Ram Gopal Varma: ‘మీ మాటలు వింటుంటే.. చనిపోయినట్లు అనిపిస్తోంది’

ABN , First Publish Date - 2023-03-26T13:46:00+05:30 IST

రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma).. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.

Ram Gopal Varma: ‘మీ మాటలు వింటుంటే.. చనిపోయినట్లు అనిపిస్తోంది’
Ram gopal Varma

రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma).. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. అందరు ఒకలా ఆలోచిస్తే.. ఈయన మరోలా ఆలోచిస్తారు. అంతేకాకుండా.. దేశంలో జరిగిన ప్రతి విషయంపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. అలాగే.. తన విషయంలోనూ వర్మ విభిన్నంగానే స్పందిస్తారు. అది తిట్టినా.. పొగిడినా సరే. తాజాగా వర్మపై ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి (MM Keeravaani) ప్రశంసలు కురిపించారు. దానిపై కూడా వర్మ తనదైన శైలిలో సోషల్ మీడియాలో పోస్టుని షేర్ చేశారు.

ఇటీవలే ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాలోని ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటకి కీరవాణికి ఆస్కార్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో ఆయన స్పందిస్తూ.. రామ్ గోపాల్ వర్మపై ప్రశంసలు కురిపించారు. ఆ ఇంటర్వ్యలో కీరవాణి మాట్లాడుతూ.. ‘నాకు లభించిన మొదటి ఆస్కార్‌ రామ్‌గోపాల్‌ వర్మనే. ప్రస్తుతం వచ్చింద రెండోది. నా కెరీర్‌ స్టార్టింగ్‌లో అవకాశాల కోసం నా మ్యూజిక్‌ క్యాసెట్స్‌ను కొందరికి ఇచ్చా. వాటిని కొందరు చెత్తబుట్టలో పారేశారు. ఇండస్ట్రీకి అంతగా పరిచయం లేని వ్యక్తి వచ్చి నా పాటలు వినండని చెబితే ఎవరు మాత్రం వింటారు. కానీ క్షణక్షణం సినిమాలో వర్మ నాకు ఛాన్స్‌ ఇచ్చారు. ఆయన కెరీర్‌కి ‘శివ’ ఆస్కార్‌ అయితే.. నాకు వర్మ ఆస్కార్‌లాంటి వారు అన్నారు. ఆ అవకాశం తర్వాతే చాలామంది తమ సినిమాకి తీసుకున్నారు’ అని తెలిపారు.

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో కీరవాణి ప్రశంసించడంపై వర్మ విభిన్నంగా రిప్లై ఇచ్చారు. ‘కీరవాణి అలా మాట్లాడుతుంటే నాకు చనిపోయినా భావం కలుగుతోంది. ఎవరైనా చనిపోతేనే వారిని అలా పొగుడుతారు’ అని ఆయన చేసిన ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఈ ట్వీట్ కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీంతో సినీ పరిశ్రమకి చెందిన కొందరూ ఈ ట్వీట్‌పై స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ‘మీరు చాలామంది కెరీర్స్‌కి సపోర్టు చేశారు. మమ్మల్ని ఇన్‌స్పైర్ చేశారు. చాలా చెత్త ప్రచారాలను బద్దలు కొట్టారు. నేను మీ నిశ్శబ్ద్ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను’ అని వికాస్ శర్మ కామెంట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

NTR: ఆ భావోద్వేగం కలిసొచ్చింది.. వారిద్దరూ కలిస్తే అంతేమరి..

Dasara Movie: సుకుమార్‌పై కామెంట్స్.. కాంట్రవర్సీలపై నాని రియాక్షన్ ఏంటంటే..

LEO Video Viral: ఓ సినిమా కోసం ఇంత కష్టపడాలా?

Breaking: హీరో అజిత్ కుమార్ ఇంట విషాదం

Samyuktha Menon: మాట ఇచ్చి ఎందుకు తప్పారు.. ‘విరూపాక్ష’ టీంపై నటి ఫైర్..

NTR30: భయం పుట్టించేందుకు సిద్ధమవుతున్న ఎన్టీఆర్

Kota Srinivasa Rao: ఇలా చేస్తే గుండె ఆగిపోతుంది.. మరణ వార్తలపై స్పందించిన కోటా

Adipurush: ఓంరౌత్ మేలుకో.. ట్రెండింగ్‌లో ప్రభాస్ మూవీ..

Updated Date - 2023-03-26T14:00:50+05:30 IST