Vishwak Sen: ఊహించిందే జరిగింది.. పెళ్లి లేద్.. ఏం లేద్..

ABN , First Publish Date - 2023-08-15T20:57:48+05:30 IST

విశ్వక్‌సేన్ రీసెంట్‌గా కొత్త దశలోకి అడుగుపెడుతున్నానంటూ ఓ ప్రకటనను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనతో అంతా ఆయన పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ఊహించారు. అలా ఊహించిన వారందరికీ విశ్వక్‌సేన్ ఝలక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన ‘ఆహా’ ఓటీటీలో హోస్ట్‌గా చేయబోతున్న ఒక షో పబ్లిసిటీ నిమిత్తం విశ్వక్ ఆ ప్రకటన చేసినట్లుగా.. తాజాగా ఆహా రివీల్ చేసిన విషయంతో తెలిసిపోతోంది.

Vishwak Sen: ఊహించిందే జరిగింది.. పెళ్లి లేద్.. ఏం లేద్..
Hero Vishwak Sen

ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలలో విశ్వక్‌సేన్ (Vishwak Sen) దారి వేరు. హీరోగా తనకంటూ సొంత గుర్తింపును.. తనే సొంతంగా సంపాదించుకున్న విశ్వక్‌సేన్.. అన్ని రకాల సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఆయన సినిమాలు విడుదలకు సిద్ధమైన సమయంలో.. చేసే పబ్లిసిటీనే కాస్త తేడాగా ఉంటుంది. రీసెంట్‌గా విశ్వక్ సేన్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఓ ప్రకటనతో అంతా ఆయన పెళ్లి చేసుకుంటున్నాడని అనుకున్నారు. చాలా మంది ఇదేదో పబ్లిసిటీ స్టంట్ అని కూడా ఊహించారనుకోండి. అయితే ఇప్పుడదే నిజమైంది. విశ్వక్‌సేన్ ఆ ప్రకటన చేసింది పెళ్లి కోసం కాదు.. మరి దేని కోసం అనుకుంటున్నారా? ‘ఆహా’ (Aha)లో రాబోతోన్న ఓ షోకి ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. దానికి సంబంధించి ఇచ్చిన చిన్న క్లూ మాత్రమే మొన్న చేసిన ప్రకటన. తాజాగా ఆ షోకి సంబంధించిన వివరాలను ‘ఆహా’ విడుదల చేసింది.


‘‘నా అభిమానులు, శ్రేయోభిలాషులకు నేను తెలియజెప్పేది ఏమిటంటే.. ఇన్నాళ్లుగా నాపై మీరు కురిపించిన ప్రేమ, మద్దతుకు సర్వదా కృతజ్ఞుడిని. ఇప్పుడు జీవితంలో మరో కొత్త దశలోకి అడుగుపెట్టబోతున్నానని తెలియజేసేందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. నేను ఫ్యామిలీ మొదలెట్టబోతున్నాను. వివరాలు త్వరలోనే’’ అని పోస్ట్ చేసి.. ఆగస్ట్ 15న అసలు విషయం రివీల్ చేస్తానని విశ్వక్ సేన్ చెప్పాడు. ఈ ప్రకటనతో అంతా పెళ్లి అనే అనుకున్నారు కానీ.. ఆహాలో ‘ఫ్యామిలీ ధమాకా’ (Family Dhamaka) పేరుతో రెడీ అవుతోన్న షోకి సంబంధించిన ప్రకటన అనే విషయం తాజాగా ఆహా ప్రకటనతో వెల్లడైంది. (Vishwak Sen Host to Aha Show)

Vishwak-Sen.jpg

‘ఫ్యామిలీ ధమాకా.. ఇది మాస్ కా దాస్ ఇలాకా’, ‘ఇది దాస్ ఆడించే ఫ్యామిలీ ఆట’ అంటూ.. ‘ఫ్యామిలీ ధమాకా’కు సంబంధించిన పోస్టర్‌ని ఆహా విడుదల చేసింది. దీంతో ఆయన అభిమానులే కాదు.. ప్రేక్షకులు కూడా.. ఇంతోటి దానికి అంత చేయాలా? అంటూ విశ్వక్‌సేన్‌పై ఫైర్ అవుతున్నారు. ఈసారి నిజంగా నువ్వు పెళ్లి అని చెప్పినా.. ఎవరం నమ్మంకాక నమ్మం అంటూ ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తుండటం విశేషం. మొత్తంగా అయితే ఈ యంగ్ హీరో మరోసారి.. తను చాలా డిఫరెంట్ పర్సన్‌ని అని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs Of Godavari) అనే చిత్రంలో నటిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

***************************************

*The Soul Of Satya: సాయిధరమ్ తేజ్, స్వాతి.. జీవించేశారు

***************************************

*Bhagavanth Kesari: బాలయ్య విలన్ పని అయిపోయింది

***************************************

*The Vaccine War: అన్ని మాటలు చెప్పారు.. ‘సలార్’కి పోటీగానే దింపుతున్నారుగా..

***************************************

*Karthikeya: నేనలా అనలేదు.. దయచేసి నటీనటులపై ఇలాంటివి మానుకోండి

***************************************

Updated Date - 2023-08-15T20:57:48+05:30 IST