Samantha Ruth Prabhu: ప్రేక్షకులను మైమరిపించేలా ‘శాకుంతలం’ రిలీజ్ ట్రైలర్

ABN , First Publish Date - 2023-04-05T19:55:34+05:30 IST

అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న అందాల భామ సమంత రుత్ ప్రభు (Samantha Ruth Prabhu). హీరోయిన్ సెంట్రిక్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. తాజాగా ఆమె నటించిన సినిమా ‘శాకుంతలం’ (Shaakuntalam). దేవ్ మోహన్ (Dev Mohan) కీలక పాత్రను పోషించారు.

Samantha Ruth Prabhu: ప్రేక్షకులను మైమరిపించేలా ‘శాకుంతలం’ రిలీజ్ ట్రైలర్

అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న అందాల భామ సమంత రుత్ ప్రభు (Samantha Ruth Prabhu). హీరోయిన్ సెంట్రిక్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. తాజాగా ఆమె నటించిన సినిమా ‘శాకుంతలం’ (Shaakuntalam). దేవ్ మోహన్ (Dev Mohan) కీలక పాత్రను పోషించారు. కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ లోని దుష్యంతుడు, శకుంతల కథ ఆధారంగా సినిమాను రూపొందించారు. పాన్ ఇండియాగా నిర్మించారు. మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌లో.. సినిమాలో గ్రాఫిక్స్‌కు పెద్ద పీట వేసినట్టు తెలుస్తోంది. మనసుల పరిచయం కంటే మనుషుల పరిచయం గొప్పదాయే.. కష్టానికి కన్నీళ్లు పెట్టగలం కానీ కర్మను మాత్రం పంచుకోలేం అనే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ట్రైలర్‌ను చూస్తే గ్రాఫిక్స్‌కు పెద్ద పీట వేసినట్టు కనిపిస్తుంది. పులితో దేవ్ మోహన్ పోరాడే సీన్‌తో పాటు యుద్ధ సన్నివేశాలు మెస్మరైజ్ చేశాయి. మొత్తానికి సినిమాను బిగ్‌స్క్రీన్ మీద చూడాలనిపించేలా ట్రైలర్‌ను కట్ చేశారు. ‘శాకుంతలం’ లో శకుంతలగా సమంత, దుష్యంతుడిగా దేవ్ మోహన్, దుర్వాస మహర్షిగా మోహన్ బాబు నటించారు. ఉమెన్ సెంట్రిక్ సినిమాల్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ‘శాకుంతలం’ ని నిర్మించారు. దాదాపుగా రూ.80కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఈ చిత్రానికి గుణ శేఖర్ (Gunasekhar) దర్శకత్వం వహించారు. దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు.

Shaakuntalam Still.jpg

సమంత ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ (Kushi) లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 1న విడుదల కానుంది. వరుణ్ ధావన్ కు జోడీగా ‘సిటడెల్’ (Citadel) లో నటిస్తున్నారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

MM. Keeravani: బాలీవుడ్ సినిమాకు సంగీతం.. హీరో ఎవరంటే..?

Nani-Balakrishna: నానికి 35.. బాలకృష్ణకు 36

Dasara: సీన్‌ను తొలగించాలని డిమాండ్.. థియేటర్స్ వద్ద ధర్నా..

Koffee With Karan: భార్యతో కలిసి రావాలంటూ సౌత్ స్టార్ హీరోలకు పిలుపు.. బుక్ చేస్తాడేమో చూసుకోండి..

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

Updated Date - 2023-04-05T19:55:35+05:30 IST