Tiger Nageswara Rao: వేటయింది.. ఇప్పుడు ఆట టైమ్!

ABN , First Publish Date - 2023-09-01T17:36:39+05:30 IST

మాస్ మహారాజా రవితేజ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ చిత్రానికి సంబంధించి రీసెంట్‌గా వచ్చిన టీజర్‌లో టైగర్ నాగేశ్వరరావు వేట ఏ రేంజ్‌లో ఉండబోతుందో మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు సూపర్ ఎంటర్‌టైనింగ్, ఎనర్జిటిక్ అవతార్‌‌ని పెప్పీ నంబర్‌లో చూడటానికి సిద్ధంగా ఉండండి అంటూ.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తూ ఓ పోస్టర్ వదిలారు.

Tiger Nageswara Rao: వేటయింది.. ఇప్పుడు ఆట టైమ్!
Tiger Nageswara Rao Still

మాస్ మహారాజా రవితేజ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao). ఈ చిత్రానికి సంబంధించి రీసెంట్‌గా వచ్చిన టీజర్‌లో టైగర్ నాగేశ్వరరావు వేట ఏ రేంజ్‌లో ఉండబోతుందో మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు ‘టైగర్ నాగేశ్వరరావు’ సూపర్ ఎంటర్‌టైనింగ్, ఎనర్జిటిక్ అవతార్‌‌ని పెప్పీ నంబర్‌లో చూడటానికి సిద్ధంగా ఉండండి అంటూ.. మేకర్స్ అదిరిపోయే అప్‌డేట్‌ని ఇచ్చారు. మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) నటించిన ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజికల్ ప్రమోషన్స్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఫస్ట్ సింగిల్ ‘ఏక్ దమ్ ఏక్ దమ్’ (Ek Dum Ek Dum) సెప్టెంబర్ 5న విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ ఓ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు.


ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రవితేజ (Ravi Teja), నుపూర్ సనన్ (Nupur Sanon) రెట్రో అవతార్‌లలో కనిపిస్తున్నారు. నుపుర్ తన చేతుల్లో పుస్తకాలు పట్టుకుని కాలేజీ విద్యార్థినిగా కనిపిస్తుంది. రవితేజ ఆమెను ఆటపట్టించడం, బ్యాక్‌గ్రౌండ్‌లో డాన్సర్‌లను కూడా గమనించవచ్చు. జివి ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కి వంశీ దర్శకత్వం వహిస్తున్నారు.

Ravi.jpg

టైగర్ దండయాత్ర గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన లభించినట్లే.. ‘టైగర్ నాగేశ్వరరావు’ నుంచి రాబోయే సాంగ్స్‌ కూడా అందరినీ మెప్పిస్తాయని చిత్రయూనిట్ చెబుతోంది. ‘ది కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2’ వంటి వరుస పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ చిత్రాలను రూపొందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ (Abhishek Agarwal Arts) బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ గ్రాండ్‌గా నిర్మిస్తున్న ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్ మరో హీరోయిన్‌గా నటిస్తున్నారు. కథకు యూనివర్సల్ అప్పీల్ ఉండటంతో.. మేకర్స్ దీనిని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నట్లుగా ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Khushi film review: విజయ్ దేవరకొండ, సమంతల జోడీ బాగుంది

***********************************

*Nandamuri Mokshagna: బాలయ్య వారసుడు ఎట్టున్నడో చూశారా.. పిక్ వైరల్!

**********************************

Updated Date - 2023-09-01T17:36:39+05:30 IST