Poye Enugu Poye: నిధి బ్యాక్‌డ్రాప్‌లో సినిమా.. విడుదలకు సిద్ధం

ABN , First Publish Date - 2023-06-07T17:09:45+05:30 IST

బాహుబ‌లి ప్ర‌భాక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లో కె.శ‌ర‌వ‌ణ‌న్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న విభిన్నాత్మ‌క చిత్రం ‘పోయే ఏనుగు పోయే’. తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో తెర‌కెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూన్ 9న గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. నిధి బ్రాక్‌డ్రాప్ ఈ సినిమా ఉండనుంది.

Poye Enugu Poye: నిధి బ్యాక్‌డ్రాప్‌లో సినిమా.. విడుదలకు సిద్ధం
Poye Enugu Poye Movie Poster

బాహుబ‌లి ప్ర‌భాక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లో కె.శ‌ర‌వ‌ణ‌న్ (K Saravanan) స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న విభిన్నాత్మ‌క చిత్రం ‘పోయే ఏనుగు పోయే’ (Poye Enugu Poye). ఈ మధ్య హిట్ సినిమాలతో హుషారు రేపుతోన్న భీమ్స్ సిసిరోలియో(Bheems Ceciroleo) సంగీతం స‌మ‌కూర్చారు. ఈ చిత్రం ప్రస్తుతం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో తెర‌కెక్కిన ఈ పాన్ ఇండియా (Pan India) చిత్రాన్ని జూన్ 9న గ్రాండ్‌గా థియేటర్లలోకి తెచ్చేందుకు మేకర్స్ అన్నీ సిద్ధం చేశారు. ఈ సందర్భం చిత్ర దర్శక నిర్మాత కె. శరవణన్ ఈ సినిమా విశేషాలను మీడియాకు తెలియజేశారు.

ఆయన మాట్లాడుతూ.. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో తెర‌కెక్కిన ‘పోయే ఏనుగు పోయే’ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఈనెల 9న గ్రాండ్‌గా విడుద‌ల‌వుతోంది. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌ల‌కు, టీజ‌ర్, ట్రైల‌ర్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. బాహుబ‌లి ప్ర‌భాక‌ర్ (Bahubali Prabhakar) పాత్ర ఈ సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. కొంత మంది నిధిని దక్కించుకోవడానికి ఒక ఏనుగు పిల్లని బలి ఇవ్వాలనుకుంటారు. వారు తలపెట్టిన ఆ బలిని ఒక కుర్రాడు ఎలా ఆపాడు? తన తల్లి దగ్గరకు ఆ ఏనుగు పిల్లని ఎలా చేర్చాడు అన్నది కథాంశం. (Poye Enugu Poye Ready to Release)

ప్ర‌తి సీన్ అడ్వెంచ‌రస్‌గా, ఆహ్లాద‌క‌రంగా ఉంటుంది. ఇప్పటికే సినిమా చూసిన వారంతా.. మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. ఇందులో ధన్ రాజ్, రఘుబాబు, తమిళ నటుడు మనోబాల (Manobala) కీలక పాత్రల్లో నటించారు. అలాగే అవసరమైన మేరకు వాడిన గ్రాఫిక్స్‌తో విజువల్ వండర్‌గా ఈ సినిమా ఉంటుంది. ఈ నెల 9న విడుద‌ల‌వుతోన్న మా చిత్రాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నానని అన్నారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Custody: ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘కస్టడీ’.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

*Adipurush: తిరుమలలో ఓం రౌత్, కృతి సనన్‌ల హగ్గులు, ముద్దులపై ఎవరెలా రియాక్ట్ అవుతున్నారంటే..?

*Prabhas: పెళ్లి ప్రస్తావన.. ప్రభాస్ ఇచ్చిన సమాధానంతో మరింత కన్ఫ్యూజన్!

*Om Raut: శ్రీవారి ఆలయం ముందు చిల్లర పనులు.. హీరోయిన్‌ కృతి సనన్‌కు దర్శకుడు ముద్దు.. భక్తులు ఆగ్రహం

*Adipurush: ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే..

*Liplock: ప్రియ భవానీ శంకర్‌తో సూర్య లిప్‌లాక్‌.. ఇప్పుడిదే హాట్ టాపిక్

Updated Date - 2023-06-07T17:11:52+05:30 IST