Dulquer Salmaan: ప్రభాస్ ‘కల్కి’లో దుల్కర్.. చెప్పకనే చెప్పేశాడుగా..

ABN , First Publish Date - 2023-08-18T19:36:03+05:30 IST

రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో పాన్ వరల్డ్ సినిమాగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ సినిమాపై ఎటువంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పుడీ సినిమాలో టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. దుల్కర్ నటించిన ‘కింగ్ ఆఫ్ కోత’ ప్రమోషన్స్‌లో ‘కల్కి’లో తన పాత్ర గురించి కొంత క్లారిటీ ఇచ్చారు దుల్కర్.

Dulquer Salmaan: ప్రభాస్ ‘కల్కి’లో దుల్కర్.. చెప్పకనే చెప్పేశాడుగా..

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్‌లో పాన్ వరల్డ్ సినిమాగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD). ఈ సినిమాపై ఎటువంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. యావత్ ప్రపంచమే ఈ సినిమా కోసం వేచి చూస్తుంది. ఇప్పుడీ సినిమాలో యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) కూడా ఓ పాత్ర చేస్తున్నట్లుగా.. తాజాగా ఆయనే చెప్పకనే చెప్పేశారు. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన చిత్రం ‘కొంగ్ ఆఫ్ కొత్త’ (King Of Kotha). ఈ సినిమా ఆగస్ట్ 24న విడుదల కాబోతోన్న నేపథ్యంలో దుల్కర్ చిత్ర ప్రమోషన్స్‌లో యమా యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. అందులో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ‘కల్కి 2898 AD’లో నటిస్తున్నారా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు దుల్కర్ నవ్వుతూ సమాధానం దాట వేశారు.


కానీ ఆ నవ్వులోనే సమాధానం దొరికేసింది. అలాగే ఆ విషయం దర్శకుడు నాగ్ అశ్వినే చెప్పాలని దుల్కర్ ఇచ్చిన సమాధానంతో.. ఆయన ‘కల్కి 2898 AD’లో నటిస్తున్నట్లుగా క్లారిటీ వచ్చేసింది. ‘కల్కి 2898 AD’ గురించి దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. ‘‘నేను ‘కల్కి 2898 AD’ సినిమాలో నటిస్తున్నానా? లేదా? అనే విషయాన్ని ఇప్పుడప్పుడే చెప్పలేను. కానీ ‘కల్కి’ సినిమా సెట్‌కి వెళ్లినప్పుడు చూసి ఆశ్చర్యపోయా. కేవలం నాగీ మాత్రమే అంత గొప్ప సినిమా తీయగలరు. అలాంటి థాట్స్‌ నాగీకి మాత్రమే వస్తాయి. ఆయన తీసిన మొదటి సినిమా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’కు, ‘మహానటి’కి అస్సలు సంబంధం ఉండదు. ఇప్పుడు రాబోయే ‘కల్కి’ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఫ్యూచర్‌ చెప్పే కథగా నాగీ ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు..’’ అని చెప్పుకొచ్చారు. (Dulquer Salmaan in Prabhas Kalki 2898 AD)

Prabhas-and-Dulquer.jpg

ఈ సమాధానం విన్న యాంకర్.. ఈ సినిమాలో ప్రభాస్‌తో మీకు సన్నివేశాలుంటాయా? అని ప్రశ్నించగా.. ‘‘అదెలా చెబుతాం.. అలాంటి విషయాలు కేవలం మేకర్స్‌ మాత్రమే చెప్పాలి’’ అని దుల్కర్‌ నవ్వేశారు. అంతే.. దుల్కర్ చెప్పిన ఈ సమాధానం విన్న అభిమానులు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. మొత్తానికి నాగ్ అశ్విన్ తన ‘మహానటి’ (Mahanati) హీరోని మాత్రం వదలిపెట్టలేదనే విషయం.. దుల్కర్ మాటలతో తెలిసిపోతుంది. ప్రభాస్ సరసన దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్న ‘కల్కి 2898 AD’లో అమితాబ్, కమల్ హాసన్, దిశా పటానీ వంటి వారు కీలక పాత్రలలో నటిస్తున్నారు. రాబోయే సంక్రాంతికి విడుదల అనుకుంటున్నారు కానీ.. మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి:

***************************************

*Aadikeshava: మెగా హీరో సినిమా వాయిదా.. న్యూ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

***************************************

*Manchu Vishnu: పవన్ కళ్యాణ్ గెలుస్తాడో.. లేదో చెప్పడానికి నేనేమైనా బ్రహ్మంగారినా?

***************************************

*Yendira Ee Panchayithi: ఆసక్తికరంగా ‘ఏందిరా ఈ పంచాయితీ’ ఫస్ట్ లుక్

***************************************

*Tiger Nageswara Rao: టైగర్ ఇన్వెజన్.. దురదృష్టవశాత్తూ వాడొక క్రిమినల్ అయ్యాడు.. లేదంటేనా?

****************************************

Updated Date - 2023-08-18T19:37:40+05:30 IST