Miss Shetty Mr Polishetty: నవీన్ పాడుతుంటే.. హీరో ధనుష్ వాయిస్ వినిపిస్తోంది.. ఏంటి కథ?

ABN , First Publish Date - 2023-05-27T20:45:24+05:30 IST

అనుష్క, నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రం కోసం పాన్ ఇండియా స్టార్ ధనుష్ ఓ పాట పాడారు. అయితే ఈ పాటకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వీడియోలో నవీన్ పోలిశెట్టి అల్లరల్లరి చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Miss Shetty Mr Polishetty: నవీన్ పాడుతుంటే.. హీరో ధనుష్ వాయిస్ వినిపిస్తోంది.. ఏంటి కథ?
Ramajogaiah Sastry and Naveen Polishetty

యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty), స్వీటీ బ్యూటీ అనుష్క శెట్టి (Anushka Shetty) నటించిన చిత్ర ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty). ఈ చిత్రంలోని ఓ పాట పాడేందుకు నానా హంగామా చేశాడు నవీన్ పోలిశెట్టి. ఈ మధ్య హీరోలే తమ చిత్రాల్లో పాటలు పాడుకుంటున్నారని.. తను కూడా తన సినిమాలోని పాట పాడుకుంటానని చెబుతూ.. అటు నిర్మాత, మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్‌ల వద్ద ఓ రేంజ్‌లో బిల్డప్ ఇచ్చాడు. సరే అని మైక్ ఇచ్చారు.. తీరా అతను పాడుతుంటే పాన్ ఇండియన్ స్టార్ హీరో ధనుష్‌ వాయిస్ వినిపిస్తోంది. మరి ఇదెలా సాధ్యం అంటే.. అదే మరి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’.

Naveen-Polishetty.jpg

అర్థం కాలేదా.. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మూవీ కోసం నిజంగానే ధనుష్ ఓ హ్యాండ్ వేశాడు. ‘కొలవెరి డీ’తో ఓ ఊపు ఊపేసిన ధనుష్.. ఆ తర్వాత తనకు సమయం దొరికినప్పుడల్లా.. పాటలు పాడుతూనే ఉన్నారు. తాజాగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా కోసం ఆయన ఓ పాట పాడారు. ఈ పాటకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వీడియోని తాజాగా చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ అనౌన్స్‌మెంట్ వీడియోలో, నవీన్ తన దర్శకుడిని మరియు నిర్మాతను తాను పాట పాడతాను అని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వారు అతని తమాషా ప్రయత్నాలను తిరస్కరించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. (Dhanush Sings Song for MSMP)

Dhanush.jpg

విషయంలోకి వస్తే.. ‘హతవిధీ (Hathavidi) ఏందిదీ.. ఊహలో లేనిదీ.. బుల్లిచీమ బతుకుపై బుల్డోజరైనదీ..’ అంటూ సాగే పాటను ధనుష్ ఆలపించారు. మే 31న ఫుల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేయబోతున్నారు. అదే రోజు ధనుష్‌ (Dhanush) పాడుతున్న లిరికల్ వీడియో కూడా మేకర్స్ విడుదల చేయనున్నారు. నవీన్ పొలిశెట్టి స్టాండప్ కమెడియన్‌గా, అనుష్క చెఫ్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని మహేష్‌ బాబు.పి (Mahesh Babu P) దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ (UV Creations) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ చిత్రంలో తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మళయాల భాషల్లో ఏక కాలంలో విడుదల కానుంది.


ఇవి కూడా చదవండి:

************************************************

*Sivaji Raja: ‘రాజు’లు చాలా మంది ఉంటారు కానీ.. అందులో మంచివారు కొందరే!

*Vijayashanthi: ఎన్టీఆర్‌తో ఆ సంఘటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది

*Super Star Krishna: సినిమా వచ్చి 52 ఏళ్లు.. అయినా ఆ కటౌట్స్ చూస్తే..!

*Daana Veera Soora Karna: ఒక్క ఎన్టీఆర్‌కే ఇది సాధ్యం..!

*Adi Seshagiri Rao: ‘అసలు నరేష్ ఎవరు?’.. బాంబ్ పేల్చిన సూపర్ స్టార్ సోదరుడు

Updated Date - 2023-05-27T20:45:24+05:30 IST