Miss Shetty Mr Polishetty: సెన్సార్ పూర్తి.. ఇక తెరపై చూసుకుందాం

ABN , First Publish Date - 2023-09-01T21:24:41+05:30 IST

ప్రేక్షకులకు కంప్లీట్ ఎంటర్ టైన్‌మెంట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని.. సెప్టెంబర్ 7న విడుదలకు ముస్తాబైంది.

Miss Shetty Mr Polishetty: సెన్సార్ పూర్తి.. ఇక తెరపై చూసుకుందాం
Miss Shetty Mr Polishetty Movie Still

ప్రేక్షకులకు కంప్లీట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty). యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty), స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి (Anushka Shetty) జంటగా నటించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యుల అభినందనలతో పాటు యూబైఏ సర్టిఫికెట్ పొందింది. సెన్సార్ అనే చివరి అంకాన్ని సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 7న తెరపై చూడటమే తరువాయి. మొదటి నుంచి ఈ సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని మేకర్స్ ప్రకటిస్తూ వస్తున్నట్లుగానే సెన్సార్ వారు కూడా యుబైఏ సర్టిఫికేట్‌తో క్లారిటీ ఇచ్చేశారు. అలాగే ఈ సినిమా ఐడియల్ రన్ టైం 151 మినిట్స్ (2గంటల 31 నిమిషాలు)కు లాక్ చేశారు. సెన్సార్ నుంచి మంచి ప్రశంసలు లభించడంతో.. సినిమా సక్సెస్‌పై మేకర్స్ కాన్ఫిడెంట్‌గా ఉన్నామని చెబుతున్నారు. (Miss Shetty Mr Polishetty Censor Details)


రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ కథతో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రాన్ని యువీ క్రియేష‌న్స్ (UV Creations) బ్యాన‌ర్‌పై వంశీ, ప్ర‌మోద్‌ నిర్మాణంలో దర్శకుడు మ‌హేష్ బాబు.పి (Mahesh Babu P) తెరకెక్కించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా సెప్టెంబర్ 7న తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఇదే రెస్పాన్స్ రేపు థియేటర్‌లోనూ దక్కుతుందని నమ్మకంతో మూవీ టీమ్ ఉన్నారు.

Anushka.jpg

మరోవైపు సినిమాను ఆడియెన్స్ కు మరింత దగ్గర చేసేందుకు ప్రమోషన్ టూర్స్ చేస్తున్నారు హీరో నవీన్ పోలిశెట్టి. గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, నెల్లూరులో ఆయన పర్యటిస్తున్నారు. ఈ టూర్స్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తుండటంతో పాటు.. సినిమా కూడా జనాలకు రీచ్ అవుతోంది.


ఇవి కూడా చదవండి:

============================

*Salaar: ‘సలార్’ వాయిదా పడనుందా? తీవ్ర నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్

*************************************

*Shiva Nirvana: క్లైమాక్స్ బాగుండి ఫెయిలైన సినిమా చరిత్రలో లేదు

**************************************

*Pawan Kalyan: సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో మూవీ.. ఆఫీస్ ప్రారంభమైంది

***********************************

*Tiger Nageswara Rao: వేటయింది.. ఇప్పుడు ఆట టైమ్!

***********************************

*Khushi film review: విజయ్ దేవరకొండ, సమంతల జోడీ బాగుంది

***********************************

Updated Date - 2023-09-01T21:27:11+05:30 IST