Klin Kaara Konidela: ఫస్ట్ ఇండిపెండెన్స్‌ డే.. జెండా ఆవిష్కరించిన క్లీంకార

ABN , First Publish Date - 2023-08-15T21:55:58+05:30 IST

గ్లోబల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తుల జీవితంలో జూన్ 20 ఎంతో కీల‌కం. ఎందుకంటే ఆరోజున క్లీంకార పుట్టుక‌తో వారు త‌ల్లిదండ్రులుగా జీవితంలో కొత్త అంకాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం రెండు నెలలు కూడా నిండని ఈ చిన్నారి.. తన ఫస్ట్ ఇండిపెండెన్స్ ‌డేని సెలబ్రేట్ చేసుకుంది. అమ్మమ్మ, తాతయ్యల సాయంతో జెండా ఆవిష్కరణ కూడా చేసింది. ఆ ఫొటోలను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Klin Kaara Konidela: ఫస్ట్ ఇండిపెండెన్స్‌ డే.. జెండా ఆవిష్కరించిన క్లీంకార
Klin Kaara Konidela First Independence Day Pic

గ్లోబల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ (Ram Charan), ఉపాస‌న (Upasana) దంప‌తుల జీవితంలో జూన్ 20 ఎంతో కీల‌కం. ఎందుకంటే ఆరోజున క్లీంకార (Klin Kaara Konidela) పుట్టుక‌తో వారు త‌ల్లిదండ్రులుగా జీవితంలో కొత్త అంకాన్ని ప్రారంభించారు. క్లీంకార ఆగమనంతో మెగాభిమానులు, కుటుంబ స‌భ్యులు ఎంతో ఆనందంగా ఉన్నారు. అయితే రెండు నెలలు కూడా నిండని క్లీంకార తన మొదటి ఇండిపెండెన్స్ డే (First Independence Day) సెలబ్రేషన్‌ని జరుపుకుంది. స్వయంగా తనే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది కూడా. అవును.. క్లీంకార జెండా ఆవిష్కరణ చేయడం నిజంగా నిజం. అంతే కాదు, స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఈ మెగా ప్రిన్సెస్ (Mega Princess).. ఫేస్ కూడా దాదాపు రివీల్ అయినంత పనయింది. విషయంలోకి వస్తే..


తాజాగా మెగా కోడలు ఉపాసన కొణిదెల కామినేని (Upasana) ట్విట్టర్ వేదికగా రెండు ఫొటోలను షేర్ చేశారు. ‘అమ్మమ్మ, తాతయ్యలతో అమూల్యమైన క్షణాలు. క్లీంకార ఫస్ట్ ఇండిపెండెన్స్‌ డే’ అంటూ ఉపాసన షేర్ చేసిన ఫొటోలలో క్లీంకార ఫేస్ కనిపించి, కనిపించనట్లుగా కాస్త రివీలైంది. అయితే ఈ ఫొటోలలో అమ్మమ్మ, తాతయ్యలు క్లీంకార చేతులు పట్టుకుని.. జెండా ఆవిష్కరణ చేశారు. ఇక ఈ పిక్స్ చూసిన మెగాభిమానుల ఆనందానికి అవధులే లేవంటే నమ్మాలి. క్లీంకారను అసలు ఇంత వరకు బయటికి చూపించలేదు. కానీ ఈ పిక్స్‌లో క్లీంకారను చూసిన వారంతా.. హ్యాపీగా ఫీలవుతున్నారు. ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన ఈ ఫొటోలు సంచలనంగా మారాయి. (Klin Kaara First Independence Day)

Klin-Kaara-Pic.jpg

ఈ ఫొటోలు చూసిన వారంతా.. మెగా ప్రిన్సెస్, వాట్టే మూమెంట్.. క్యూటీ క్లీంకార.. ఇలా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా అయితే ఇండిపెండెన్స్‌ డే రోజు మెగాభిమానులకు ఉపాసన ఇచ్చిన ఈ ట్రీట్.. నిజంగానే ప్రెస్‌లెస్ అని చెప్పుకోవాలి. అందుకే ఆమెకు థ్యాంక్స్ అంటూ కూడా కామెంట్స్‌లో మెన్షన్ చేస్తున్నారు. మరో 5 రోజులలో క్లీంకార 2వ మంత్ బర్త్‌డేని చేసుకోనుంది. ఈ బర్త్‌డేకి చరణ్, ఉపాసనలు ఎలాంటి ట్రీట్ ఇస్తారో.. చూడాలి.


ఇవి కూడా చదవండి:

***************************************

*Vishwak Sen: ఊహించిందే జరిగింది.. పెళ్లి లేద్.. ఏం లేద్..

***************************************

*The Soul Of Satya: సాయిధరమ్ తేజ్, స్వాతి.. జీవించేశారు

***************************************

*Bhagavanth Kesari: బాలయ్య విలన్ పని అయిపోయింది

***************************************

*The Vaccine War: అన్ని మాటలు చెప్పారు.. ‘సలార్’కి పోటీగానే దింపుతున్నారుగా..

***************************************

Updated Date - 2023-08-15T21:55:58+05:30 IST