Sharathulu Varthisthayi: ఈ సినిమా గురించి త్రివిక్రమ్ ఏమన్నారంటే..? ‘షరతులు వర్తిస్తాయి’!

ABN , First Publish Date - 2023-10-21T15:08:48+05:30 IST

మనుషులు ఉన్నంత కాలం కుటుంబాలు ఉంటాయి.. అలాగే కుటుంబాలు ఉన్నంతకాలం సమస్యలు ఉంటాయి. అందుకే చాలా కుటుంబాలు కొన్ని షరతుల మధ్యన జీవిస్తూ ఆనందంగా ఉంటున్నాయని అన్నారు మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్‌పై కుమార స్వామి (అక్షర) దర్శకత్వంలో తెరకెక్కిన ‘షరతులు వర్తిస్తాయి’ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ని తాజాగా ఆయన ఆవిష్కరించారు.

Sharathulu Varthisthayi: ఈ సినిమా గురించి త్రివిక్రమ్ ఏమన్నారంటే..? ‘షరతులు వర్తిస్తాయి’!

మనుషులు ఉన్నంత కాలం కుటుంబాలు ఉంటాయి.. అలాగే కుటుంబాలు ఉన్నంతకాలం సమస్యలు ఉంటాయి. అందుకే చాలా కుటుంబాలు కొన్ని షరతుల మధ్యన జీవిస్తూ ఆనందంగా ఉంటున్నాయని అన్నారు మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas). స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున్ సామల, శ్రీష్ కుమార్ గుండా, డా. కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మాణంలో కుమార స్వామి (అక్షర) దర్శకత్వంలో.. చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’ (Sharathulu Varthisthayi). ఈ చిత్ర ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్‌ను తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు.

ఆవిష్కరణ అనంతరం త్రివిక్రమ్ మాట్లాడుతూ... మనుషులు ఉన్నంత కాలం కుటుంబాలు ఉంటాయి.. కుటుంబాలు ఉన్నంతకాలం సమస్యలు ఉంటాయి. అందుకే చాలా కుటుంబాలు కొన్ని షరతుల మధ్యన జీవిస్తూ ఆనందంగా ఉంటున్నాయి. ‘షరతులు వర్తిస్తాయి’ సినిమా కుటుంబ విలువలకు సంబంధించినది. ఈ ప్రాంతం మట్టి నుంచి వచ్చిన కథ. ఇది మన కుటుంబ సంస్కృతికి సంబంధించి విలువలతో నిండి ఉన్న సినిమా. ఇటువంటి మంచి సినిమాలను ప్రేక్షకులు థియేటర్లలో చూసి ప్రోత్సహించాలి. ప్రేక్షకులకు ఓ మంచి కథను చెప్పబోతున్న దర్శకుడు కుమార స్వామి (అక్షర)కి, అలాగే చిత్ర యూనిట్ సభ్యులకు నా అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. (Sharathulu Varthisthayi First Look Launch)


Trivikram.jpg

తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ (Mamidi Harikrishna) మాట్లాడుతూ... దేశంలో ఉన్న 80 శాతం మంది జీవితాలకు ఈ సినిమా అద్దం పడుతుంది. ప్రస్తుతం మధ్య తరగతి కుటుంబాలలో ఉంటున్న సమస్యను దర్శకుడు కళ్ళకు కట్టినట్టు చిత్రీకరించారని తెలుపగా.. చిత్ర హీరో చైతన్య రావు మాట్లాడుతూ.. మా సినిమా ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్‌ను నాకు ఎంతో ఇష్టమైన దర్శకుడు త్రివిక్రమ్ ఆవిష్కరించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంత బిజీలో కూడా మాకు సమయం కేటాయించి మమ్ములను ఎంకరేజ్ చేసిన త్రివిక్రమ్‌గారికి, హరికృష్ణ సార్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని వెల్లడించారు. చిత్ర దర్శకుడు కుమార స్వామి (Kumara Swamy) (అక్షర) మాట్లాడుతూ... ఒక మంచి ఉద్దేశంతో తీసిన సినిమా ఇది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్‌ని త్రివిక్రమ్‌గారి ఆవిష్కరించాలనేది నా కల. ఈ సందర్భంగా డా మామిడి హరికృష్ణగారికి, గురూజీ త్రివిక్రమ్‌గారికి మా యూనిట్ తరపున ధన్యవాదాలు తెలియస్తున్నానని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

============================

*Vishal: విశాల్‌ ఎఫెక్ట్‌.. ఆ చిత్రాల సెన్సార్‌ నిబంధనలలో మార్పు!

************************************

*Anil Ravipudi: ‘భగవంత్ కేసరి’.. ఇది ఆరంభం మాత్రమే! ముందుండాది..

******************************************

*Dude: ఫుట్ బాల్ నేపథ్యంలో ‘డ్యూడ్’.. షూట్ మొదలయ్యేది ఎప్పుడంటే?

***************************************

*Baby Combo Repeats: మళ్లీ కల్ట్ బ్లాక్‌బస్టర్ కాంబో.. కాకపోతే?

*******************************************

*Vijayashanti: మరో సినిమాకు సైన్ చేసిన రాములమ్మ.. ఈసారి ఏ హీరో సినిమా అంటే?

************************************

Updated Date - 2023-10-21T16:22:20+05:30 IST