Bhagavanth Kesari: హైలీ ఎనర్జిటిక్ గణేష్ సాంగ్‌లో బాలయ్య, శ్రీలీల.. అరుపులే!!

ABN , First Publish Date - 2023-09-01T21:51:25+05:30 IST

‘భగవంత్ కేసరి’ మేకర్స్ రెండు రోజుల క్రితం విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ గణేష్ సాంగ్ ప్రోమోతో‌నే ఓ ఎనర్జిటిక్ సాంగ్ రాబోతుందనేలా క్లారిటీ ఇచ్చేశారు. ఈ ప్రోమోకి సంబంధించిన ఫుల్ లిరికల్ వీడియోను శుక్రవారం మేకర్స్ విడుదల చేశారు. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ , శ్రీలీల గణేష్ చతుర్థి సెలబ్రేట్ చేసుకుంటూ బాబాయ్ అమ్మాయిగా ఈ పాటలో సందడి చేశారు.

Bhagavanth Kesari: హైలీ ఎనర్జిటిక్ గణేష్ సాంగ్‌లో బాలయ్య, శ్రీలీల.. అరుపులే!!
Bhagavanth Kesari Movie Still

‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) మేకర్స్ రెండు రోజుల క్రితం విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ గణేష్ (Ganesh Single) సాంగ్ ప్రోమోతో‌నే ఓ ఎనర్జిటిక్ సాంగ్ రాబోతుందనేలా క్లారిటీ ఇచ్చేశారు. ఈ ప్రోమోకి సంబంధించిన ఫుల్ లిరికల్ వీడియోను శుక్రవారం మేకర్స్ విడుదల చేశారు. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), శ్రీలీల (Sreeleela) గణేష్ చతుర్థి సెలబ్రేట్ చేసుకుంటూ బాబాయ్ అమ్మాయిగా ఈ పాటలో సందడి చేశారు. ఈ పాట కోసం ఎస్ఎస్ థమన్ పెప్పీ, మాస్ ట్యూన్ కంపోజ్ చేసారు. తెలంగాణ యాసలో ఉన్న ఈ పాట ఆర్కెస్ట్రేషన్ ఆకట్టుకుంది. కాసర్ల శ్యామ్ అర్థవంతమైన సాహిత్యం‌తో మాస్‌ని కట్టిపడేయగా.. కరేముల్లా, మనీషా పాండ్రంకి ఈ పాటను హై-పిచ్డ్ వోకల్స్‌తో ఎనర్జిటిక్‌గా ఆలపించారు.


ముఖ్యంగా బాలకృష్ణ, శ్రీలీల (Balakrishna and Sreeleela) తమ క్రేజీ డ్యాన్స్‌తో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. వారి కాస్ట్యూమ్‌‌లు, గెటప్‌‌లు, డ్యాన్స్‌లు అన్నీ పాటకు పర్ఫెక్ట్‌గా అనిపించడమే కాకుండా.. అరుపులే అనేలా ఉన్నాయి. విజువల్స్, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అన్నీ ఈ పాటకు సెట్ అయినట్లుగా ఈ లిరికల్ సాంగ్ చూస్తుంటే తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే.. ముందే వినాయక చవితి పండుగను ఫ్యాన్స్‌కి అందించారు బాలయ్య. ఇంతకు ముందు విడుదల చేసిన పోస్టర్లు, ప్రోమోలు సెట్ చేసిన అంచనాలను ఈ పాట అందుకుందనే చెప్పాలి. (Ganesh Anthem From Bhagavanth Kesari Out)

Sreeleela.jpg

ఈ లిరికల్ సాంగ్‌లో పాట మేకింగ్ కూడా యాడ్ చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) పాటల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ (Shine Screens Production) మ్యూజికల్ జర్నీని చార్ట్‌బస్టర్ నోట్‌లో ప్రారంభించింది. సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) హీరోయిన్‌గా నటిస్తుండగా.. జాతీయ అవార్డు విజేత అర్జున్ రాంపాల్ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Miss Shetty Mr Polishetty: సెన్సార్ పూర్తి.. ఇక తెరపై చూసుకుందాం

*************************************

*Salaar: ‘సలార్’ వాయిదా పడనుందా? తీవ్ర నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్

*************************************

*Shiva Nirvana: క్లైమాక్స్ బాగుండి ఫెయిలైన సినిమా చరిత్రలో లేదు

**************************************

*Pawan Kalyan: సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో మూవీ.. ఆఫీస్ ప్రారంభమైంది

***********************************

*Tiger Nageswara Rao: వేటయింది.. ఇప్పుడు ఆట టైమ్!

***********************************

*Khushi film review: విజయ్ దేవరకొండ, సమంతల జోడీ బాగుంది

***********************************

Updated Date - 2023-09-01T21:55:37+05:30 IST