Yendira Ee Panchayithi: అంతా సిద్ధం.. ఇక పంచాయితీనే..

ABN , First Publish Date - 2023-09-27T19:35:40+05:30 IST

ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం నిర్మిస్తోన్న చిత్రం ‘ఏందిరా ఈ పంచాయితీ’. ఈ చిత్రంతో గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. భరత్, విషికా లక్ష్మణ్‌లు హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. అక్టోబర్ 6న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లుగా దర్శకనిర్మాతలు తెలిపారు.

Yendira Ee Panchayithi: అంతా సిద్ధం.. ఇక పంచాయితీనే..
Yendira Ee Panchayithi Movie Still

గ్రామీణ నేపథ్యంలో, సహజత్వమైన కథలతో రూపుదిద్దుకుంటున్న సినిమాలకు ఈ మధ్య ప్రేక్షకాదరణ ఎక్కువగా ఉంటోంది. అలాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్స్‌గా నిలుస్తున్నాయి. ఇప్పుడిదే నేపధ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ఏందిరా ఈ పంచాయితీ’ (Yendira Ee Panchayithi). ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తీసిన అందమైన ప్రేమ కథా చిత్రం‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం (Pradeep Kumar. M) ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో గంగాధర.టి (Gangadhara. T) దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. భరత్, విషికా లక్ష్మణ్‌లు హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టైటిల్ లోగో, గ్లింప్స్, పాటలు మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా ఈ సినిమా విడుదలకు అంతా ముస్తాబైనట్లుగా మేకర్స్ తెలియజేశారు. అక్టోబర్ 6న ఈ చిత్రాన్ని గ్రాండ్‌‌గా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ తెలిపారు. (Yendira Ee Panchayithi Release Date)


Yendira Ee Panchayithi 2.jpg

ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. రీసెంట్‌గా విడుదలైన టీజర్, అలాగే సింగర్ సునీత‌గారు పాడిన పాటకు మంచి స్పందన వచ్చింది. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ మీద వచ్చిన ఆ పాట అందరినీ మెప్పించింది. ఇప్పటికే సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు సతీష్ మాసం కెమెరా, పీఆర్ (పెద్దపల్లి రోహిత్) సంగీతం, జేపీ ఎడిటింగ్ అన్ని చక్కగా కుదిరాయి. అక్టోబర్ 6న భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. అంతా థియేటర్లలో ఈ సినిమా చూసి ఆశీర్వదించాలని కోరారు.


ఇవి కూడా చదవండి:

============================

*Bhagavanth Kesari: బాలయ్య ‘భగవంత్ కేసరి’ నుంచి స్పెషల్ సర్‌ప్రైజ్.. ఎప్పుడంటే?

**********************************

*Vishal: అదోరకం సనాతన ధర్మం.. విశాల్‌ వ్యాఖ్యలకు నిర్మాత కౌంటర్‌

**********************************

*Tiger Nageswara Rao: టైగర్ కా హుకుమ్.. ట్రైలర్ రిలీజ్‌కు డేట్ ఫిక్సయింది

***********************************

*Skanda: అడుగడుగునా బోయపాటి మార్క్.. చూసుకుందాం.. బరాబర్ చూసుకుందాం

***************************************

*Hebah Patel: హెబ్బా నటించిన మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ డైరెక్ట్‌గా ఓటీటీలోకే.. ఎప్పుడు, ఎక్కడంటే?

****************************************

Updated Date - 2023-09-27T19:35:40+05:30 IST