Dude: ఫుట్ బాల్ నేపథ్యంలో ‘డ్యూడ్’.. షూట్ మొదలయ్యేది ఎప్పుడంటే?

ABN , First Publish Date - 2023-10-20T20:38:17+05:30 IST

యంగ్ హీరో తేజ్ నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘డ్యూడ్’. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్‌లో సెట్స్‌కు వెళ్లనుంది. తెలుగు - కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని పనరోమిక్ స్టూడియోస్ పతాకంపై హీరో తేజ్ నిర్మిస్తుండడమే కాకుండా.. స్వయంగా కథను అందించి, దర్శకత్వం కూడా చేస్తున్నారు.

Dude: ఫుట్ బాల్ నేపథ్యంలో ‘డ్యూడ్’.. షూట్ మొదలయ్యేది ఎప్పుడంటే?
Hero Tej

యంగ్ హీరో, కన్నడ అల్టిమేట్ స్టార్ తేజ్ (Tej) నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘డ్యూడ్’ (Dude). ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్‌లో సెట్స్‌కు వెళ్లనుంది. తెలుగు - కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని పనరోమిక్ స్టూడియోస్ పతాకంపై హీరో తేజ్ నిర్మిస్తుండడమే కాకుండా.. స్వయంగా కథను అందించి, దర్శకత్వం వహిస్తుండడం విశేషం. తేజ్ ఇంతకుముందు ‘రామాచారి’ (Ramachari) అనే కన్నడ హిట్ చిత్రంలో నటించారు. ఆయన నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘గాడ్’ (God) కూడా త్వరలోనే మొదలు కానుంది.

‘డ్యూడ్’ విషయానికి వస్తే.. ఇప్పటివరకు కొన్ని వేల ప్రేమ కథా చిత్రాలు వచ్చాయి. కానీ పూర్తి ఫుట్ బాల్ నేపథ్యంలో ఇప్పటివరకు తెలుగు, కన్నడ భాషల్లో సినిమా రాలేదు. అందువల్లే... కర్ణాటకలోని కిక్ స్టార్ట్ అనే సుప్రసిద్ధ ఫుట్ బాల్ క్లబ్.. ‘డ్యూడ్’ చిత్రానికి పూర్తి సహాయసహకారాలు అందిస్తోందని.. హృద్యమైన ప్రేమకథ ఇందులో ఉంటుందని, ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యే అంశాలతో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లుగా తేజ్ చెప్పుకొచ్చారు. (Dude Movie Update)


Dasam.jpg

డిసెంబర్‌లో సెట్స్‌కు వెళ్లనున్న ఈ చిత్రానికి కన్నడ - మలయాళ భాషల్లో సుపరిచితుడైన ఇమిల్ మొహమ్మద్ సంగీతం సమకూర్చుతుండగా.. నాని కెరీర్‌కి తిరుగులేని పునాది వేసిన ‘అలా మొదలైంది’ చిత్ర సినిమాటోగ్రాఫర్ ప్రేమ్ కెమెరా బాధ్యతలు నిర్వహించనున్నారు. రాఘవేంద్ర రాజ్ కుమార్, రంగాయన రఘు, విజయ్ చందూర్, సందీప్ మలని వంటి వారు ఇతర ముఖ్య పాత్రల్లో నటించనున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Baby Combo Repeats: మళ్లీ కల్ట్ బ్లాక్‌బస్టర్ కాంబో.. కాకపోతే?

*******************************************

*Vijayashanti: మరో సినిమాకు సైన్ చేసిన రాములమ్మ.. ఈసారి ఏ హీరో సినిమా అంటే?

************************************

*Bhagavanth Kesari: ఫస్ట్ డే కలెక్షన్ల ఊచకోత.. ఇది బాలయ్య సౌండ్.. ఎట్లుంది?

**********************************

*Varun Tej: ‘ఆపరేషన్ వాలెంటైన్’ షూటింగ్ అయిపోయింది..

************************************

Updated Date - 2023-10-20T20:38:17+05:30 IST