నిజమైన ప్రేమ యొక్క శాశ్వతమైన శక్తిని, మానవ భావోద్వేగాల యొక్క శాశ్వతమైన లోతును ఈ పాట గుర్తుచేస్తుంది. సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే, వత్సల్ సేన్, సోనాల్ చౌహాన్ ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రం జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.


ఇవి కూడా చదవండి:

************************************************

*Bro: పవన్-సాయితేజ్ ద్వయం పోస్టర్.. ఫ్యాన్స్‌కి ఈ భరోసా చాలు!

*Purandeswari: నాన్నగారిలా.. నూటికో కోటికో ఒక్కరే

*Jayapradha: ‘ఓసి.. ఆ పిల్లవి నువ్వెనన్నమాట’ అని ఎన్టీఆర్ పెద్దగా నవ్వేశారు

*Shaakuntalam: సినిమా సక్సెస్ కాలేదు కానీ.. ఆ విషయంలో మాత్రం తిరుగులేదు

*The India House: పవర్ ఫుల్ ఫిల్మ్‌తో ఖాతా తెరుస్తోన్న ‘V మెగా పిక్చర్స్’.. మోషన్ వీడియో అదిరింది

Updated Date - 2023-05-29T18:44:03+05:30 IST