Super Star Krishna: సినిమా వచ్చి 52 ఏళ్లు.. అయినా ఆ కటౌట్స్ చూస్తే..!

ABN , First Publish Date - 2023-05-27T17:58:05+05:30 IST

సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం రీ రిలీజ్ కాబోతుండగా.. ఇప్పటికే ఫ్యాన్స్ భారీ కటౌట్స్‌తో థియేటర్ల వద్ద సిద్ధం అవుతున్నారు. హైదరాబాద్ సుదర్శన్ 35 ఎమ్ఎమ్ థియేటర్ వద్ద కృష్ణకు సంబంధించిన భారీ కటౌట్‌ని ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు. ఈ కటౌట్ ఇప్పడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Super Star Krishna: సినిమా వచ్చి 52 ఏళ్లు.. అయినా ఆ కటౌట్స్ చూస్తే..!
Super Star Krishna

కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్.., పాటొచ్చి పదేళ్లు అవుతుంది అయినా పవర్ తగ్గలే.. వంటి డైలాగ్స్ అన్నీ.. సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) సినిమాల స్ఫూర్తితోనే వచ్చి ఉంటాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే.. తెలుగు వెండితెరకు కొత్త కొత్త సొగసులను అద్దిన ఘనత ఇప్పటికీ, ఎప్పటికీ సూపర్ స్టార్‌ కృష్ణ పేరిటే ఉంటుంది. ఇప్పుడంతా పాన్ ఇండియా జపం చేస్తున్నారు కానీ.. 52 సంవత్సరాల క్రితమే కృష్ణ పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్‌ని దున్నేశారు. ఆయన హీరోగా నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ (Mosagallaku Mosagadu) చిత్రం అప్పట్లోనే పాన్ వరల్డ్ స్థాయిలో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడదే సినిమా మరొక్కసారి అందరి ముందుకు రాబోతోంది.

Super-Star-Krishna.jpg

సూపర్ స్టార్ కృష్ణ జయంతి (Krishna Birth Anniversary)ని పురస్కరించుకుని.. మే 31వ తేదీన ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం రీ రిలీజ్ కాబోతోంది. ఆయన సోదరుడు ఆది శేషగిరిరావు ఈ సినిమాను మరోసారి సరికొత్త హంగులతో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇండియాలోనే మొదటి కౌబాయ్ చిత్రమిది. ఈ సినిమా తర్వాత కొన్నాళ్ల పాటు ఈ ట్రెండ్ నడిచింది.. కానీ ట్రెండ్ సెట్టర్‌గా మాత్రం కృష్ణ పేరే ఇప్పటికీ చెప్పబడుతోంది. ఇక ఈ సినిమా రీ రిలీజ్‌ను పురస్కరించుకుని అప్పుడే అన్ని చోట్లా సందడి మొదలైంది. అప్పట్లో ఈ సినిమా విడుదలైనప్పుడు ఎలాంటి సందడి నెలకొందో.. దాదాపు రీ రిలీజ్‌‌కు కూడా అంతే స్థాయిలో థియేటర్ల వద్ద సందడి మొదలైంది.

Krishna-2.jpg

సూపర్ స్టార్ అభిమానులు ఈ సినిమా రీ రిలీజ్‌ను ఓ పండుగలా జరిపి.. ఆయనకు గ్రాండ్‌గా నివాళులు (Tribute) అర్పించాలని ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే.. సినిమా వచ్చి 52 ఏళ్లు అవుతున్నా.. ఆ సినిమాలో నటించిన హీరో ప్రస్తుతం లేకున్నా.. అభిమానంలో మాత్రం మార్పు ఉండదనేలా.. ప్రతి థియేటర్ వద్ద సూపర్ స్టార్ కృష్ణ కటౌట్స్‌ని ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ (Hyderabad) సుదర్శన్ 35 MM థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన అతి పెద్ద భారీ కటౌట్ అయితే.. కృష్ణపై అభిమానుల ప్రేమ ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతుందనే సంకేతాన్ని తెలియజేస్తుందంటే.. ఏ రేంజ్‌లో అభిమానులు ఈ సినిమా రీ రిలీజ్‌పై శ్రద్ధ పెడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఒక్క హైదరాబాద్ అనే కాదు.. భీమవరం, వైజాగ్ ఇలా ప్రతి చోటా సూపర్ స్టార్ కృష్ణ కటౌట్స్ ఇప్పటికే ఫ్యాన్స్ (Super Star Krishna Fans) ఏర్పాటు చేయడం చూసిన వారంతా.. నిజంగా అభిమానం అంటే ఇది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రానికి సంబంధించిన కృష్ణ కటౌట్స్ టాక్ ఆఫ్ ద సోషల్ మీడియాగా మారాయి.

ఇవి కూడా చదవండి:

************************************************

*Daana Veera Soora Karna: ఒక్క ఎన్టీఆర్‌కే ఇది సాధ్యం..!

*Adi Seshagiri Rao: ‘అసలు నరేష్ ఎవరు?’.. బాంబ్ పేల్చిన సూపర్ స్టార్ సోదరుడు

*Major: మహేష్ బాబు నిర్మించిన సినిమాకు ఘోర అవమానం

Updated Date - 2023-05-27T17:58:12+05:30 IST