IPS Sajjanar: దయచేసి అలా చేయకండి.. అమితాబ్‌కి టీఎస్‌ఆర్టీసీ ఎండీ రిక్వెస్ట్

ABN , First Publish Date - 2023-03-31T11:23:08+05:30 IST

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) స్టార్‌డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

IPS Sajjanar: దయచేసి అలా చేయకండి.. అమితాబ్‌కి టీఎస్‌ఆర్టీసీ ఎండీ రిక్వెస్ట్
IPS Sajjanar To Amitabh Bachchan

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) స్టార్‌డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాదాపు 55 ఏళ్ల సినీ కెరీర్ ఎన్నో అద్భుత విజయాలు సాధించి స్టార్‌గా ఎదిగారు. 80 ఏళ్ల వయస్సులోనూ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళుతున్నారు. అయితే.. బిగ్‌‌బీకి యాడ్స్‌లో కూడా ఎక్కువగా నటిస్తారనే విషయం తెలిసిందే. ఆయనకి బ్రాండ్ వ్యాల్యూ కూడా భారీ ఉంటుంది. ఒక్కో యాడ్‌కిగాను దాదాపు రూ.5 కోట్ల వరకు ఛార్జీ చేస్తుంటారు. (Bollywood)

అయినా అమితాబ్ చేస్తే.. సులువుగా జనాల్లోకి చొచ్చుకుపోవచ్చనే ఉద్దేశ్యంతో ఆయనని చాలా కంపెనీలు అంబాసిడర్‌గా నియమించుకుంటూ ఉంటాయి. అయితే.. వాటిలో ప్రజలను మోసం చేసే దొంగ కంపెనీలు కూడా ఉన్నాయి. అందులో ఆమ్వే ఒకటి. మల్టీ లెవల్ మార్కెటింగ్ ప్రమోటింగ్ కంపెనీ ఆమ్వేపై 2022లో గొలుసు క‌ట్టు వ్యాపారం పేరుతో మోసానికి పాల్పడుతున్నట్లు గుర్తించిన ఈడీ.. ఆ కంపెనీ ఆస్తులను జప్తి చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతుంది. దీని గురించి అమితాబ్‌‌తో పాటు ఇతర సెలబ్రిటీలకు రిక్వెస్ట్ చేస్తూ.. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ (V.C. Sajjanar) సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. (IPS Sajjanar request To Amitabh Bachchan)

ఆయన చేసిన ట్వీట్‌లో.. ‘‘సూపర్‌స్టార్ అమితాబ్‌తోపాటు ఇతర సెలబ్రిటీలకు ఒక రిక్వెస్ట్. దయచేసి దేశ ఆర్థిక వ్యవస్థను, సమాజంలోని సామాజిక వ్యవస్థను నాశనం చేసే ‘ఆమ్వే’ వంటి మోసపూరిత సంస్థలకు సహకరించవద్దు. అలాంటి వాటిని ప్రమోట్ చేయవద్దు’ అని రాసుకొచ్చారు. ఆ ట్వీట్‌కి అమితాబ్ బచ్చన్‌ని సైతం ట్యాగ్ చేశారు. కాగా.. అమితాబ్ ప్రస్తుతం ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కే’లో కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే.. మరికొన్ని సినిమాలు సైతం షూటింగ్ జరుపుకుంటున్నాయి. (IPS Sajjanar request To Amitabh Bachchan)

ఇవి కూడా చదవండి:

Dasara Twitter Review: నాని మొదటి పాన్ ఇండియా మూవీ ఎలా ఉందంటే..

Sridevi Shoban Babu OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన బావామరదళ్లు.. ఎక్కడ చూడొచ్చంటే..

Taapsee Pannu: తాప్సీపై కేసు.. ఆ సమయంలో లక్ష్మీదేవి లాకెట్ ధరించడంతో..

Adipurush: రిలాక్స్ ప్రభాస్ ఫ్యాన్స్.. వాటిని నమ్మొద్దు.. దానికే ఫిక్సయిపోండి..

Shah Rukh Khan Vs Virat Kohli: సోషల్ మీడియాలో కొట్టేసుకుంటున్న ఫ్యాన్స్.. కారణం ఏంటంటే..

Akanksha Dubey: యువ నటి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్.. అతను మోసం చేయడం వల్లేనంటూ..

Global Icon Allu Arjun: స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్‌ స్టార్‌గా.. 20 ఏళ్లలో ఎన్ని మార్పులు..

Updated Date - 2023-03-31T11:23:29+05:30 IST