కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bhagavanth Kesari: ఫస్ట్ డే కలెక్షన్ల ఊచకోత.. ఇది బాలయ్య సౌండ్.. ఎట్లుంది?

ABN, First Publish Date - 2023-10-20T16:55:52+05:30

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భగవంత్ కేసరి’ చిత్రం దసరా స్పెషల్‌గా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రం మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా 32.33 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Nandamuri Balakrishna

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) చిత్రం దసరా స్పెషల్‌గా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుని.. కలెక్షన్ల ఊచకోతను స్టార్ట్ చేసింది. మొదటిరోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 32.33 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. గుంటూరు (Guntur) ఏరియాలో అయితే ‘భగవంత్ కేసరి’ ఊచకోతకు లిమిటే లేకుండా పోయింది. మొదటి రోజు గుంటూరు జిల్లాలో ఈ సినిమా 3.8 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టి ‘గుంటూరు గడ్డ.. బాలయ్య బాబు అడ్డా’ అనేలా బీభత్సాన్ని సృష్టించినట్లుగా మేకర్స్ తెలియజేశారు. (Bhagavanth Kesari Collections)

‘భగవంత్ కేసరి’కి పోటీగా తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘లియో’ (Leo) సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌లో డామినేషన్‌ని కనబరిచినా.. టాక్ విషయంలో ‘సప్పుడు సెయ్యక పిల్ల..’ అనేలా బాలయ్య తన ఆధిపత్యం ప్రదర్శించారు. పాజిటివ్ టాక్, వీకెండ్, పండగ సీజన్ ఇవన్నీ ఈ సినిమాకు ప్లస్ కానున్నాయి. చూస్తుంటే.. కెరీర్‌లో ది బెస్ట్ ఫిగర్స్ బాలయ్య ఖాతాలో నమోదు అయ్యే అవకాశం కనిపిస్తోంది. శుక్రవారం విడుదలైన ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) చిత్రానికి మిశ్రమ టాక్ వస్తుండటం కూడా బాలయ్య (Balayya) సినిమాకు మరింత ప్లస్ కానుంది. చూద్దాం.. ఇన్ని పాజిటివ్స్ మధ్య ఫస్ట్ వీక్ బాలయ్య ఎలా దుమ్మురేపుతాడో?


దర్శకుడు అనిల్ రావిపూడి మాట ఇచ్చినట్లుగానే బాలయ్య ఫ్యాన్స్‌కి ‘బ్లాక్‌బస్టర్ దావత్’ ఇచ్చేశారు. ‘ఈ సినిమా షానా ఏండ్లు యాదుంటది? అని మొదటి నుంచి అనిల్ రావిపూడి చెబుతూనే ఉన్నారు. సినిమా చూసిన ఫ్యాన్స్ కూడా ఇదే మాట అంటుండటం విశేషం. బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో శ్రీలీల (Sreeleela) ఓ కీలక పాత్రలో నటించింది. జాతీయ అవార్డు విన్నర్ అర్జున్ రాంపాల్ (Arjun Rampal) ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఇందులో ఆయన విలన్‌గా నటించారు. భారీ తారాగణం నటించిన ఈ సినిమాకు ఎస్. థమన్ సంగీతం అందించారు.


ఇవి కూడా చదవండి:

============================

*Varun Tej: ‘ఆపరేషన్ వాలెంటైన్’ షూటింగ్ అయిపోయింది..

************************************

*Pindam: హీరో శ్రీ విష్ణు వదిలిన ‘పిండం’ ఫస్ట్ లుక్ పోస్టర్.. థ్రిల్లింగ్!

************************************

*Bramayugam: మమ్ముట్టి స్పీడ్‌ చూస్తుంటే ‘భ్రమ’లు తొలగిపోతున్నాయ్..

***********************************

*Japan: అమ్మాయిలు, గోల్డ్‌తో ఫుల్ టైమ్ ఎంజాయ్ చేసే మాస్ ఐటెం రాజా!

*********************************

*Family Star Glimpse: ఉల్లిపాయలు కొంటే ఆడు మనిషి కాదా.. పిల్లల్ని రెడీ చేస్తే ఆడు మగాడు కాదా.. ఐరెన్ వంచాలా ఏంటి?

*********************************

Updated Date - 2023-10-20T16:57:26+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!