Baby Combo Repeats: మళ్లీ కల్ట్ బ్లాక్‌బస్టర్ కాంబో.. కాకపోతే?

ABN , First Publish Date - 2023-10-20T18:59:17+05:30 IST

ఈ ఇయర్ టాలీవుడ్ కల్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సినిమా ‘బేబి’. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా.. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుని ఘన విజయం సాధించింది. ఇప్పుడీ బ్లాక్‌బస్టర్ కాంబో (ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య) మళ్లీ రిపీట్ కాబోతోంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా చేయనున్న సినిమాను అధికారికంగా ప్రకటించారు.

Baby Combo Repeats: మళ్లీ కల్ట్ బ్లాక్‌బస్టర్ కాంబో.. కాకపోతే?
Anand Deverakonda and Vaishnavi Chaitanya

ఈ ఇయర్ టాలీవుడ్ కల్ట్ బ్లాక్‌బస్టర్‌ (Cult blockbuster)గా నిలిచిన సినిమా ‘బేబి’ (Baby). ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా.. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుని ఘన విజయం సాధించింది. ఇప్పుడీ బ్లాక్‌బస్టర్ కాంబో (ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య) మళ్లీ రిపీట్ కాబోతోంది. ‘బేబి’తో 100 కోట్ల గ్రాసింగ్ ప్రొడక్షన్ హౌస్‌గా మారిన మాస్ మూవీ మేకర్స్ (Mass Movie Makers), ‘కలర్ ఫొటో’తో నేషనల్ అవార్డ్ గెల్చుకున్న అమృతా ప్రొడక్షన్స్ (Amrutha Productions) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను తెలియజేస్తూ మేకర్స్ ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

ఈ పోస్టర్‌లో సముద్రం ఒడ్డున వైష్ణవి చైతన్య పడవపై కూర్చుని బాధపడుతుండగా.. ఆనంద్ దేవరకొండ తనని చేతులలోకి తీసుకుని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. పోస్టర్ చూస్తుంటే ఇది కూడా ఓ మంచి క్లాసిక్ లవ్ స్టోరీ అనేది అర్థమవుతోంది. ‘బేబి’ సినిమాను యూత్ ఫుల్ ఎమోషనల్ ఎంటర్ టైనర్‌గా రూపొందించి మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) నుంచి సాధారణ ప్రేక్షకుల వరకు అందరి ప్రశంసలు అందుకున్న దర్శకుడు సాయి రాజేశ్ (Sai Rajesh) ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్‌కేఎన్‌ (SKN)తో కలిసి సాయి రాజేష్ ప్రొడ్యూసర్ గానూ వ్యవహరిస్తున్నారు. నూతన దర్శకుడు రవి నంబూరి (Ravi Namboorii) ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.


Anand-Baby.jpg

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. వచ్చే సమ్మర్‌లో థియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ‘బేబి’ (Baby) సినిమాకు కథ, స్ర్కీన్‌ప్లేతో పాటు దర్శకత్వ ప్రతిభ కూడా ఘన విజయానికి కారణమైంది. ఇప్పుడు ప్రకటించిన సినిమాకు సాయి రాజేష్ దర్శకత్వంలో వహించడం లేదు కానీ.. మిగతా అన్నీ విషయాలలోనూ ఆయన హ్యాండ్ ఉండనుంది కాబట్టి మరో మంచి సినిమాను ఈ కాంబినేషన్‌లో ఊహించవచ్చు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు.


ఇవి కూడా చదవండి:

============================

*Vijayashanti: మరో సినిమాకు సైన్ చేసిన రాములమ్మ.. ఈసారి ఏ హీరో సినిమా అంటే?

************************************

*Bhagavanth Kesari: ఫస్ట్ డే కలెక్షన్ల ఊచకోత.. ఇది బాలయ్య సౌండ్.. ఎట్లుంది?

**********************************

*Varun Tej: ‘ఆపరేషన్ వాలెంటైన్’ షూటింగ్ అయిపోయింది..

************************************

*Pindam: హీరో శ్రీ విష్ణు వదిలిన ‘పిండం’ ఫస్ట్ లుక్ పోస్టర్.. థ్రిల్లింగ్!

************************************

*Bramayugam: మమ్ముట్టి స్పీడ్‌ చూస్తుంటే ‘భ్రమ’లు తొలగిపోతున్నాయ్..

***********************************

Updated Date - 2023-10-20T18:59:17+05:30 IST