కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Allu Arjun: జాతీయ అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి తెలుగు నటుడు

ABN, First Publish Date - 2023-08-24T18:27:19+05:30

ఇటీవల ఆస్కార్ అవార్డుతో తెలుగు సినిమా ఇండస్ట్రీ సత్తా ఏంటో ప్రపంచ సినిమాకి తెలిసింది. ఇప్పుడు మరోసారి తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా వైడ్‌గా తెలియజెప్పారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తాజాగా ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డులలో అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు.

Allu Arjun

ఇటీవల ఆస్కార్ అవార్డుతో తెలుగు సినిమా ఇండస్ట్రీ సత్తా ఏంటో ప్రపంచ సినిమాకి తెలిసింది. ఇప్పుడు మరోసారి తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా వైడ్‌గా తెలియజెప్పారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun). తాజాగా ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డులలో అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా (Best Actor) ఎంపికయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల (National Awards 2023)లో అల్లు అర్జున్ ‘పుష్ప ది రైజ్’ సినిమాలో నటించిన నటనకుగానూ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏ తెలుగు హీరో సాధించలేకపోయిన జాతీయ అవార్డును.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి అల్లు అర్జున్ సాధించి పెట్టారు. దీనికి అల్లు అర్జున్ నటనతో పాటు.. సుకుమార్ దర్శకత్వ ప్రతిభ కూడా తోడయిందని చెప్పాలి.


ఈ అవార్డుతో అల్లు అర్జున్ చరిత్రను సృష్టించారు. 68 సంవత్సరాలుగా ప్రకటిస్తున్న జాతీయ ఉత్తమ నటుడి అవార్డులలో తెలుగు హీరో పేరు లేకపోవడం, తెలుగు హీరోకి అవార్డు దక్కకపోవడం విడ్డూరమనే చెప్పాలి. తెలుగు నటీనటుల్లో కొందరు నామినేషన్స్ వరకు వెళ్లారు కానీ.. ఉత్తమ నటుడిగా అవార్డును గెలుచుకోలేకపోయారు. కానీ అల్లు అర్జున్ తన మ్యానరిజమ్స్‌తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును పొందారు. ప్రతి ఒక్కరూ తగ్గేదేలే అంటూ.. ‘పుష్ప రాజ్’కు కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఉత్తమ హీరో అవార్డు కూడా ఆయనకి కనెక్ట్ అయింది. నిజంగా ఇది తెలుగు వారు గర్వించదగిన క్షణం. తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచిన అల్లు అర్జున్‌కు ఇండస్ట్రీ తరపు నుంచే కాక.. ప్రేక్షక అభిమానులందరూ అభినందనలు తెలియజేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

***************************************

*Bhagavanth Kesari: మ్యూజికల్ ప్రమోషన్స్‌లో బాలయ్య ‘భగవంత్ కేసరి’.. ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే..?

***************************************

*Sathyaraj: సూపర్‌స్టార్‌ అంటే రజనీనే.. ఆ వార్‌కి చెక్

***************************************

*Sukanya: ఐదు పదుల వయసులో మరో పెళ్లా? నటి సుకన్య షాకైన వేళ..

***************************************

*Pawan Kalyan: మన అంతరిక్ష చరిత్రలో సువర్ణ అధ్యాయం

***************************************

*Chandrayaan-3: చంద్రునిపై హాలీడే జరుపుకునే రోజు ఇంకెంతో దూరంలో లేదు.. సెలబ్రిటీల అభినందనలు

***************************************

Updated Date - 2023-08-24T18:31:50+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!