Family Star Glimpse: ఉల్లిపాయలు కొంటే ఆడు మనిషి కాదా.. పిల్లల్ని రెడీ చేస్తే ఆడు మగాడు కాదా.. ఐరెన్ వంచాలా ఏంటి?

ABN , First Publish Date - 2023-10-18T23:42:07+05:30 IST

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఓ చిత్రాన్ని నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉన్నట్లుగా ఇప్పటికే దిల్ రాజు ప్రకటించారు. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి తాజాగా టైటిల్ కన్ఫర్మ్ చేస్తూ.. యూనిట్ ఫస్ట్ గ్లింప్స్‌ని కూడా వదిలారు. ‘ఫ్యామిలీ స్టార్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు.

Family Star Glimpse: ఉల్లిపాయలు కొంటే ఆడు మనిషి కాదా.. పిల్లల్ని రెడీ చేస్తే ఆడు మగాడు కాదా.. ఐరెన్ వంచాలా ఏంటి?
Vijay Deverakonda in Family Star Movie

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కాంబినేషన్‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) బ్యానర్‌పై నిర్మాతలు దిల్ రాజు (Dil Raju), శిరీష్ (Shirish ఓ చిత్రాన్ని నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉన్నట్లుగా ఇప్పటికే దిల్ రాజు ప్రకటించారు. దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. హోల్ సమ్ ఎంటర్‌టైనింగ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల (Parasuram Petla) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి తాజాగా టైటిల్ కన్ఫర్మ్ చేస్తూ.. యూనిట్ ఫస్ట్ గ్లింప్స్‌ని కూడా వదిలారు. ఈ సినిమాకు సంబంధించి కొన్ని రోజులుగా వైరల్ అవుతున్న టైటిల్‌నే ఇప్పుడు మేకర్స్ కూడా ఖరారు చేశారు. ఈ సినిమాకు ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు. ఇది ఎస్వీసీ సంస్థలో నిర్మితమవుతున్న 54వ సినిమా కాగా, విజయ్ దేవరకొండకు 13వ చిత్రం. ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు.

ఫ్యామిలీ స్టార్ గ్లింప్స్ విషయానికి వస్తే.. ఇంట్లో పనులు చేసే ఫ్యామిలీ మ్యాన్‌గా.. బయట రౌడీల బెండు తీసే పవర్ ఫుల్ మ్యాన్‌గా విజయ్ దేవరకొండ ఇందులో కనిపించారు. లైన్‌లో నిలబడి ఉల్లిపాయలు తేవడాలు, టైమ్‌కు లేచి పిల్లల్ని రెడీ చేసి స్కూల్‌కు పంపించడాలు అనుకున్నావా మగతనం అంటే అని విలన్ ఎగతాళిగా మాట్లాడగా... ‘‘భలే మాట్లాడతారన్నా మీరంతా.. ఉల్లిపాయలు కొంటే ఆడు మనిషి కాదా... పిల్లల్ని రెడీ చేస్తే ఆడు మగాడు కాదా... ఐరెన్ వంచాలా ఏంటి? అంటూ పవర్ ఫుల్ డైలాగ్ చెప్పిన విజయ్... విలన్ గ్యాంగ్ లోని ఒకడి తల పగలగొట్టి ‘సారీ బాబాయ్...కంగారులో కొబ్బరికాయ తేవడం మర్చిపోయా.. తలకాయ కొట్టేశా’ అని విలన్‌కు షాక్ ఇవ్వడం కూల్ హీరోయిజం చూపించింది. టీజర్ చివరలో బ్యూటీఫుల్ యంగ్ కపుల్‌గా విజయ్, మృణాల్ మధ్య ఎమోషనల్ బాండింగ్ రివీల్ చేశారు. ఈ గ్లింప్స్‌తో ‘ఫ్యామిలీ స్టార్’ ఒక కూల్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ప్రేక్షకులను అలరించబోతోందనేది తెలుస్తోంది. (Family Star Glimpse Talk)


Family-Star.jpg

పరశురామ్, విజయ్ కాంబినేషన్‌లో ఇప్పటికే వచ్చిన ‘గీతగోవిందం’ ఎటువంటి విజయాన్ని నమోదు చేసిందో తెలియంది కాదు. మరోసారి వీరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. అందులోనూ దిల్ రాజు బ్యానర్, సంక్రాంతి (Sankranthi) సెంటిమెంట్.. చూస్తుంటే అన్నీ శుభ శకునాలే కనిపిస్తున్నాయ్. చూద్దాం.. సంక్రాంతి ఈ ఫ్యామిలీ స్టార్ ఏం చేయబోతున్నారో? ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను త్వరలోనే మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Rana Daggubati: తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలాంటి దర్శకుడు ఉన్నందుకు గౌరవంగా భావిస్తున్నా..

********************************

*VK Naresh: చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకం

**********************************

*Telusu Kada: నాని క్లాప్‌తో సిద్దు జొన్నలగడ్డ సినిమా మొదలైంది.. తెలుసు కదా!

**********************************

Updated Date - 2023-10-18T23:46:51+05:30 IST