Aadikeshava: మెగా హీరో సినిమా వాయిదా.. న్యూ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

ABN , First Publish Date - 2023-08-18T17:13:08+05:30 IST

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తోన్న చిత్రం ‘ఆదికేశవ’. యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంగా రూపొందిన ఈ చిత్రానికి శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 18న విడుదల కావాల్సి ఉండగా.. ఇప్పుడు నవంబర్ 10కి వాయిదా వేసినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Aadikeshava: మెగా హీరో సినిమా వాయిదా.. న్యూ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
Panja Vaisshnav Tej in Aadikeshava

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై పంజా వైష్ణవ్ తేజ్ (Panja Vaisshnav Tej), శ్రీలీల (Sreeleela) జంటగా నటిస్తోన్న చిత్రం ‘ఆదికేశవ’ (Aadikeshava). యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంగా రూపొందిన ఈ చిత్రానికి శ్రీకాంత్ ఎన్ రెడ్డి (Srikanth N Reddy) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీది సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమా నేడు (ఆగస్ట్ 18) థియేటర్లలో సందడి చేయాల్సి ఉంది. కానీ ఈ సినిమాని మేకర్స్ వాయిదా వేసినట్లుగా అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, ఈ సినిమా న్యూ రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తూ.. ఓ పోస్టర్‌ని కూడా మేకర్స్ విడుదల చేశారు. (Aadikeshava Movie Postponed)


ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీని ఆగస్ట్ 18 నుంచి నవంబర్ 10కి వాయిదా వేశారు. ఇటీవ‌లే ఆదికేశ‌వ చిత్రీకరణ ప్యారిస్‌లో జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉందని నిర్మాతలు ప్రకటించారు. వాస్తవానికి ఈ సినిమా ఆగస్ట్ 18 అని ప్రకటించినా.. ప్రమోషన్స్ మాత్రం చేయలేదు. దీంతో అందరికీ ఈ సినిమా విడుదలపై డౌట్ వచ్చేసింది. ఆ అనుమానం ఇప్పుడు నిజమైంది. ఇప్పుడీ సినిమా ఒక్కసారిగా నవంబర్‌కి వాయిదా పడటం చూస్తుంటే.. సినిమా షూటింగ్ అవకుండానే.. రిలీజ్ డేట్ ఎలా ప్రకటించారంటూ.. కొందరు నెటిజన్లు యూనిట్‌ని ప్రశ్నిస్తున్నారు. (Aadikeshava Movie)

Panja.jpg

ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌లో పంజా వైష్ణవ్ తేజ్‌ మునుపెన్నడూ లేని విధంగా కొత్త అవతార్‌లో కనిపించారు. శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్‌లో ఆమె అందం, పాత్రలోని చిలిపితనం ఆకట్టుకున్నాయి. శ్రీలీలతో పాటు జాతీయ అవార్డు గ్రహీత, మలయాళ నటుడు జోజు జార్జ్, అపర్ణా దాస్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి మొదటి పాటను త్వరలోనే విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది.


ఇవి కూడా చదవండి:

***************************************

*Manchu Vishnu: పవన్ కళ్యాణ్ గెలుస్తాడో.. లేదో చెప్పడానికి నేనేమైనా బ్రహ్మంగారినా?

***************************************

*Yendira Ee Panchayithi: ఆసక్తికరంగా ‘ఏందిరా ఈ పంచాయితీ’ ఫస్ట్ లుక్

***************************************

*Tiger Nageswara Rao: టైగర్ ఇన్వెజన్.. దురదృష్టవశాత్తూ వాడొక క్రిమినల్ అయ్యాడు.. లేదంటేనా?

****************************************

*Anil Sunkara: మెగాస్టార్‌తో వివాదంపై క్లారిటీ.. నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు

****************************************

Updated Date - 2023-08-18T17:13:08+05:30 IST