కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Brahmanandam: అంగరంగ వైభవంగా హాస్య బ్రహ్మ బ్రహ్మానందం రెండో కుమారుడి వివాహం

ABN, First Publish Date - 2023-08-19T10:15:11+05:30

హాస్య బ్రహ్మ, తనదైన నటనతో వెయ్యికి పైగా చిత్రాల్లో భారతీయ ప్రేక్షకులకు వినోదం అందించిన నటుడు బ్రహ్మానందం. ఆయన ద్వితీయ కుమారుడు సిద్ధార్థ వివాహం శుక్రవారం (ఆగస్టు 18) రాత్రి 10.45 గంటలకు హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నందు గల అన్వయ కన్వెన్షన్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.

Brahmanandam Son Siddharth Marriage Photo

హాస్య బ్రహ్మ, తనదైన నటనతో వెయ్యికి పైగా చిత్రాల్లో భారతీయ ప్రేక్షకులకు వినోదం అందించిన నటుడు బ్రహ్మానందం (Brahmanandam). ఆయన ద్వితీయ కుమారుడు సిద్ధార్థ (Siddharth) వివాహం శుక్రవారం (ఆగస్టు 18) రాత్రి 10.45 గంటలకు హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నందు గల అన్వయ కన్వెన్షన్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. బూర వినయ్ కుమార్, పద్మజ దంపతుల పుత్రిక ఐశ్వర్య‌ (Aishwarya)ను బ్రహ్మానందం కుమారుడు సిద్ధార్థ వివాహమాడారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులెందరో హాజరై.. నూతన దంపతులను ఆశీర్వదించారు.


ఈ వివాహ మహోత్సవానికి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ (Vemuri Radha Krishna), మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు (M Venkaiah Naidu), తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR), సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ వంటి రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

*బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్ధార్థ వివాహ మహోత్సవానికి తరలివచ్చిన ప్రముఖులు- ఫొటో గ్యాలరీ



తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి నందమూరి బాలకృష్ణ, మంచు మోహన్ బాబు, మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్, కోట శ్రీనివాస రావు, రాజశేఖర్ జీవిత దంపతులు, రామ్ చరణ్ - ఉపాసన దంపతులతో పాటు చిరంజీవి సతీమణి సురేఖ, పెద్దమ్మాయి సుష్మిత, శ్రీకాంత్ ఫ్యామిలీ, సాయి కుమార్ ఫ్యామిలీ, మంచు విష్ణు దంపతులు, మంచు మనోజ్ దంపతులు... దర్శకులు కోదండరామిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, త్రివిక్రమ్ శ్రీనివాస్, శేఖర్ కమ్ముల.. నటులు రావు రమేష్, ఆలీ ఫ్యామిలీ, ఎల్బీ శ్రీరామ్.. నిర్మాతలు శివలెంక కృష్ణ ప్రసాద్, బెల్లంకొండ సురేష్, అచ్చిరెడ్డి, ఆదిశేషగిరిరావు, కెఎల్ నారాయణ, రఘు బాబు తదితరులు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.


ఇవి కూడా చదవండి:

***************************************

*Bheemadevarapally Branchi: ఓటీటీలోకి వచ్చేసిన భీమదేవరపల్లి బ్రాంచి..

***************************************

*Skanda: ‘గందారబాయి’ అంటూ.. రామ్, శ్రీలీల ఓ ఊపు ఊపేశారు

***************************************

*Sampath Nandi: ‘సౌండ్ పార్టీ’.. మరో ‘జాతిరత్నాలు’ అయ్యే సినిమా..

***************************************

*Dulquer Salmaan: ప్రభాస్ ‘కల్కి’లో దుల్కర్.. చెప్పకనే చెప్పేశాడుగా..

***************************************

*Aadikeshava: మెగా హీరో సినిమా వాయిదా.. న్యూ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

***************************************

Updated Date - 2023-08-19T10:15:11+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!