Anil Ravipudi: ‘భగవంత్ కేసరి’.. ఇది ఆరంభం మాత్రమే! ముందుండాది..

ABN , First Publish Date - 2023-10-20T21:14:40+05:30 IST

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘భగవంత్ కేసరి’ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్‌తో, హౌస్‌ఫుల్ అండ్ రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న నేపధ్యంలో చిత్ర‌యూనిట్ శుక్రవారం బ్లాక్‌బస్టర్ ప్రెస్ మీట్‌ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అనిల్ రావిపూడి అందరికీ థ్యాంక్స్ చెప్పారు.

Anil Ravipudi: ‘భగవంత్ కేసరి’.. ఇది ఆరంభం మాత్రమే! ముందుండాది..
Director Anil Ravipudi

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో వచ్చిన ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) హీరోయిన్‌గా.. శ్రీలీల (Sreeleela) కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం షైన్ స్క్రీన్స్ బ్యానర్‌‌పై రూపొంది.. దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విడుదలైన అన్ని చోట్ల అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, అభిమానులు, ప్రేక్షకులు, విమర్శకులందరి ప్రశంసలు అందుకొని అఖండ విజయం దిశగా దూసుకెళుతోంది. ఈ సినిమా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న నేపధ్యంలో చిత్ర‌యూనిట్ శుక్రవారం బ్లాక్‌బస్టర్ ప్రెస్ మీట్‌ (Block Buster Press Meet)ని నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో దర్శకుడు అనిల్ రావిపూడి (Director Anil Ravipudi) మాట్లాడుతూ.. ‘భగవంత్ కేసరి’ ప్రమోషన్స్ మొదలుపెట్టినప్పటి నుంచి ఒకే మాట చెప్పాం. ‘ఈ సినిమా శానా యేండ్లు యాదుంటాది’ అని. అది ఈ రోజు నిజం చేశారు. చాలా సంతోషంగా వుంది. ఒక దర్శకుడిగా ‘భగవంత్ కేసరి’ సంపూర్ణమైన తృప్తిని ఇచ్చింది. అన్ని వైపుల నుంచి చాలా అద్భుతమైన స్పందన వస్తోంది. సినిమాలో చూపించిన హ్యూమన్ ఎమోషన్స్, తండ్రి బిడ్డ మధ్య అనుబంధానికి ప్రేక్షకులు చాలా బాగా కనెక్ట్ అయ్యారు. ఆడపిల్లని సింహంలా పెంచాలనే ఒక మంచి కంటెంట్ జనాల్లోకి వెళ్ళింది. బాలకృష్ణ‌గారు తన కంఫర్ట్ జోన్‌ని దాటి స్త్రీ సాధికారత గురించి వున్న ఈ కథని చేసినందుకు నిజంగా ఆయనకి హ్యాట్సాఫ్. ఆయన నటన గురించి అందరూ చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. ఈ సినిమాతో ఆయన హీరోగా మరింత ఎత్తుకు ఎదిగారు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన బాలకృష్ణ‌గారికి ధన్యవాదులు. శ్రీలీల విజ్జి పాపగా అద్భుతంగా నటించింది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకొని ఎక్స్‌ట్రార్డినరీ‌గా చేసింది. ఆ ఎపిసోడ్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. సినిమాని చాలా గొప్పగా ఆదరించారు. ఇది ఆరంభం మాత్రమే. దసరా మరో పది రోజులు వుంది. క్లీన్ రన్ దొరుకుతుంది. ముందుముందు ఇంకా మాట్లాడుకుందాం. ఇంత గొప్పగా ఆదరించి, ఇంత పెద్ద ఘనవిజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. త్వరలోనే బాలకృష్ణగారితో కలిసి మరో పెద్ద ఈవెంట్‌ని నిర్వహించబోతున్నాం. భగవంత్ కేసరి వేడుకలు జరుగుతూనే వుంటాయని అన్నారు.


Anil-Ravipudi.jpg

అక్కడక్కడా కొన్ని నెగిటివ్ రివ్యూలు, నెగిటివ్ రాతలు వినిపిస్తున్నాయిగా అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. నేను రివ్యూలను పెద్దగా చూడను, పట్టించుకోను. ఎందుకంటే సినిమా సక్సెస్‌కు వర్డ్‌ ఆఫ్‌ మౌత్‌ అన్నిటికంటే పెద్దది. ప్రేక్షకులు సినిమా గురించి మాట్లాడుకునే మాటే ఒక సినిమా భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ సినిమాలోని సెన్సిటివ్ అంశాన్ని తెలియజేస్తూ.. చాలా మంది పాజిటివ్‌గానే రివ్యూలు ఇచ్చారు. ఇందులో శ్రీలీల గ్లామర్‌, డ్యాన్సులు మిస్‌ అయ్యాయని రివ్యూలు రాసిన వాళ్లు ఆమెకు అభిమానులై ఉంటారు. ఒక ఫోబియాతో బాధపడే అమ్మాయిని సివంగిలా మార్చాలనుకునే తండ్రి కథలోనూ డ్యాన్సులు, గ్లామర్ చూడాలనుకున్నారంటే వారి మానసిక పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చంటూ అనిల్ రావిపూడి అలాంటి రాతలు రాసిన వారిపై సెటైర్ వేశారు.


ఇవి కూడా చదవండి:

============================

*Dude: ఫుట్ బాల్ నేపథ్యంలో ‘డ్యూడ్’.. షూట్ మొదలయ్యేది ఎప్పుడంటే?

***************************************

*Baby Combo Repeats: మళ్లీ కల్ట్ బ్లాక్‌బస్టర్ కాంబో.. కాకపోతే?

*******************************************

*Vijayashanti: మరో సినిమాకు సైన్ చేసిన రాములమ్మ.. ఈసారి ఏ హీరో సినిమా అంటే?

************************************

*Bhagavanth Kesari: ఫస్ట్ డే కలెక్షన్ల ఊచకోత.. ఇది బాలయ్య సౌండ్.. ఎట్లుంది?

**********************************

Updated Date - 2023-10-20T21:24:34+05:30 IST