Ustaad Bhagat Singh: బాబాయ్ మూవీ గ్లింప్స్‌పై అబ్బాయ్ రియాక్షన్ ఇదే..

ABN , First Publish Date - 2023-05-13T13:04:53+05:30 IST

ఇప్పటికే పలువురి ప్రశంసలను అందుకుంటున్న ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్‌పై తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan) తన ట్విట్టర్ వేదికగా

Ustaad Bhagat Singh: బాబాయ్ మూవీ గ్లింప్స్‌పై అబ్బాయ్ రియాక్షన్ ఇదే..
Pawan Kalyan and Ram Charan

‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ (Ustaad Bhagat Singh). మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. టాలీవుడ్ క్రష్ శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ‘గబ్బర్‌ సింగ్’ విడుదల తేదీని పురస్కరించుకుని మేకర్స్ ఈ చిత్ర గ్లింప్స్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ గ్లింప్స్ విడుదలైన కొన్ని నిమిషాలలోనే సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ యూట్యూబ్‌ని షేక్ చేసింది. పలువురి ప్రశంసలను అందుకుంటున్న ఈ గ్లింప్స్‌పై తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan) తన ట్విట్టర్ వేదికగా స్పందించారు.

‘‘ఇంతకీ రామ్ చరణ్ ఈ గ్లింప్స్‌పై ఏమని స్పందించారంటే.. (Ram Charan Reaction on Ustaad Bhagat Singh Glimpse) ‘‘పవన్ కల్యాణ్‌గారూ.. మీ సినిమా మాసీ గ్లింప్స్ చాలా బాగుంది. ఈ సినిమాని థియేటర్లలో చూసేందుకు ఎంతగానో వేచి చూస్తున్నాను. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీమ్ మొత్తానికి గుడ్ లక్.. ’’ అంటూ రామ్ చరణ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. చరణ్ చేసిన ఈ ట్వీట్‌కు మెగాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పవన్, చరణ్ కలిసి ఉన్న ఫొటోలతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు సంబంధించి ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తవగా.. ఇప్పుడు రెండో షెడ్యూల్ ప్రారంభించేందుకు అన్నీ సిద్ధం చేస్తున్నారు.

Ustaad-Bhagat-Singh.jpg

‘ఈసారి కేవలం వినోదం మాత్రమే కాదు’ అని తెలుపుతూ వచ్చిన ఈ గ్లింప్స్‌ (Ustaad Bhagat Singh Glimpse).. ‘ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో, అధర్మము వృద్ధి నొందునో, ఆయా సమయములయందు ప్రతి యుగమునా అవతారము దాల్చుచున్నాను’ అంటూ ఘంటసాల గాత్రంతో భగవద్గీతలోని శ్లోకంతో గ్లింప్స్ ప్రారంభమైంది. ‘భగత్.. భగత్ సింగ్.. మహంకాళి పోలీస్ స్టేషన్, పాతబస్తీ’ అంటూ ఖాకీ చొక్కా, గళ్ళ లుంగీ, నుదుటన తిలకంతో జీపులోనుంచి దూకుతూ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు హీరో పవన్ కళ్యాణ్. కేవలం 40 సెకన్ల వీడియోలోనే తన మ్యానరిజమ్స్, యాటిట్యూడ్, ఆవేశంతో గూజ్ బంప్స్ తెప్పించారు. ‘ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోయిద్ది’ అంటూ.. సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో ఈ చిన్న గ్లింప్స్‌లోనే క్లారిటీ ఇచ్చేశారు. ‘హుట్ సాలే’ అంటూ వింటేజ్ యాటిట్యూడ్‌తో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పలికిన తీరుకి ఫిదా కాకుండా ఉండలేరు. ఇక దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) అందించిన నేపథ్య సంగీతం గ్లింప్స్‌ని మరోస్థాయికి తీసుకెళ్లింది.


ఇవి చదవండి:

************************************************

*Bandla Ganesh: బానిసత్వానికి భాయ్ భాయ్.. మళ్లీ రాజకీయాల్లోకి వస్తా..

*SPY: నిఖిల్ ‘స్పై’ టీజర్‌ని ఎక్కడ విడుదల చేస్తున్నారో తెలుసా?

*Ileana: బంప్ అలెర్ట్.. అంటూ ఇలియానా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ

*Anandhi: ‘కయల్‌’ ఆనంది డబుల్‌ ధమకా

*Liger: ఆగని వివాదం.. ధర్నాకు దిగిన బాధితులు.. ఛార్మీ సమాధానమిదే!

Updated Date - 2023-05-13T13:04:53+05:30 IST