Vijayashanti: మరో సినిమాకు సైన్ చేసిన రాములమ్మ.. ఈసారి ఏ హీరో సినిమా అంటే?

ABN , First Publish Date - 2023-10-20T18:26:04+05:30 IST

ఆ మధ్య సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా మళ్లీ ఇన్నాళ్లకు ఆమె ఓ చిత్రంలో నటించేందుకు సైన్ చేశారు. నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ఆమె ఓ కీలక పాత్రలో నటించనున్నారు.

Vijayashanti: మరో సినిమాకు సైన్ చేసిన రాములమ్మ.. ఈసారి ఏ హీరో సినిమా అంటే?
Vijayashanti

ఆ మధ్య సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ (Sarileru Neekevvaru) సినిమాతో లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్స్‌లో సైతం పాల్గొన్న రాములమ్మ.. తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటే తప్ప.. మళ్లీ సినిమాలు చేయనని చెప్పింది. ప్రస్తుతం రాజకీయాలు, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతోనే ఉన్నట్లుగా విజయశాంతి (Vijayashanti) చెప్పుకొచ్చారు. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత ఆమె వద్దకు చాలా స్ర్కిప్ట్‌లు వెళ్లినా.. సున్నితంగానే ఆమె తిరస్కరించినట్లుగా వార్తలు కూడా వచ్చాయి. దీంతో ఆమె మళ్లీ సినిమా చేయడం కష్టమే అని అంతా అనుకున్నారు. కానీ ఆమె ఇప్పుడు మరో సినిమాకు సైన్ చేశారు. ఏ సినిమా? హీరో ఎవరు? అనే డిటైల్స్‌లోకి వస్తే..

Ramulamma-1.jpg

నందమూరి కల్యాణ్‌ రామ్‌ (Nandamuri Kalayam Ram) హీరోగా ప్రదీప్‌ చిలుకూరి (Pradeep Chilukuri) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూజా కార్యక్రమాలను శుక్రవారం మేకర్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాములమ్మ కూడా హాజరైంది. ఈ పూజా కార్యక్రమాల వివరాలను తెలుపుతూ మేకర్స్ విడుదల చేసిన ఫొటోలలో ఆమె కూడా దర్శనమివ్వడంతో.. ఈ సినిమాలో రాములమ్మ (Ramulamma) ఓ కీలక పాత్రలో నటించేందుకు ఓకే చెప్పినట్లుగానూ, ఆమె పాత్రకు ఈ సినిమాలో చాలా ప్రాముఖ్యత ఉందనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి. లేడీ అమితాబ్ (Lady Amitabh Vijayashanthi) ఈ సినిమాలో చేస్తుందనే వార్తలతో.. ఓపెనింగ్‌తోనే ఈ సినిమాపై భారీగా అంచనాలు మొదలయ్యాయి.

Clap.jpg


NKR21.jpg

నందమూరి కల్యాణ్‌ రామ్ 21వ చిత్రం (NKR21)గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అశోక క్రియేష‌న్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నారు. కల్యాణ్ రామ్ సరసన సయి మంజ్రేకర్ (Saiee Manjrekar) హీరోయిన్‌గా నటించనుంది. శుక్రవారం జరిగిన పూజా కార్యక్రమాల్లో ముహూర్త‌పు స‌న్నివేశానికి విజ‌య‌శాంతి క్లాప్ కొట్ట‌గా.. ముర‌ళీ మోహ‌న్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ముప్పా వెంక‌య్య చౌద‌రి స్క్రిప్ట్ అందించారు. ఈ చిత్రానికి ప్ర‌దీప్ చిలుకూరి ప‌వ‌ర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేయటంతో పాటు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ముప్పా వెంక‌య్య స‌మ‌ర్ప‌ణ‌లో అశోక్ వ‌ర్ధ‌న్ ముప్పా, సునీల్ బ‌లుసు నిర్మిస్తుండగా.. సి.రామ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ, బి.అజ‌నీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ బాధ్యతలను నిర్వహించనున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Bhagavanth Kesari: ఫస్ట్ డే కలెక్షన్ల ఊచకోత.. ఇది బాలయ్య సౌండ్.. ఎట్లుంది?

**********************************

*Varun Tej: ‘ఆపరేషన్ వాలెంటైన్’ షూటింగ్ అయిపోయింది..

************************************

*Pindam: హీరో శ్రీ విష్ణు వదిలిన ‘పిండం’ ఫస్ట్ లుక్ పోస్టర్.. థ్రిల్లింగ్!

************************************

*Bramayugam: మమ్ముట్టి స్పీడ్‌ చూస్తుంటే ‘భ్రమ’లు తొలగిపోతున్నాయ్..

***********************************

*Japan: అమ్మాయిలు, గోల్డ్‌తో ఫుల్ టైమ్ ఎంజాయ్ చేసే మాస్ ఐటెం రాజా!

*********************************

Updated Date - 2023-10-20T18:27:05+05:30 IST