Bhagavanth Kesari: ఆయుధ పూజతో గీ సారి దసరా జోర్దారుంటది

ABN , First Publish Date - 2023-07-22T16:03:42+05:30 IST

గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘భగవంత్ కేసరి’. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్ చేశారు. దసరా సెలవుల్లో ప్రేక్షకులను అలరించడానికి అక్టోబర్ 19న ఈ చిత్రం విడుదలకాబోతోంది.

Bhagavanth Kesari: ఆయుధ పూజతో గీ సారి దసరా జోర్దారుంటది
Nandamuri Balakrishna in Bhagavanth Kesari

గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari). షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది (Sahu Garapati and Harish Peddi) నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లతో వస్తూ బ్యాక్ టు బ్యాక్ ట్రీట్‌లను అందజేస్తున్నారు. టైటిల్‌ను విడుదల చేసిన అనంతరం టీజర్‌తో పాటు ఇప్పటికే వచ్చిన ప్రధాన తారాగణం ఫస్ట్ లుక్స్ ఎంతగానో అలరించాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి మరో మాసివ్ అప్‌డేట్‌ను మేకర్స్ విడుదల చేశారు.


‘ఆయుధ పూజతో గీ సారి దసరా జోర్దారుంటది’ అంటూ.. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. అంతకు ముందు ఈ ముసురు సలిలో అందరిలో ఫైర్ పుట్టించడానికి ‘భగవంత్ కేసరి’ నుంచి అప్‌డేట్ వదులుతున్నామని మేకర్స్ ప్రకటించగా.. చెప్పినట్లే నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకునేలా.. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ‘భగవంత్ కేసరి’ దసరా సెలవుల్లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. మేకర్స్ అనౌన్స్ చేసినట్లుగా ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం రిలీజ్, లాంగ్ దసరా హాలీడేస్ ఈ సినిమాకు బిగ్ అడ్వాంటేజ్ కాబోతున్నాయి. (Bhagavanth Kesari Release Date)

Bhagavanth.jpg

ఇక ఈ రిలీజ్ డేట్ పోస్టర్‌లో బాలకృష్ణ నడిచే వాల్కనో‌లా వున్నారు. రెండు చేతుల్లో రెండు గన్స్ పట్టుకుని ఫెరోషియస్‌గా నడుచుకుంటూ వస్తున్నారు. యూనిక్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో హై యాక్షన్‌ ఉంటుందనేదానికి సింబాలిక్‌గా ఈ పోస్టర్ ఉంది. అనిల్ రావిపూడి మార్క్ వినోదం, కుటుంబ భావోద్వేగాలు ఎలాగూ ఉంటాయి కాబట్టి.. బాలయ్య ఈ దసరాకి చేసే ధూమ్ ధామ్ ఓ రేంజ్‌లో ఉంటుందని ఫిక్సయిపోవచ్చు. బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ క్రష్ శ్రీలీల (Sreeleela) ఓ కీలక పాత్రలో నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ (Arjun Rampal) విలన్ పాత్ర పోషిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*Amala Paul: మళ్లీ స్పాట్‌లైట్‌లోకి అమల.. ఫొటోస్‌‌తో మతి పోగొట్టేసిందిగా!

**************************************

*SS Rajamouli: ‘కల్కి 2989 AD’ గ్లింప్స్ రాజమౌళికి నచ్చిందా.. ఎలా స్పందించారంటే?

**************************************

*Unstoppable: ఓటీటీలోకి వచ్చేసిన ‘అన్‌స్టాపబుల్’.. ఎందులో స్ట్రీమింగ్ అంటే..

**************************************

*Malavika Mohanan: జీవితం ఒక కళాకృతి కాదా?

**************************************

*Chiru-Allu Arjun: మామ, అల్లుడు.. ఎవ్వరూ తగ్గట్లే..!

**************************************

Updated Date - 2023-07-22T16:03:42+05:30 IST