Hi Nanna: ‘హాయ్ నాన్న’ మ్యూజికల్ ఫెస్ట్ మొదలవ్వబోతోంది.. మ్యూజిక్ ఎవరో తెలుసుగా..

ABN , First Publish Date - 2023-09-02T21:50:58+05:30 IST

నేచురల్ స్టార్ నాని హీరోగా.. నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘హాయ్ నాన్న’. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం కూనూర్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.

Hi Nanna: ‘హాయ్ నాన్న’ మ్యూజికల్ ఫెస్ట్ మొదలవ్వబోతోంది.. మ్యూజిక్ ఎవరో తెలుసుగా..
Hi Nanna Movie Still

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) హీరోగా.. నూతన దర్శకుడు శౌర్యువ్ (Shouryuv) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘హాయ్ నాన్న’. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ‘సీతా రామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్‌గా నటిస్తోంది. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో నాని కూతురుగా బేబీ కియారా ఖన్నా కనిపించనుంది. తాజాగా ఈ చిత్ర కొత్త షూటింగ్ షెడ్యూల్ కూనూర్ (Coonoor) పచ్చని అందాలలో ప్రారంభమైనట్లుగా మేకర్స్ తెలియజేశారు.


హీరో నాని కూడా లొకేషన్ నుండి ‘హాయ్’ చెబుతూ ఎక్సోటిక్ లొకేషన్‌ను ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ‘హాయ్ నాన్న’ మ్యూజికల్ ఫెస్ట్ కోసం సిద్ధంగా ఉండండి. త్వరలోనే ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభం కానున్నట్లుగా కూడా మేకర్స్ ప్రకటించారు. అన్నట్లు ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసుగా.. హేషమ్ అబ్దుల్ వహాబ్. ‘ఖుషి’ (Kushi) మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసి హిట్టందుకున్న హేషమ్ అబ్దుల్ వహాబ్ (Hesham Abdul Wahab).. మరోసారి తన ప్రతిభను చూపేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఫస్ట్ సింగిల్‌ను వదిలేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Natural-Star.jpg

‘హాయ్ నాన్న’ (Hi Nanna) సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్‌, గ్లింప్స్‌ చాలా మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. గ్లింప్స్ నేషనల్ వైడ్‌గా మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. సినిమాపై మేకర్స్ కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అందుకే పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా డిసెంబర్ 21న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఇవి కూడా చదవండి:

============================

*RS Shivaji: ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ నటుడు ‘మాలోకం’ ఇక లేరు

************************************

*Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రీట్ కూడా వచ్చేసింది.. ఇక్కడా కత్తే..

*************************************

*Kushi: తొలిరోజు బాక్సాఫీస్ కొల్లగొట్టిన ‘ఖుషి’.. ఎన్ని కోట్లు రాబట్టిందంటే..

************************************

*Hari Hara Veera Mallu: పవర్‌ఫుల్ పోస్టర్‌తో ఫ్యాన్స్‌కి ట్రీట్..

*************************************

*Thrigun: పెళ్లిపీటలు ఎక్కుతోన్న మరో టాలీవుడ్ యంగ్ హీరో..

*************************************

*Pawan Kalyan: ఈ రోజుల్లో ఎవడున్నాడ్రా.. ఇలాంటోడు!

*************************************

Updated Date - 2023-09-02T21:50:58+05:30 IST