Bhagavanth Kesari: బాలయ్య విలన్ పని అయిపోయింది

ABN , First Publish Date - 2023-08-15T18:40:43+05:30 IST

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్ ‘భగవంత్ కేసరి’. ఈ సినిమాకు సంబంధించి విలన్ వర్క్ పూర్తయినట్లుగా తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం దసరాకు విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది.

Bhagavanth Kesari: బాలయ్య విలన్ పని అయిపోయింది
Bhagavanth Kesari Movie Hero and Villain

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కిస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్ ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari). ఈ సినిమాకు సంబంధించి విలన్ వర్క్ పూర్తయినట్లుగా తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం దసరాకు విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. ఈ క్రమంలో దర్శకుడు అనిల్ రావిపూడి అనుకున్న షెడ్యూల్ ప్రకారం చిత్రాన్ని శరవేగంగా చిత్రీకరిస్తున్నారు.


ప్రస్తుతం ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ (Arjun Rampal) తన పోర్షన్‌ షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసుకున్నారని.. ఈ చిత్రంలో ఆయన పాత్ర పేరు రాహుల్ సంఘ్వి అని తెలుపుతూ మేకర్స్ కొన్ని పిక్స్ విడుదల చేశారు. ఈ పిక్స్‌లో అర్జున్ రాంపాల్, బాలకృష్ణ, అనిల్ రావిపూడి ఉన్నారు. అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా యునిక్ కాన్సెప్ట్‌‌తో హై యాక్షన్‌‌గా వుంటుందని మేకర్స్ అంటున్నారు.

Bhagavanth-Kesari.jpg

బాలయ్యని మునుపెన్నడూ చూడని క్యారెక్టర్‌లో అనిల్ రావిపూడి ప్రజంట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ పవర్ ఫుల్ ప్రజన్స్, తెలంగాణ యాసలో డైలాగ్‌లని చెప్పడం ఫ్యాన్స్‌కి అయితే యమా నచ్చేసింది. 19న బాలయ్య బీభత్సమే సృష్టించబోతున్నారనేలా వారు ఈ సినిమాపై నమ్మకం పెట్టుకున్నారు. బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో టాలీవుడ్ క్రష్ శ్రీలీల (Sreeleela) ఓ కీలక పాత్రలో కనిపించనుంది. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

***************************************

*The Vaccine War: అన్ని మాటలు చెప్పారు.. ‘సలార్’కి పోటీగానే దింపుతున్నారుగా..

***************************************

*Karthikeya: నేనలా అనలేదు.. దయచేసి నటీనటులపై ఇలాంటివి మానుకోండి

***************************************

*VT13: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 13వ చిత్రానికి టైటిల్ ఖరారు.. టైటిల్ ఏంటంటే..

***************************************

*Nani: అసలు సిసలు పాన్ ఇండియా యాక్టర్ అతను మాత్రమే.. నాని అలా అనేశాడేంటి?

***************************************

Updated Date - 2023-08-15T18:40:43+05:30 IST