PVT04: ‘చిత్ర’గా శ్రీలీల.. లుక్ విడుదల

ABN , First Publish Date - 2023-05-13T14:44:42+05:30 IST

PVT04 సినిమాతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి (Srikanth N Reddy) దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇందులో టాలీవుడ్ క్రష్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా

PVT04: ‘చిత్ర’గా శ్రీలీల.. లుక్ విడుదల
Sreeleela Look in PVT04

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments) బ్యానర్‌లో ‘ఉప్పెన’ హీరో పంజా వైష్ణవ్ తేజ్‌ (Panja Vaisshnav Tej) ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీకర స్టూడియోస్ (Srikara Studios) సమర్పిస్తున్న ఈ చిత్రానికి ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ (Fourtune Four Cinemas) సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. నిర్మాతలు నాగ వంశీ, సాయి సౌజన్య ఎక్కడా వెనకాడకుండా.. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రేక్షకులకు థియేటర్లలో అద్భుతమైన అనుభూతిని అందించాలన్న ఉద్దేశంతో అత్యున్నత స్థాయిలో ఈ చిత్రాన్ని (PVT04) నిర్మిస్తున్నట్లుగా ఇప్పటికే నిర్మాతలు ప్రకటించి ఉన్నారు. ఈ సినిమాతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి (Srikanth N Reddy) దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇందులో టాలీవుడ్ క్రష్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా శ్రీలీల (Sreeleela) పాత్రను మేకర్స్ రివీల్ చేశారు.

ఇందులో శ్రీలీల ఉల్లాసభరితంగా, కొంటెగా ఉంటూ అందరి మనసులు దోచే ‘చిత్ర’ (Chitra) పాత్రను పోషిస్తున్నట్లుగా తెలిపారు. ఈ పాత్ర పట్ల శ్రీలీల కూడా ఎంతో సంతోషంగా ఉన్నట్లుగా ఆమె రీసెంట్‌గా తెలిపారు. ఇక ఆమె పాత్రకు సంబంధించి ఇప్పటి వరకు చిత్రీకరించిన సన్నివేశాలన్నీ అద్భుతంగా వచ్చాయని తాజాగా మేకర్స్ ప్రకటించారు. శ్రీలీల కెరియర్‌లో గుర్తిండిపోయే పాత్రగా ఇందులో చిత్ర పాత్ర ఉంటుందని వారు ప్రకటించారు (Sreeleela Look in PVT04 Out). ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా.. తాజాగా విడుదలైన శ్రీలీల ఫస్ట్ లుక్‌ (Sreeleela First look) కూడా ఆకర్షణీయంగా ఉంది.

Sreeleela.jpg

కాగా, ఈ సినిమాకి కీలకమైన పవర్ ఫుల్ పాత్రలలో జోజు జార్జ్ (Joju George), అపర్ణా దాస్ (Aparna Das) నటిస్తున్నట్లు ఇటీవల చిత్ర బృందం అధికారికంగా ప్రకటించగా.. ‘అసురన్‌, ఆడుకలం’ వంటి జాతీయ అవార్డులు గెలుచుకున్న చిత్రాలకు సంగీతం అందించిన జి.వి. ప్రకాష్‌ కుమార్‌ (GV Prakash Kumar) మరోసారి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌‌తో చేతులు కలిపారు. ఇటీవల వీరి కలయికలో వచ్చిన ‘సార్/వాతి’ చార్ట్‌బస్టర్‌‌గా నిలిచిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Ustaad Bhagat Singh: బాబాయ్ మూవీ గ్లింప్స్‌పై అబ్బాయ్ రియాక్షన్ ఇదే..

*Bandla Ganesh: బానిసత్వానికి భాయ్ భాయ్.. మళ్లీ రాజకీయాల్లోకి వస్తా..

*SPY: నిఖిల్ ‘స్పై’ టీజర్‌ని ఎక్కడ విడుదల చేస్తున్నారో తెలుసా?

*Ileana: బంప్ అలెర్ట్.. అంటూ ఇలియానా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ

*Anandhi: ‘కయల్‌’ ఆనంది డబుల్‌ ధమకా

*Liger: ఆగని వివాదం.. ధర్నాకు దిగిన బాధితులు.. ఛార్మీ సమాధానమిదే!

Updated Date - 2023-05-13T14:44:42+05:30 IST