సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Charmme Kaur: దిమాఖ్ ఖరాబ్ అనౌన్స్‌మెంట్ అంటోంది.. మరి ‘లైగర్’ సంగతేంటి?

ABN, First Publish Date - 2023-05-13T18:22:06+05:30

‘ఇస్మార్ట్ శంకర్’ వచ్చిన దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత.. మళ్లీ ఈ కాంబినేషన్‌లో సినిమా రూపుదిద్దుకోబోతోంది. ఈ విషయం గత వారం, పది రోజులుగా సోషల్ మీడియాలో

Ismart Shankar Team
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ (Puri Jagannadh), యంగ్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ (Ismart Shankar) బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే అందుకుని.. వరుస ఫ్లాప్‌ల తర్వాత పూరీని కాస్త ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఆ తర్వాత మళ్లీ మాములే అనుకోండి. అదే వేరే విషయం. ఇప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్’ వచ్చిన దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత.. మళ్లీ ఈ కాంబినేషన్‌లో సినిమా రూపుదిద్దుకోబోతోంది. ఈ విషయం గత వారం, పది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది కానీ.. అధికారికంగా ఎటువంటి ప్రకటనా రాలేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ రాబోతుందంటూ ఛార్మీ కౌర్ (Charmme Kaur), పూరి కనెక్ట్స్ (Puri Connects) బ్యానర్ అధికారిక ట్విట్టర్స్ ద్వారా ఓ ప్రకటన వచ్చింది.

‘‘ఇస్మార్ట్ బ్లాక్‌బస్టర్ ఇచ్చిన కాంబో.. మళ్లీ నాలుగు సంవత్సరాల తర్వాత ఉస్తాద్ రామ్ పోతినేని, సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కలిసి సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాని నేను, పూరి జగన్నాధ్ కలిసి పూరీ కనెక్ట్స్ ద్వారా నిర్మించనున్నాం. ఏ దిమాక్ ఖరాబ్ అనౌన్స్‌మెంట్ రేపు (ఆదివారం) సాయంత్రం 4 గంటలకు రాబోతోంది.. స్టే హైప్‌డ్’’ (Charmme Kaur Tweet on Puri and Ram Film) అంటూ ఛార్మీ తన ట్వీట్‌లో తెలిపింది. ఆ అనౌన్స్‌మెంట్ సినిమా ఓపెనింగ్‌కి సంబంధించినదే అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ‘లైగర్’ (Liger)కి సంబంధించి హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ఎదుట ఎగ్జిబిటర్స్ ధర్నాకు దిగిన విషయం తెలిసిందే.

పూరీ కనెక్ట్స్‌లో సినిమా షూటింగ్ జరగాలంటే.. ముందు ‘లైగర్’ ఇష్యూస్ సెటిల్ చేయాలి.. చేస్తామన్నట్లుగా శుక్రవారం ఛార్మీ కూడా మాటిచ్చింది. ముందు ఆ సెటిల్‌మెంట్స్ అయితే తప్ప.. పూరి, రామ్‌ల ప్రాజెక్ట్‌ని ముందుకు కదలనివ్వమని అక్కడ ఎగ్జిబిటర్స్ (Exhibitors) కూడా కాచుకుని కూర్చుకున్నారు. ఈ నేపథ్యంలో పూరి కనెక్ట్స్, ఛార్మీ నుంచి వచ్చిన ఈ ప్రకటన మరింత ఇంట్రస్ట్‌ని క్రియేట్ చేస్తోంది. మరి ఆదివారం రాబోయే ప్రకటన, ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో తెలియాలంటే.. ఇంకొన్ని గంటలు వేచి చూడక తప్పదు.


ఇవి కూడా చదవండి:

************************************************

*BoyapatiRAPO: పోస్టర్ అదిరింది.. ఫస్ట్ థండర్ ఎప్పుడంటే..?

*PVT04: ‘చిత్ర’గా శ్రీలీల.. లుక్ విడుదల

*Ustaad Bhagat Singh: బాబాయ్ మూవీ గ్లింప్స్‌పై అబ్బాయ్ రియాక్షన్ ఇదే..

*Bandla Ganesh: బానిసత్వానికి భాయ్ భాయ్.. మళ్లీ రాజకీయాల్లోకి వస్తా..

*SPY: నిఖిల్ ‘స్పై’ టీజర్‌ని ఎక్కడ విడుదల చేస్తున్నారో తెలుసా?

*Ileana: బంప్ అలెర్ట్.. అంటూ ఇలియానా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ

Updated Date - 2023-05-13T18:22:06+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!