Pindam: హీరో శ్రీ విష్ణు వదిలిన ‘పిండం’ ఫస్ట్ లుక్ పోస్టర్.. థ్రిల్లింగ్!

ABN , First Publish Date - 2023-10-19T19:12:08+05:30 IST

శ్రీకాంత్ శ్రీరామ్, ఖుషీ రవి జంటగా కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి నిర్మిస్తోన్న చిత్రం ‘పిండం‘. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. హారర్ జానర్‌లో తెరకెక్కిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ని గురువారం హీరో శ్రీవిష్ణు ఆవిష్కరించారు.

Pindam: హీరో శ్రీ విష్ణు వదిలిన ‘పిండం’ ఫస్ట్ లుక్ పోస్టర్.. థ్రిల్లింగ్!
Pindam First Look Launch

శ్రీకాంత్ శ్రీరామ్ (Srikanth Sriram), ఖుషీ రవి (Kushee Ravi) జంటగా కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి (Yeshwanth Daggumati) నిర్మిస్తోన్న చిత్రం ‘పిండం‘. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా (Saikiran Daida) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. గురువారం ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ని (Pindam First Look) హీరో శ్రీవిష్ణు (Sree Vishnu) ఆవిష్కరించి.. సినిమా ఘన విజయం సాధించాలని కోరుతూ.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఫస్ట్ లుక్ పోస్టర్ విషయానికి వస్తే.. దీపపు లాంతర్లు వెలుగులో చిత్ర కథానాయకుడు శ్రీరామ్, నాయిక ఖుషి రవి, ఈశ్వరీ రావు తదితరులు ఓ బల్లపై పడుకున్న పాప చుట్టూ ఉండటం, ఓ వ్యక్తి చేతిలో పుస్తకం, వారి ముఖాల్లో ప్రస్ఫుటంగా ఏదో ప్రమాదం గురించి కనిపిస్తున్న ఆందోళన, ఇవన్నీ భయానికి గురి చేస్తున్నాయి. ఇది జానర్‌కు అనుగుణంగా స్ట్రెయిట్ హార్రర్ ఫిల్మ్ అవుతుంది. ‘పిండం’ కథ ప్రస్తుతం, 1990 మరియు 1930లలో.. మూడు కాలక్రమాలలో జరిగేదిగా కనిపిస్తుంది. ఈ పోస్టరే చాలా భయనకంగా అనిపిస్తోంది. (Pindam First Look Out)


Pindam-FL.jpg

ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. ‘పిండం’ సినిమా కంప్లీట్ హారర్ చిత్రంగా ఉండబోతోంది. ఇంతటి భయానక హారర్ చిత్రం టాలీవుడ్‌లో ఇంత వరకు రాలేదని చెప్పగలను. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉపశీర్షిక. స్క్రీన్‌ప్లే ఈ చిత్రానికి హైలైట్‌గా ఉండనుంది. నా తొలి చిత్రానికి ఛాలెంజింగ్‌గా ఉంటుందని ఈ జానర్‌ని ఎన్నుకోవడం జరిగింది. త్వరలో అందరినీ భయపెడతాము అని తెలిపారు. పిండం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమా టీజర్‌ను అక్టోబర్ 30న విడుదల చేయనున్నామని, నవంబర్ నెలలో చిత్రం విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి తెలిపారు.


ఇవి కూడా చదవండి:

============================

*Bramayugam: మమ్ముట్టి స్పీడ్‌ చూస్తుంటే ‘భ్రమ’లు తొలగిపోతున్నాయ్..

***********************************

*Japan: అమ్మాయిలు, గోల్డ్‌తో ఫుల్ టైమ్ ఎంజాయ్ చేసే మాస్ ఐటెం రాజా!

*********************************

*Family Star Glimpse: ఉల్లిపాయలు కొంటే ఆడు మనిషి కాదా.. పిల్లల్ని రెడీ చేస్తే ఆడు మగాడు కాదా.. ఐరెన్ వంచాలా ఏంటి?

*********************************

*Rana Daggubati: తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలాంటి దర్శకుడు ఉన్నందుకు గౌరవంగా భావిస్తున్నా..

********************************

Updated Date - 2023-10-19T19:16:15+05:30 IST