Charan Sai: వరుస అవకాశాలతో దూసుకెళుతోన్న రవిబాబు హీరో

ABN , First Publish Date - 2023-04-29T22:26:39+05:30 IST

మల్టీ టాలెంటెడ్ యాక్టర్ రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘క్రష్’ (Crush) చిత్రంతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన యంగ్ హీరో.. ఇప్పుడు వరుస అవకాశాలతో దూసుకెళుతున్నాడు.

Charan Sai: వరుస అవకాశాలతో దూసుకెళుతోన్న రవిబాబు హీరో

మల్టీ టాలెంటెడ్ యాక్టర్ రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘క్రష్’ (Crush) చిత్రంతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన చరణ్ సాయి (Charan Sai).. ఇప్పుడు తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. తొలి చిత్రంతో మంచి గుర్తింపుని పొందిన చరణ్ సాయికి.. ఆ సినిమా షూట్‌లో ఉండగానే... ‘వాలెంటైన్స్ నైట్’ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ద్వితీయ విఘ్నం ముగించుకుని ముచ్చటగా మూడో చిత్రం ‘అన్ ఎక్స్‌పెక్ట్‌డ్’ (Unexpected) లోనూ నటించి మెప్పించాడు. ప్రస్తుతం అతను ‘ఐ.ఓ.జి’ అనే నెక్ట్స్ జనరేషన్ చిత్రంలో నటిస్తున్నాడు.

Sai.jpg

పవన్ కల్యాణ్, ప్రభాస్ వంటి స్టార్స్‌ను సానబెట్టిన వైజాగ్ సత్యానంద్ (Satyanand) శిష్యుడైన చరణ్ సాయి.. తెలుగులోనే కాకుండా తమిళ స్టార్ మేకర్ సారథ్యంలో రూపొందుతున్న ‘ఇరుళి’ అనే తమిళ చిత్రంలోనూ నటిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇప్పటికే తనదైన డ్యాన్స్‌లు, ఫైట్స్‌తో ఇండస్ట్రీ నుండి ‘కత్తిలాంటి కొత్త కుర్రాడు’ అనిపించుకున్న చరణ్.. మంచి కథాబలం ఉన్న సినిమా కోసం వేచి చూస్తున్నట్లుగా తెలిపాడు. నిడివితో నిమిత్తం లేకుండా.. తనదైన ముద్ర వేయడానికి వీలు కల్పించే పాత్రలు చిన్నవైనా చేయడానికి సైతం తాను సిద్ధమేనని ఈ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Director Teja: బాలీవుడ్ సినిమాని చంపింది.. టాలీవుడ్ సినిమాని చంపబోతోందీ అదే!

*Nani 30: ‘నాని 30’లో చిరు, బాలయ్య సినిమాల్లో చేసిన హీరోయిన్

*Bichagadu 2 Trailer Talk: మరో బ్లాక్‌బస్టర్.. ఆన్ ద వే!

*Ravanasura: రవితేజ.. చెప్పా పెట్టకుండా వచ్చేశాడేంటి?

*Trisha: అసలు ‘పొన్నియిన్ సెల్వన్’లో త్రిష ఏ రోల్ కోరిందో తెలుసా..?

*RRR Side Dancer: ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో సైడ్ డ్యాన్సర్‌గా చేసిన వ్యక్తి అరెస్ట్.. ఎందుకంటే?

Updated Date - 2023-04-29T22:26:39+05:30 IST