సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Sarath Babu: హాస్పిటల్‌లో నటుడు శరత్ బాబు.. అసలేమైంది?

ABN, First Publish Date - 2023-03-30T13:05:54+05:30

సీనియర్ నటుడు శరత్ బాబు (Sarath Babu) అనారోగ్యానికి గురైనట్లుగా తెలుస్తుంది. ఆయనకు ఏమైందనే దానిపై ఇంకా ఎటువంటి విషయం తెలియరాలేదు కానీ..

Actor Sarath Babu
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీనియర్ నటుడు శరత్ బాబు (Sarath Babu) అనారోగ్యానికి గురైనట్లుగా తెలుస్తుంది. ఆయనకు ఏమైందనే దానిపై ఇంకా ఎటువంటి విషయం తెలియరాలేదు కానీ.. ప్రస్తుతానికైతే ఆయన హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నట్లుగా కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కల్యాణి కూడా తన ఫేస్‌బుక్ అకౌంట్ వేదికగా శరత్ బాబు త్వరగా కోలుకోవాలంటే ఓ పోస్ట్ చేయడంతో.. శరత్‌ బాబుకు అసలేమైంది? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. (Sarath Babu Hospitalized)

నటుడు శరత్ బాబు దాదాపు 2000కి పైగా సినిమాలలో నటించారు. ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power Star Pawan Kalyan) నటించిన ‘వకీల్ సాబ్’ (Vakeel Saab) చిత్రంలో ఆయన ఓ కీలక పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు జనానికి నీ అవసరం ఉంది అంటూ ఆయన చెప్పిన డైలాగ్‌కు థియేటర్స్ దద్దరిల్లాయి. ఇదే కాకుండా.. తన వరకు వచ్చిన పాత్రలను ఆయన మిస్ కాకుండా చేస్తూనే ఉన్నారు. అలాంటిది.. సడెన్‌గా ఆయనని హాస్పిటల్‌లో చేర్చారని, ఆయనని పరామర్శించేందుకు ప్రముఖులెందరో వెళుతున్నట్లుగా కోలీవుడ్ మీడియా (Kollywood Media) రాసుకొస్తుంది.

‘‘నాకు ఇష్టమైన హీరో.. అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడు శరత్ బాబుగారు కోలుకోవాలని మనం స్వామిని వేడుకుందాం.. శ్రీరామరక్ష’’ అంటూ కరాటే కల్యాణి (Kalyani Padala) తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపింది. దీంతో అసలు ఆయనకు ఏమైంది? చాలా మంచి నటుడు. ఆయన త్వరగా కోలుకోవాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక కరాటే కల్యాణి (Karate Kalyani) పోస్ట్‌కు ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ.. ‘మీరు ఎవరిని కోలుకోవాలని ప్రార్థిస్తే వాళ్లు టపా అంటున్నారు..😔 నీకో దండం ఏ రక్షలు పని చేయవు గానీ.. ఇలా పోస్ట్ పెట్టకు.🙏’ అని రాసుకొచ్చారు. దీనికి ఆమె కౌంటర్ ఇస్తూ.. ‘నీకు ఇలా అర్థం అయింది కదా నువ్వు కొలుకో.. తొందరగా.. మానసికంగా నువ్వు బాగాలేవు..’ అని సమాధానమిచ్చింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (Karate Kalyani about Sarath Babu Health)


ఇవి కూడా చదవండి:

*********************************

*Manchu Lakshmi: ‘ఛమ్కీల అంగీలేసి’ పాటకి మంచు లక్ష్మీ స్టెప్స్.. అరిపించేసింది

*Rocking Rakesh: జోర్దార్ సుజాత టార్చర్ పెట్టిందా? ఏడుస్తూ.. అసలు విషయం చెప్పేసిన రాకేష్!

*Tollywood: శోభితతో చైతూ.. సుప్రియతో శేష్.. ఇలా దొరికేశారేంటి?

*Sana: అందుకే అలీ రెజాతో రొమాంటిక్ సీన్ చేశా.. అలాంటివి ఇంకా చేయాలని ఉంది

*Upasana: ఉపాసన బేబీ బంప్ ఫొటో వైరల్.. ఇక డౌట్స్ వద్దమ్మా..!

*SSMB28: మళ్లీ అప్పటి వరకు అప్‌డేట్స్ అడగవద్దు.. ఫ్యాన్స్‌కి నిర్మాత హెచ్చరిక

*Bhanushree Mehra: మరో బాంబ్ పేల్చిన అల్లు అర్జున్ ‘వరుడు’ హీరోయిన్

*Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?

Updated Date - 2023-03-30T13:10:54+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!