Ranbir Kapoor: అలాంటి పాత్ర చేయాలనుంది.. అల్లు అర్జున్‌పై బాలీవుడ్ నటుడి ప్రశంసలు

ABN , First Publish Date - 2023-02-27T14:40:53+05:30 IST

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌కి దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ సినిమాతో ఈ స్టైలిష్ స్టార్ పాపులారిటీ ఖండాతరాలు సైతం దాటింది.

Ranbir Kapoor: అలాంటి పాత్ర చేయాలనుంది.. అల్లు అర్జున్‌పై బాలీవుడ్ నటుడి ప్రశంసలు
Allu Arjun

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌ (Allu Arjun)కి దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ (Pushpa) సినిమాతో ఈ స్టైలిష్ స్టార్ పాపులారిటీ ఖండాతరాలు సైతం దాటింది. ఆ సినిమాలో బన్నీ నటన చూసి ప్రేక్షకులతో పాటు ఎంతోమంది సినీ ప్రముఖులు ఫిదా అయిపోయారు. అందులో బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) కూడా ఒకరు. ఈ విషయాన్ని తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఈ రణ్‌బీర్‌యే స్వయంగా చెప్పుకొచ్చాడు.

గతేడాది ‘బ్రహ్మాస్త్ర’ వంటి సూపర్ హిట్ ‌కొట్టిన రణ్‌బీర్ తాజాగా నటించిన చిత్రం ‘తూ ఝూటీ మైన్ మక్కార్‌’ (Tu Jhoothi Main Makkaar) అనే చిత్రంలో నటించాడు. ఈ రొమాంటిక్ మూవీలో ‘సాహో’ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా హోలీ సందర్భంగా మార్చి 8న విడుదల కానుంది. దీంతో ఈ చిత్ర ప్రమోషన్స్‌లో చిత్రబృందం బీజీగా ఉంది. ఈ తరుణంలో జరిగిన ఓ కార్యక్రమంలో ‘పుష్ప’లోని అల్లు అర్జున్ క్యారెక్టర్‌పై రణ్‌బీర్ ప్రశంసలు కురిపించాడు.

ఇది కూడా చదవండి: Nawazuddin Siddiqui House Help: ‘తిండి లేక అవస్థలు పడుతున్నా.. తనను రక్షించమంటూ..’

రణ్‌బీర్ మాట్లాడుతూ.. ‘‘గత రెండేళ్లుగా 3 చిత్రాలు నాలోని నటుడిని చాలా ప్రభావితం చేశాయి. అల్లు అర్జున్ ‘పుష్ప’, ఆలియా భట్ ‘గంగూబాయి’, రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ ‘RRR’ ఉన్నాయన్నారు. ఆ చిత్రాల్లోని వారి నటన చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. ముఖ్యంగా, ‘పుష్ప’లో అల్లు అర్జున్ చేసిన పాత్రలో నటించాలనే ఆలోచనైతే కొంచెం ఎక్కువే ఉంది’ అని చెప్పుకొచ్చాడు.

Updated Date - 2023-02-27T14:59:57+05:30 IST