Salaar: ‘సలార్’ వాయిదా పడనుందా? తీవ్ర నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్

ABN , First Publish Date - 2023-09-01T20:12:45+05:30 IST

రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కళ్లన్నీ.. రాబోతోన్న ప్రభాస్ పాన్ ఇండియా చిత్రం ‘సలార్’పైనే ఉన్నాయి. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సినిమా లవర్స్ కూడా ఎంతగానో వేచి చూస్తున్నారు. ‘కెజియఫ్’ సిరీస్ చిత్రాల తర్వాత ప్రశాంత్ నీల్, హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌లో రాబోతోన్న ఈ సినిమాపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా మరోసారి వాయిదా పడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Salaar: ‘సలార్’ వాయిదా పడనుందా? తీవ్ర నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్
Prabhas in Salaar

రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) ఫ్యాన్స్ కళ్లన్నీ.. రాబోతోన్న ప్రభాస్ పాన్ ఇండియా చిత్రం ‘సలార్’ (Salaar)పైనే ఉన్నాయి. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ (Prabhas Fans) మాత్రమే కాదు.. సినిమా లవర్స్ కూడా ఎంతగానో వేచి చూస్తున్నారు. ‘కెజియఫ్’ (KGF) సిరీస్ చిత్రాల తర్వాత ప్రశాంత్ నీల్ (Prashanth Neel), హోంబలే ఫిల్మ్స్ (Hombale Films) బ్యానర్‌లో రాబోతోన్న ఈ సినిమాపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే విడుదలైన పోస్టర్స్, టీజర్ కూడా ఉండటంతో.. ‘బాహుబలి’ (Bahubali) తర్వాత ప్రభాస్‌కు లేని, రాని సక్సెస్ కచ్చితంగా ‘సలార్’ ఇస్తుందనే అభిప్రాయంలో ఉన్న అభిమానులని.. ఆ యూనిట్ మాత్రం ఎప్పటి కప్పుడు నిరాశపరుస్తూనే ఉంది. ఈ సినిమా అప్‌డేట్స్ విషయంలో ఫ్యాన్స్ ఎంత డిజప్పాయింట్‌గా ఉన్నారో తెలియంది కాదు.. ఇప్పుడు వినిపిస్తున్న వార్తలు వారిని మరింత డిజప్పాయింట్‌కి గురిచేస్తున్నాయి.


వాస్తవానికి ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దాదాపు 100రోజుల ముందు నుంచే సినిమా విడుదలకు సంబంధించి కౌంట్‌డౌన్ మొదలైంది. అలాంటిది ఇప్పుడీ సినిమా వాయిదా (#Postponed) పడుతున్నట్లుగా వార్తలు దర్శనమీయడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ సినిమాను డిసెంబర్‌కు పోస్ట్‌పోన్ చేసినట్లుగా ట్విట్టర్‌లో మోత మోగుతోంది. దీనికి కారణం సీజీ వర్క్ పట్ల దర్శకుడు అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. సీజీ వర్క్ కనుక ఓ కొలిక్కి రాకపోతే.. పోస్ట్‌పోన్ చేయాలనే నిర్ణయంలో యూనిట్ ఉన్నట్లుగా వార్తలు బయటికి వచ్చాయి. అందుకే సినిమా ట్రైలర్‌కు సంబంధించి కూడా ఇంత వరకు ఎటువంటి అప్‌డేట్ మేకర్స్ నుంచి రాలేదు. ఇప్పుడు విడుదల వాయిదాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని మాత్రం తెలుస్తోంది.

Prabhas.jpg

అయితే ‘సలార్’ కనుక డిసెంబర్‌కి వెళ్లిపోతే.. మరోసారి సినిమాల విడుదల విషయంలో గజిబిజి నెలకొనే అవకాశం ఉంది. ఇంతకు ముందు రామ్ చరణ్, ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్ర విడుదల విషయంలో కూడా ఇలాంటి కన్ఫ్యూజనే నెలకొంది. అప్పుడు కూడా సినిమాల విడుదలకు సంబంధించి నిర్మాతలు మీటింగ్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు ‘సలార్’తో మరోసారి అలాంటి పరిస్థితులు నెలకొనే అవకాశం అయితే లేకపోలేదు.


ఇవి కూడా చదవండి:

============================

*Shiva Nirvana: క్లైమాక్స్ బాగుండి ఫెయిలైన సినిమా చరిత్రలో లేదు

**************************************

*Pawan Kalyan: సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో మూవీ.. ఆఫీస్ ప్రారంభమైంది

***********************************

*Tiger Nageswara Rao: వేటయింది.. ఇప్పుడు ఆట టైమ్!

***********************************

*Khushi film review: విజయ్ దేవరకొండ, సమంతల జోడీ బాగుంది

***********************************

*Nandamuri Mokshagna: బాలయ్య వారసుడు ఎట్టున్నడో చూశారా.. పిక్ వైరల్!

**********************************

Updated Date - 2023-09-01T20:13:26+05:30 IST