Varun Tej: ‘ఆపరేషన్ వాలెంటైన్’ షూటింగ్ అయిపోయింది..

ABN , First Publish Date - 2023-10-20T01:27:24+05:30 IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తోన్న తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఈ సినిమాతో వరుణ్ తేజ్ హిందీలో అరంగేట్రం చేస్తున్నారు. యదార్ధ సంఘటన స్ఫూర్తితో రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్ర అప్‌డేట్‌ని మేకర్స్ తెలియజేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్లుగా మేకర్స్ పేర్కొన్నారు.

Varun Tej: ‘ఆపరేషన్ వాలెంటైన్’ షూటింగ్ అయిపోయింది..
Mega Prince Varun Tej

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej) నటిస్తోన్న తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine). ఈ సినిమాతో వరుణ్ తేజ్ హిందీలో అరంగేట్రం చేస్తున్నారు. యదార్ధ సంఘటన స్ఫూర్తితో రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్ర అప్‌డేట్‌ని మేకర్స్ తెలియజేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్లుగా మేకర్స్ పేర్కొన్నారు. ‘ఆపరేషన్ వాలెంటైన్ షూటింగ్ పూర్తి’ అని రాసి ఉన్న పోస్టర్‌‌‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌‌లో టీమ్ మొత్తం ఆనందంగా కనిపిస్తోంది. (Operation Valentine Shoot Wrapped Up)

మానుషి చిల్లర్ (Manushi Chhillar) ఈ చిత్రంతో తెలుగు అరంగేట్రం చేస్తోంది. ఇందులో ఆమె రాడార్ ఆఫీసర్ పాత్రను పోషించింది. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన నవదీప్‌ కూడా ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నారు. ఆపరేషన్ వాలెంటైన్ డిసెంబర్ 8, 2023న తెలుగు, హిందీలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. (Operation Valentine Update)


భారతదేశం ఎన్నడూ చూడని అతిపెద్ద వైమానిక దాడుల్లో మన వైమానిక దళం హీరోలు, వారు ఎదుర్కొన్న సవాళ్లను చూపించే ఈ చిత్రం పోస్ట్-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకునేందుకు సిద్ధమైంది. ఈ విజువల్ వండర్‌ని భారీ కాన్వాస్‌పై రూపొందిస్తున్నారు. 2022లో విడుదలైన ‘మేజర్’ భారీ విజయం తర్వాత సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మరో దేశభక్తి కథతో తిరిగి వస్తోంది. అనుభవజ్ఞుడైన యాడ్-ఫిల్మ్ మేకర్, సినిమాటోగ్రాఫర్, వీఎఫ్ఎక్స్ నిపుణుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా (Shakti Pratap Singh Hada) ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా, అమీర్ ఖాన్, సిద్ధార్థ్ రాజ్ కుమార్ రైటర్స్‌గా వ్యవహరించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ నుండి సందీప్ ముద్దా నిర్మించారు. నందకుమార్ అబ్బినేని, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ సహా నిర్మాతలు.


ఇవి కూడా చదవండి:

============================

*Pindam: హీరో శ్రీ విష్ణు వదిలిన ‘పిండం’ ఫస్ట్ లుక్ పోస్టర్.. థ్రిల్లింగ్!

************************************

*Bramayugam: మమ్ముట్టి స్పీడ్‌ చూస్తుంటే ‘భ్రమ’లు తొలగిపోతున్నాయ్..

***********************************

*Japan: అమ్మాయిలు, గోల్డ్‌తో ఫుల్ టైమ్ ఎంజాయ్ చేసే మాస్ ఐటెం రాజా!

*********************************

*Family Star Glimpse: ఉల్లిపాయలు కొంటే ఆడు మనిషి కాదా.. పిల్లల్ని రెడీ చేస్తే ఆడు మగాడు కాదా.. ఐరెన్ వంచాలా ఏంటి?

*********************************

*Rana Daggubati: తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలాంటి దర్శకుడు ఉన్నందుకు గౌరవంగా భావిస్తున్నా..

********************************

Updated Date - 2023-10-20T01:27:31+05:30 IST