Bramayugam: మమ్ముట్టి స్పీడ్‌ చూస్తుంటే ‘భ్రమ’లు తొలగిపోతున్నాయ్..

ABN , First Publish Date - 2023-10-19T16:56:16+05:30 IST

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి స్పీడ్ చూస్తుంటే.. యంగ్ హీరోలకు ఉన్న భ్రమలు తొలిగిపోతున్నాయ్. అవును.. ఈ వయసులో కూడా ఆయన షూటింగ్స్‌ని పరిగెత్తిస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తోన్న ‘భ్రమయుగం’ చిత్రీకరణ విజయవంతంగా పూర్తయిన విషయాన్ని ‘నైట్ షిఫ్ట్ స్టూడియోస్’ సంస్థ ఎంతో సంతోషంగా పంచుకుంది.

Bramayugam: మమ్ముట్టి స్పీడ్‌ చూస్తుంటే ‘భ్రమ’లు తొలగిపోతున్నాయ్..
Bramayugam Movie Team

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) స్పీడ్ చూస్తుంటే.. యంగ్ హీరోలకు ఉన్న భ్రమలు తొలిగిపోతున్నాయ్. అవును.. ఈ వయసులో కూడా ఆయన షూటింగ్స్‌ని పరిగెత్తిస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తోన్న ‘భ్రమయుగం’ (Bramayugam) చిత్రీకరణ విజయవంతంగా పూర్తయిన విషయాన్ని ‘నైట్ షిఫ్ట్ స్టూడియోస్’ సంస్థ ఎంతో సంతోషంగా పంచుకుంది. ‘భ్రమయుగం’ సినిమా 17 ఆగస్ట్, 2023 నుండి ఒట్టపాలెం, కొచ్చి, అతిరాపల్లి మొదలైన ప్రాంతాల్లో భారీ స్థాయిలో చిత్రీకరణ జరుపుకుంది. ఏకకాలంలో మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీ భాషల్లో 2024 ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయాలనే లక్ష్యంతో చిత్ర బృందం ఇప్పుడు నిర్మాణాంతర కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నమై ఉంది. నైట్ షిఫ్ట్ స్టూడియోస్ త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలను ప్రారంభించనుందని తెలుస్తోంది. (Bramayugam Movie Update)


Mammotty.jpg

ఈ సినిమాకు సంబంధించి సెప్టెంబర్‌లో మమ్ముట్టి లుక్‌తో కూడిన పోస్టర్ విడుదలైనప్పటి నుండి, అభిమానులు ఈ చిత్ర విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘కన్నూర్ స్క్వాడ్’తో సహా వరుస విజయాలతో దూసుకుపోతున్న మమ్ముట్టి, ‘భ్రమయుగం’తో ఆ విజయ పరంపరను కొనసాగిస్తారని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.

మమ్ముట్టి ప్రధాన పాత్రలో రాహుల్ సదాశివన్ (Rahul Sadasivan) రచన-దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ ‘భ్రమయుగం’ చిత్రాన్ని హర్రర్-థ్రిల్లర్ జానర్ చిత్రాలను నిర్మించడానికి ప్రత్యేకంగా స్థాపించబడిన నిర్మాణ సంస్థ ‘నైట్ షిఫ్ట్ స్టూడియోస్’ నిర్మిస్తోంది. నైట్ షిఫ్ట్ స్టూడియోస్‌తో వైనాట్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి. చక్రవర్తి రామచంద్ర, ఎస్.శశికాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Japan: అమ్మాయిలు, గోల్డ్‌తో ఫుల్ టైమ్ ఎంజాయ్ చేసే మాస్ ఐటెం రాజా!

*********************************

*Family Star Glimpse: ఉల్లిపాయలు కొంటే ఆడు మనిషి కాదా.. పిల్లల్ని రెడీ చేస్తే ఆడు మగాడు కాదా.. ఐరెన్ వంచాలా ఏంటి?

*********************************

*Rana Daggubati: తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలాంటి దర్శకుడు ఉన్నందుకు గౌరవంగా భావిస్తున్నా..

********************************

*VK Naresh: చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకం

**********************************

Updated Date - 2023-10-19T18:25:59+05:30 IST