Hero Sharwanand: హీరో శర్వానంద్‌కు రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా!

ABN , First Publish Date - 2023-05-28T11:06:10+05:30 IST

హీరో శర్వానంద్ ప్రయాణిస్తున్న కారు.. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కారు బోల్తా పడగా.. హీరో శర్వానంద్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని. భయపడాల్సిన అవసరం లేదని శర్వా టీమ్ తెలియజేశారు.

Hero Sharwanand: హీరో శర్వానంద్‌కు రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా!
Sharwanand

యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand) హైదరాబాద్ ఫిల్మ్ నగర్ జంక్షన్ వద్ద రోడ్డ ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న రేంజ్‌ రోవర్‌ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా కొట్టడంతో.. ఆయనకు స్వల్ప గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. వెంటనే అక్కడి స్థానికులు ఆయనని ఆస్పత్రికి తరలించడంతో.. శర్వానంద్ ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. అయితే కారు కున్న సేఫ్టీ ఫీచర్స్ కారణంగా.. పెద్ద ప్రమాదం తప్పినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అందుకున్న సమాచారం ప్రకారం.. శర్వానంద్ క్షేమంగా ఉన్నారు. చిన్నపాటి గాయాలు మినహా ఆయనకు ఏం కాలేదని, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్స్ వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ఆదివారం తెల్లవారు జామున ఈ ఘటన జరిగినట్లుగా సమాచారం.

నాలుగు రోజుల్లో శర్వానంద్ పెళ్లి

రీసెంట్‌గా శర్వానంద్ మ్యారేజ్‌ (Sharwanand Marriage)పై ఏ రకంగా వార్తలు వైరల్ అయ్యాయో తెలియంది కాదు. ఈ నేపథ్యంలో జూన్ 2, 3 తేదీలలో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా శర్వా పెళ్లి జరగబోతున్నట్లుగా అధికారికంగా వార్త వెలువడింది. రాజస్థాన్‌లోని లీలా ప్యాలెస్‌లో శర్వానంద్ పెళ్లికి సంబంధించి ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె అయిన రక్షిత రెడ్డి (Rakshitha Reddy)ని శర్వానంద్ వివాహం చేసుకోబోతున్నారు. నాలుగు రోజులలో పెళ్లి అనగా.. ఇలా జరగడంతో ఇరు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంపై శర్వానంద్ టీమ్ (Sharwanand Team) అధికారికంగా ఓ మెసేజ్‌ని విడుదల చేసింది. అందులో..

‘‘హీరో శర్వానంద్ ప్రయాణిస్తున్న కారు ఫిల్మ్ నగర్‌ జంక్షన్ దగ్గర అదుపు తప్పిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అందరూ క్షేమంగా వున్నారు. కారుకి మాత్రం చిన్న గీత పడింది. ఘటన జరిగిన సమయంలో డ్రైవర్ అక్కడే వున్నారు. చాలా స్వల్ప సంఘటన. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు’’ అని శర్వానంద్ టీమ్ అధికారికంగా ఓ మెసేజ్‌ను మీడియాకు విడుదల చేసింది.

ఇవి కూడా చదవండి:

************************************************

*Miss Shetty Mr Polishetty: నవీన్ పాడుతుంటే.. హీరో ధనుష్ వాయిస్ వినిపిస్తోంది.. ఏంటి కథ?

*Sivaji Raja: ‘రాజు’లు చాలా మంది ఉంటారు కానీ.. అందులో మంచివారు కొందరే!

*Vijayashanthi: ఎన్టీఆర్‌తో ఆ సంఘటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది

*Super Star Krishna: సినిమా వచ్చి 52 ఏళ్లు.. అయినా ఆ కటౌట్స్ చూస్తే..!

*Daana Veera Soora Karna: ఒక్క ఎన్టీఆర్‌కే ఇది సాధ్యం..!

*Adi Seshagiri Rao: ‘అసలు నరేష్ ఎవరు?’.. బాంబ్ పేల్చిన సూపర్ స్టార్ సోదరుడు

Updated Date - 2023-05-28T11:16:13+05:30 IST