The Soul Of Satya: సాయిధరమ్ తేజ్, స్వాతి.. జీవించేశారు

ABN , First Publish Date - 2023-08-15T20:12:43+05:30 IST

సుప్రీమ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ త‌న స్నేహితుల‌తో క‌లిసి ‘సోల్ ఆఫ్ స‌త్య’ పేరుతో ఓ స్పెష‌ల్ వీడియోను రూపొందించారు. దేశం కోసం పోరాటం చేసే అజ్ఞాత యోధులకు సంబంధించిన వీడియో ఇది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ స్పెషల్‌ వీడియోను మంగళవారం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.

The Soul Of Satya: సాయిధరమ్ తేజ్, స్వాతి.. జీవించేశారు
The Soul Of Satya Still

సుప్రీమ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ (Sai Dharam Tej) త‌న స్నేహితుల‌తో క‌లిసి ఓ స్పెష‌ల్ వీడియోను రూపొందించారు. దేశం కోసం పోరాటం చేసే అజ్ఞాత యోధులకు సంబంధించిన వీడియో ఇది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ స్పెషల్‌ వీడియోను మంగళవారం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ స్పెష‌ల్ వీడియోలో సాయిధ‌ర‌మ్ తేజ్‌తో క‌లిసి స్వాతి (Swathi Reddy) న‌టించింది. ‘సోల్ ఆఫ్ స‌త్య’ పేరుతో విడుదలైన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.


ఇందులో సాయిధ‌ర‌మ్ తేజ్‌, క‌ల‌ర్స్ స్వాతి (Colors Swathi) పెళ్లి చేసుకోవ‌టం, ప్రేమ‌తో కౌగిలించుకునే స‌న్నివేశాల‌తో పాటు ఓ మంచి మెసేజ్‌ని జోడించారు. ఈ మ్యూజికల్ షార్ట్‌లోని పాట‌ను టాలెంటెడ్ సింగ‌ర్ శృతి రంజ‌ని (Sruthi Ranjani) కంపోజ్ చేసింది. స‌త్య అనే స్పెష‌ల్ వీడియోతో ఆమె మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా త‌న ప్ర‌యాణాన్ని ప్రారంభిస్తుంది. ఇందులో సాయిధ‌ర‌మ్ తేజ్ సైనికుడిగా నటించారు. ఓ సైనికుడు భార్య దేశం కోసం చేసే త్యాగాన్ని ఇందులో చూపించారు. ఇదే ‘స‌త్య‌’లోని ప్రధానమైన ఎమోష‌న్‌. ఈ ఎమోషన్‌ని మనసుకు హత్తుకునేలా చిత్రీకరించారు.

Swathi.jpg

సాయిధరమ్ తేజ్, కలర్స్ స్వాతి వంటి తమదైన అద్భుతమైన నటనతో మ్యూజికల్ షార్ట్‌లో (Musical Short) భావోద్వేగాల‌ను ప‌లికించారు. మ‌రోసారి వారెంతో మంచి న‌టీన‌టులో ఈ పాట‌తో రుజువైంద‌నే చెప్పాలి. దేశం కోసం పోరాటం చేసే ఎందరో యోధుల‌కు సంబంధించిన సందేశాన్ని తెలియ‌జేయ‌టానికి మేక‌ర్స్ చేసిన ఈ ప్ర‌య‌త్నం ప్రతి ఒక్కరినీ అలరిస్తోంది. సాయిధ‌ర‌మ్ తేజ్‌తో పాటు ఆయ‌న స్నేహితులు హ‌ర్షిత్ రెడ్డి, న‌వీన్ విజ‌య్ కృష్ణ ఈ మ్యూజిక‌ల్ షార్ట్‌లో భాగ‌స్వామ్యులుగా వ్య‌వ‌హ‌రించగా.. దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ (Dil Raju Productions) బ్యాన‌ర్‌పై ‘బలగం’ (Balagam) వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందించిన నిర్మాత‌లు హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత రెడ్డి దీనిని రూపొందించారు. న‌వీన్ విజ‌య్ కృష్ణ (Naveen Vijay Krishna) డైరెక్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి:

***************************************

*Bhagavanth Kesari: బాలయ్య విలన్ పని అయిపోయింది

***************************************

*The Vaccine War: అన్ని మాటలు చెప్పారు.. ‘సలార్’కి పోటీగానే దింపుతున్నారుగా..

***************************************

*Karthikeya: నేనలా అనలేదు.. దయచేసి నటీనటులపై ఇలాంటివి మానుకోండి

***************************************

*VT13: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 13వ చిత్రానికి టైటిల్ ఖరారు.. టైటిల్ ఏంటంటే..

***************************************

Updated Date - 2023-08-15T20:12:43+05:30 IST