Skanda: ‘గందారబాయి’ అంటూ.. రామ్, శ్రీలీల ఓ ఊపు ఊపేశారు

ABN , First Publish Date - 2023-08-18T21:35:02+05:30 IST

ఉస్తాద్ రామ్ పోతినేని పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘స్కంద’- ది ఎటాకర్ మూవీ ప్రచార కార్యక్రమాలు ఇప్పటికే జోరందుకున్నాయి. మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మొదటి పాట చార్ట్‌బస్టర్‌గా నిలవగా.. తాజాగా మేకర్స్ సెకండ్ సింగిల్ ‘గందారబాయి’ లిరికల్ వీడియోని విడుదల చేశారు. ఈ సాంగ్ ఇప్పుడు టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Skanda: ‘గందారబాయి’ అంటూ.. రామ్, శ్రీలీల ఓ ఊపు ఊపేశారు
Skanda Movie Still

ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘స్కంద’- ది ఎటాకర్ (Skanda) మూవీ ప్రచార కార్యక్రమాలు ఇప్పటికే జోరందుకున్నాయి. టాలీవుడ్ క్రష్ శ్రీలీల (Sreeleela) ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మొదటి పాట చార్ట్‌బస్టర్‌గా నిలవగా.. తాజాగా మేకర్స్ సెకండ్ సింగిల్ ‘గందారబాయి’ లిరికల్ వీడియోని విడుదల చేశారు. ‘సరైనోడు, అఖండ’ బ్లాక్ బస్టర్స్ తర్వాత మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, సెన్సేషనల్ కంపోజర్ ఎస్ఎస్ థమన్‌ (SS Thaman)ల కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీగా రూపొందుతోందీ చిత్రం. అందుకే థమన్ ఈ సినిమాపై ప్రత్యేక ఇంట్రస్ట్ పెడుతున్నట్లున్నారు. మరో బ్లాక్ బస్టర్ నంబర్‌ను అందించారు.

Skanda-3.jpg

మొదటి పాట ఎనర్జిటిక్ డ్యాన్స్ నంబర్ అయితే, గందారబాయి (Gandarabai) మాస్ ధమకేధార్ ఫోక్లోర్. బీట్, ఆర్కెస్ట్రేషన్ ఎనర్జిటిక్ గా మాస్ వైబ్‌తో ఆకట్టుకున్నాయి. నకాష్ అజీజ్, సౌజన్య భాగవతుల వాయిస్ మెస్మరైజ్ చేసింది. అనంత శ్రీరామ్ మాస్ లిరిక్స్ రాసిన ఈ పాటను వైబ్రెంట్ సెట్స్‌లో చిత్రీకరించారు.


Skanda-4.jpg

ఇక ఈ పాటలో రామ్, శ్రీలీల (Ram And Sreeleela Mass Steps).. తమ ఎనర్జీతో ప్రేక్షకుల మనసుని కొల్లకొట్టారు. ఎక్స్‌ట్రార్డినరీ డ్యాన్స్ మూమెంట్స్‌తో అలరించారు. రామ్ డ్యాన్స్‌లో డైనమిజం చూపించగా, శ్రీలీల ఎనర్జీతో మ్యాచ్ చేసింది. ఈ ఇద్దరు గ్రేట్ డ్యాన్సర్స్ అనే విషయం తెలియంది కాదు. ఇద్దరూ తమ ఎనర్జీతో ఈ పాటకి ఓ ఊపు ఊపేశారు. ఈ పాటకి ఇటీవల ‘నాటు నాటు’ సాంగ్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.


Skanda-1.jpg

ఇంతకు ముందు ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా.. ఇప్పుడు విడుదలైన ఈ పాట కూడా సినిమాపై క్రేజ్‌ని పెంచేస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ (Srinivasaa Silver Screen) బ్యానర్‌పై అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌తో శ్రీనివాస చిట్టూరి (Srinivasaa Chitturi) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా ‘స్కంద’ విడుదల కానుంది.

Skanda-2.jpg

Skanda-5.jpg


ఇవి కూడా చదవండి:

***************************************

*Sampath Nandi: ‘సౌండ్ పార్టీ’.. మరో ‘జాతిరత్నాలు’ అయ్యే సినిమా..

***************************************

*Dulquer Salmaan: ప్రభాస్ ‘కల్కి’లో దుల్కర్.. చెప్పకనే చెప్పేశాడుగా..

***************************************

*Aadikeshava: మెగా హీరో సినిమా వాయిదా.. న్యూ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

***************************************

*Manchu Vishnu: పవన్ కళ్యాణ్ గెలుస్తాడో.. లేదో చెప్పడానికి నేనేమైనా బ్రహ్మంగారినా?

***************************************

Updated Date - 2023-08-18T21:35:02+05:30 IST