Adi Seshagiri Rao: ‘అసలు నరేష్ ఎవరు?’.. బాంబ్ పేల్చిన సూపర్ స్టార్ సోదరుడు

ABN , First Publish Date - 2023-05-26T18:18:40+05:30 IST

సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు తన తాజా ఇంటర్వ్యూలో కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘నరేష్ ఎవరు? ఆయనెవరో కూడా మాకు తెలియదు. మీరు చెప్పే వీడియో కూడా నేను ఇంత వరకు చూడలేదు. వాళ్ల గొడవల గురించి నేను మాట్లాడను’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Adi Seshagiri Rao: ‘అసలు నరేష్ ఎవరు?’.. బాంబ్ పేల్చిన సూపర్ స్టార్ సోదరుడు
Adi Seshagiri Rao and Naresh

నరేష్ ఎవరో మాకు తెలియదంటూ సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) సోదరుడు ఆదిశేషగిరిరావు (Adi Seshagiri Rao) షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ (Mosagallaku Mosagadu) చిత్రాన్ని.. మే 31న కృష్ణ జయంతి (Krishna Birth Anniversary)ని పురస్కరించుకుని ఆయన రీ రిలీజ్ చేస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అందులో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్‌లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘అసలు నరేష్ ఎవరు? ఆయనెవరో మాకు తెలియదు’ అంటూ ఆదిశేషగిరిరావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విషయంలోకి వస్తే.. సూపర్ స్టార్ కృష్ణ చనిపోయినప్పుడు పార్థివదేహం వద్ద ఎవరూ లేరంటూ రమ్యరఘుపతి కొన్ని ఆరోపణలు చేస్తూ.. అప్పట్లో ఓ వీడియోని కూడా విడుదల చేశారు. అది నిజమేనా? అంటూ ఆదిశేషగిరిరావుకు ఈ ఇంటర్వ్యూలో ఓ ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన సమాధానం ఇస్తూ.. అలాంటిదేమీ లేదు. మహేష్ బాబు (Mahesh Babu) లేకపోతే.. అక్కడ ఎవరూ లేనట్లేనా? మా అబ్బాయి, అలాగే నా మేనల్లుడు అక్కడే ఉన్నారు అని సమాధానం చెప్పగా.. నరేష్ లేడంటూ రమ్యరఘుపతి (Ramya Raghupathi) ఆరోపణలు చేశారు అని మధ్యలో యాంకర్ కలుగజేసుకోగా.. ‘‘నరేష్ ఎవరు? ఆయనెవరో కూడా మాకు తెలియదు. మీరు చెప్పే వీడియో కూడా నేను ఇంత వరకు చూడలేదు. వాళ్ల గొడవల గురించి నేను మాట్లాడను’’ అంటూ ఆదిశేషగిరిరావు చెప్పుకొచ్చారు.

Krishna.jpg

మరో వైపు నరేష్, పవిత్రల బంధాన్ని ఘట్టమనేని (Ghattamaneni) ఫ్యామిలీ మొత్తం యాక్సెప్ట్ చేసినట్లుగా వారిద్దరూ కలిసి నటించిన ‘మళ్ళీ పెళ్లి’ (Malli Pelli) చిత్ర ప్రమోషన్స్‌లో ఆ జంట చెప్పుకుంటుండగా.. ఇప్పుడు ఆదిశేషగిరిరావు చేసిన కామెంట్స్‌తో అలాంటిదేమీ లేదనేది అర్థమవుతోంది. ఆయన మాటలను బట్టి నరేష్ వ్యవహారం వారికి నచ్చడం లేదనేది కూడా స్పష్టమవుతోంది. వాస్తవానికి ఆదిశేషగిరిరావు చాలా తక్కువగా మాట్లాడుతుంటారు. కాంట్రవర్సీకి చోటులేకుండా.. చాలా బాధ్యతగా సమాధానాలు చెబుతుంటారు. అందుకే.. కృష్ణ హీరోగా మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో అన్నయ్య వెంటే ఉండి ఆయనతో ఆదిశేషగిరిరావు సినిమాలు నిర్మించారు. ఇప్పుడు కృష్ణ చనిపోయిన తర్వాత వస్తున్న మొదటి పుట్టినరోజు కావడంతో.. ఆయన నిర్మించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తూ.. కృష్ణ జయంతిని గ్రాండ్‌గా నిర్వహించే పనిలో ఆదిశేషగిరిరావు (Super Star Krishna Brother) ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Major: మహేష్ బాబు నిర్మించిన సినిమాకు ఘోర అవమానం

*TholiPrema Re Release: సపోర్ట్ చేసేదే లేదంటోన్న మెగా ఫ్యాన్స్.. కారణం ఏంటంటే?

*Virinchi Varma: కామ్‌గా షూటింగ్ మొదలెట్టేసిన దర్శకుడు

*Tiger Nageswara Rao Glimpse: పులుల్ని వేటాడే పులిని చూశారా? అయితే చూడండి..

Updated Date - 2023-05-26T18:22:25+05:30 IST